బియాండ్ ద సైన్స్: అంతుపట్టని బ్రహ్మపదార్థం..ముంబై మ్యాచ్‌లో కోహ్లీ విచిత్రం: గమనించారా

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ ప్రేమికులు ఆ ఘటన పట్ల ఎన్నో రకాలుగా స్పందిస్తున్నారు. అదే రేంజ్‌లో హిలేరియస్ కామెంట్స్ చేస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేప్టెన్ విరాట్ కోహ్లీ సాధించిన ఫీట్ అది. కోహ్లీని ఓ అంతుచిక్కని బ్రహ్మపదార్థంగా అభివర్ణిస్తున్నారు. బియాండ్ ద సైన్స్‌గా పేర్కొంటున్నారు ఫ్యాన్స్.
టాస్ గెలవడమే..
అదే- విరాట్ కోహ్లీ టాస్ గెలవడం. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే- నిజంగా ఇది విచిత్రకరమైన ఘటనే. టీమిండియా కేప్టెన్‌గా విరాట్ కోహ్లీ వరుసగా టాస్‌లను ఓడిపోతోన్నాడు. ఇంగ్లాండ్‌తో ముగిసిన సుదీర్ఘమైన టోర్నమెంట్‌లో అతను టాస్ గెలిచింది రెండుసార్లు మాత్రమే. నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, అయిదు టీ20 ఇంటర్నేషనల్స్, మూడు వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచుల్లో కోహ్లీ రెండుసార్లే టాస్ విన్ అయ్యాడు. టీమిండియా కేప్టెన్‌గా అతని కేరీర్‌లోనూ టాస్ గెలిచిన మ్యాచ్‌లు చాలా తక్కువ.
టాస్ రికార్డ్.. ట్రాక్ రికార్డ్..
అన్ని ఫార్మట్లలోనూ కలిపి 200 మ్యాచ్‌లకు కోహ్లీ కేప్టెన్సీ వహించగా.. అందులో 85 సార్లు మాత్రమే టాస్ గెలిచాడతను. ఏ జట్టు కేప్టెన్‌కు కూడా ఇంత లోయెస్ట్ టాస్ ట్రాక్ రికార్డ్ లేదు. కనీసం వంద మ్యాచ్‌లకు నాయకత్వాన్ని వహించిన టీమిండియా కేప్టెన్ల పేరు మీద ఇంతకంటే మెరుగైన రికార్డే ఉంది. వారితో పోల్చుకుంటే కోహ్లీ ట్రాక్ రికార్డ్ 0.74 శాతం మాత్రమే. అలాంటిది- శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడిన ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో కోహ్లీ టాస్ గెలవడం అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది.
అన్ బిలీవబుల్
తాను టాస్ గెలవడం విరాట్ కోహ్లీని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. టాస్ గెలిచిన వెంటనే అన్ బిలీవబుల్ అంటూ కామెంట్ చేశాడతను. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కొంత బ్రేక్ తీసుకోవడం టాస్ గెలవడానికి కారణమైందంటూ తన మీద తానే జోక్ వేసుకున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో తాను టాస్ గెలవడాన్ని శుభసూచకంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. తాము కప్ కొడుతున్నామని వ్యాఖ్యానించాడు. టాస్ గెలవడం ఓ పాజిటివ్ వైబ్రేషన్స్‌ను కలిగించిందని చెప్పాడు.
మ్యాచ్‌ను గెలిపించింది బౌలర్లే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ముగ్గురు బ్యాట్స్‌మెన్లే రాణించినప్పటికీ.. బౌలర్లు విజృంభించడం ఆ జట్టు విజయానికి బాటలు వేసింది. కేప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ మాత్రమే ఈ మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ స్కోర్‌ను సాధించారు. మిడిలార్డర్‌లో ఏబీ లేకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఏబీ క్రీజ్‌లో పాతుకుని పోవడం.. తనదైన శైలిలో దూకుడుగా ఆడటం ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో- బౌలర్లు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశారు. ఫలితంగా ఆ జట్టు భారీ స్కోర్‌ను సాధించలేకపోయింది. మహ్మద్ సిరాజ్, కైలే జెమిసన్, హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగారు. డేనియల్ క్రిస్టియన్, యజువేంద్ర చాహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. ఈ ముగ్గురి బంతులను ముంబై బ్యాట్స్‌మెన్లు ఎదుర్కొనలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications