ఐపీఎల్.. మరింత కలర్‌ఫుల్: రెండు కొత్త జట్లు రాబోతున్నాయ్: ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

ముంబై: టీ20 ధనాధన్ క్రికెట్ ఫార్మట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఇక మరింత కలర్‌ఫుల్‌గా మారబోతోంది. ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌లో మ్యాచ్‌ల సంఖ్య పెరగనుంది. సుదీర్ఘమైన షెడ్యూల్ ప్రేక్షకులను కట్టిపడేయనుంది. మరో రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వబోతోన్నాయి. ఐపీఎల్ టైటిల్ కోసం జరిగే పోరు ఇకపై మరింత ఉత్కంఠతగా మారనుంది. కొత్త కేప్టెన్, కొత్త ప్లేయర్లు, కొత్త మేనేజ్‌మెంట్, కొత్త టైటిల్ విన్నర్‌ను మనం మున్ముందు చూడబోతున్నాం.

కొత్త ఫ్రాంఛైజీల కోసం
ఈ రెండు జట్ల ఫ్రాంఛైజీల వివరాలన్నింటినీ ప్రకటించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ముహూర్తం కూడా ఖాయం చేసింది. ఓ చారిత్రాత్మక మ్యాచ్ మరుసటి రోజే బీసీసీఐ నుంచి ఈ ప్రకటన వెలువడనుంది. ఈ రెండు కొత్త ఫ్రాంఛైజీల పేర్లు.. ఇతర వివరాలను తెలియాలంటే ఇంకొద్దిరోజులు వేచి చూడాల్సి ఉంటుంది. బీసీసీఐ చేసిన ఈ ప్రకటన- క్రికెట్ లవర్స్‌లో ఇప్పటి నుంచే డిబేట్స్‌కు దారి తీసింది. ఎవరి అంచనాలను వారు వెల్లడిస్తోన్నారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై.

ఇప్పటికే ఎనిమిది టీమ్స్..
ఐపీఎల్‌లో ఇప్పటికే ఎనిమిది జట్లు కొనసాగుతున్నాయి. ఈ సంఖ్య పెరగబోతోంది. 10కి చేరుతుంది. దీనితో పాటు ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరుగుతుంది. సుదీర్ఘమైన షెడ్యూల్ ఉంటుంది ఇకమీదట. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత నైట్ రైడర్స్ జట్లకు తోడుగా మరో రెండు కొత్త టీమ్స్ రానున్నాయి.

అక్టోబర్‌లో ఆ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే..
అక్టోబర్ 17వ తేదీన ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కాబోతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా- 24వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ చారిత్రాత్మక మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే- బీసీసీఐ ఈ రెండు కొత్త ఐపీఎల్ జట్ల వివరాలను వెల్లడిస్తుంది. ఫ్రాంచైజీలు, టీమ్ మేనేజ్‌మెంట్ డీటెయిల్స్‌ను ప్రకటిస్తుంది

కన్‌ఫర్మ్ చేసిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్..
ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ధృవీకరించింది. అక్టోబర్ 25వ తేదీన రెండు కొత్త ఐపీఎల్ జట్ల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఐపీఎల్‌లో ఇండక్ట్ అయ్యే రెండు కొత్త జట్ల వివరాలను వెల్లడించిన వెంటనే.. 2023-2027 మధ్యకాలానికి సంబంధించిన ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్లను కూడా విడుదల చేస్తామని స్పష్టం చేసింది. కొత్త ఐపీఎల్ జట్ల కోసం ప్రతిపాదించిన ఇన్విటేషన్ టు టెండర్ గడువు అక్టోబర్ 10వ తేదీన ముగుస్తుంది.

10 వరకు పొడిగింపు..
నిజానికి- 5వ తేదీ నాడే ఈ టెండర్ల గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని ఇంకో అయిదు రోజుల పాటు పొడిగించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ఇదివరకే నిర్ధారించారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీల కోసం ఆగస్టు 31వ తేదీన ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ టెండర్లను దాఖలు చేయడానికి అక్టోబర్ 5వ తేదీని చివరి గడువుగా నిర్ధారించింది. దీన్ని 10వ తేదీ వరకు పొడిగించినట్లు జయ్ షా తెలిపారు.

10 లక్షల నాన్ రీఫండబుల్ పేమెంట్..
ఈ ఇన్విటేషన్ టు టెండర్‌ను దాఖలు చేయాలంటే ఫ్రాంఛైజీలు 10 లక్షల రూపాయల మొత్తాన్ని నాన్ రీఫండబుల్ పేమెంట్‌గా బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. మధ్యలో టెండర్లను ఉపసంహించుకుంటే.. ఈ అమౌంట్ వెనక్కి రాదు. కొత్త ఫ్రాంఛైజీల కోసం ఇంకా రెండు వారాల పాటు గడవు ఉన్నందున.. మరిన్ని టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఎంట్రీ కావాల్సింది రెండు జట్లే కావడం వల్ల పోటీ తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications