SRH vs PBKS: సన్‌రైజర్స్ కొంపముంచిన భువనేశ్వర్ కుమార్! ఆ ఓవర్ కట్టడి చేసుంటే..!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. లీగ్‌లో 8 పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌‌‌పై బౌలింగ్‌లో దుమ్మురేపిన సన్‌రైజర్స్.. భారీ హిట్టర్లు కలిగిన పంజాబ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసంది. కానీ ఆ జోరును బ్యాటింగ్‌లో చూపించలేకపోయింది. చివర్లో జాసన్ హోల్డర్ మెరుపు‌లు మెరిపించడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.

కానీ అతనికి మరో ఎండ్‌లో సహకారం లేకపోవడంతో విజయాన్నందుకోలేకపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో స్వీయ తప్పిదాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ఫామ్ ఇప్పుడు కలవరపెడుతోంది. అతను ఆఖరు ఓవర్‌లో ఇచ్చిన 14 పరుగులే సన్‌రైజర్స్ పాలిట శాపంగా మారాయి. దీనికితోడు బ్యాటింగ్ తప్పిదాలు ఆరెంజ్ ఆర్మీ ఓటమిని శాసించాయి.

భువీ ఆ ఓవర్ కట్టడి చేసుంటే..

భువీ ఆ ఓవర్ కట్టడి చేసుంటే..

పిచ్ నుంచి లభించిన సహకారాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లంతా అందిపుచ్చుకోగా.. భువనేశ్వర్ కుమార్ మాత్రం విఫలమయ్యాడు. అతనొక్కడే ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. నాలుగు ఓవర్లు వేసిన భువీ 34 పరగులిచ్చి ఒక వికెట్ మాత్రం తీశాడు. ముఖ్యంగా అతను వేసిన చివరి ఓవర్‌లో 14 పరుగులిచ్చుకున్నాడు. దాంతో పంజాబ్ 120 పరుగుల మార్క్‌ను ధాటగలిగింది. మిగతా బౌలర్లలా ఈ ఓవర్‌ను భువీ కట్టడి చేసుంటే పంజాబ్ 120 రన్స్ కూడా చేసేది కాదు. అప్పుడు సన్‌రైజర్స్‌కు సైకాలిజికల్‌గా అడ్వాంటేజ్ ఉండేది. పైగా సన్‌రైజర్స్ కూడా బ్యాట్స్‌మన్ అంతా విఫలమైనా 5 పరుగుల తేడాతోనే ఓడింది. భువీ తన చివరి ఓవర్‌లో 10 పరుగుల లోపే ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

డేవిడ్ వార్నర్ చెత్త షాట్..

డేవిడ్ వార్నర్ చెత్త షాట్..

125 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పిచ్‌కు తగ్గ బ్యాటింగ్ వ్యూహం రచించలేకపోయింది. పరుగులు చేయడానికి ఇబ్బందిగా మారిన వికెట్‌పై ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా నిదానంగా ఆడే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ మూడో బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి వార్నర్ మూల్యం చెల్లించుకున్నాడు. అతను గనుక పవర్ ప్లే ముగిసే వరకు ఓపికగా ఆడుంటే సన్‌రైజర్స్ పరిస్థితి మరోలా ఉండేది. భారీ షాట్లు ఆడకుండా క్విక్ సింగిల్స్, డబుల్స్‌పై దృష్టిపెట్టాల్సింది. కనీసం పవర్ ప్లే ముగిసేవరకైనా సన్‌రైజర్స్ వికెట్లు పోకుండా ఉంటే.. ఇతర బ్యాట్స్‌మన్ స్వేచ్చగా ఆడేవారు.

 కేన్ వికెట్.. సాహా రనౌట్

కేన్ వికెట్.. సాహా రనౌట్

ఇక జట్టును గెలిపిస్తాడనుకున్న కేన్ విలియమ్సన్ కూడా దురదృష్టవశాత్తు కట్ బౌల్డ్ అయ్యాడు. ఇదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. పంజాబ్ జట్టులో ఆశలను రేకెత్తించింది. స్లో వికెట్‌పై విలియమ్సన్ నిలకడగా బ్యాటింగ్ చేయగలడు. సింగిల్స్, డబుల్స్‌తో ఒక్కసారిగా దూకుడు పెంచగలడు. గతంలో ఇలాంటి ఇన్నింగ్స్ చాలా ఆడిన కేన్.. దురదృష్టవశాత్తు కట్ బౌల్డ్ అయ్యాడు.

కేన్ ఔటవ్వకుండా ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఇక మనీశ్ పాండే, కేదార్ జాదవ్‌ల్లో ఏ ఒక్కరు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా సన్‌రైజర్స్‌కు కలిసొచ్చేది. ఆలస్యంగానైనా నెమ్మదిగా ఆడుతూ మ్యాచ్ చివరి ఓవర్ వరకు వ్యూహం రచించిన సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ హోల్డర్ సాయంతో అనుకున్నది సాధించింది. కానీ అనవసర టైమ్‌లో సాహా రనౌట్ టీమ్ కొంపముంచింది. క్రీజులో నిలిచిపోయిన సాహా చివరి వరకు ఉన్నా.. హోల్డర్ మ్యాచ్‌ను ముగించేవాడు.

మ్యాచ్ విన్నర్ ఎల్లిస్..

మ్యాచ్ విన్నర్ ఎల్లిస్..

ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లోకి అరంగేట్ర చేసిన నాథన్ ఎల్లిస్.. పంజాబ్ కింగ్స్ రాతను మార్చాడు. ఓడిపోయే మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ముందుగా బ్యాటింగ్‌లో విలువైన పరుగులు జోడించిన అతను.. చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి హోల్డర్‌ను కట్టడి చేశాడు. ఇక అర్ష‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌ కూడా సన్‌రైజర్స్ ఓటమికి కారణమైంది. ఆ ఓవర్‌లో ఒక్క బౌండరీ బాదినా హైదరాబాద్ విజయం సులువయ్యేది. కానీ స్లోయర్, నకుల్, హాఫ్ కట్టర్స్‌తో కట్టడిగా బౌలింగ్ చేసిన హర్ష్‌దీప్ 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో సన్‌రైజర్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమవ్వగా.. నాథన్ ఎల్లిస్ 11 మాత్రమే ఇచ్చాడు.

ఉత్కంఠ విజయం..

ఉత్కంఠ విజయం..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(32 బంతుల్లో 2 ఫోర్లతో 27), కేఎల్ రాహుల్( 21 బంతుల్లో 3 ఫోర్లతో 21) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్(3/19) పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్ తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు మాత్రమే చేసింది. జాసన్ హోల్డర్ (29 బంతుల్లో 5 సిక్స్‌లతో 47 నాటౌట్), వృద్దిమాన్ సాహా(37 బంతుల్లో ఫోర్‌తో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో(3/24) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(2/14) రెండు వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు. లో స్కోరింగ్ గేమ్ అయినా అభిమానులను ఆఖరి బంతి వరకు మునివేళ్లపై నిలబెట్టింది.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, September 26, 2021, 9:15 [IST]
Other articles published on Sep 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X