IPL 2021: హమ్మయ్య.. ఎట్టకేలకు స్వదేశం చేరుకున్న ఆసీస్ క్రికెట‌ర్లు! హస్సీ మాత్రం!

IPL 2021 : Many Players Refused Covid Vaccination Before IPL- BCCI || Oneindia Telugu

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. మాల్దీవుల ద్వారా కంగారులు సిడ్నీ నగరం చేరుకున్నారు. అక్కడి నుంచి తమతమ ఇళ్లకు చేరుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2021 వాయిదా పడినప్పటి నుంచి వారు మాల్దీవుల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడే క్వారంటైన్ తరహాలో బస చేశారు. భారత్‌ నుంచి ఆసీస్‌కు నేరుగా విమాన ప్రయాణాలను ఆసీస్ ప్రభుత్వం నిషేధించడమే ఇందుకు కారణం.

ప్రతి ఏటా నిర్వహించే ఐపీఎల్‌ టోర్నీలో విదేశీ ఆటగాళ్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అందులో ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఎక్కువ మంది ఉంటారు. వారు లేని జట్టంటూ దాదాపు ఉండదు. కరోనా వైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ.. బయో బుడగ ఏర్పాటు చేయడంలో ఈసారీ భారీ సంఖ్యలోనే క్రికెటర్లు భారత్ వచ్చారు. వారితో పాటు సహాయ సిబ్బంది, వ్యాఖ్యాతలు కూడా వచ్చారు. సజావుగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా కేసులు వెలుగు చూడటంతో లీగ్‌ నిరవధికంగా వాయిదా పడింది.

'మహ్మద్ అమీర్‌.. బ్లాక్ మెయిల్‌ చేస్తున్నావా? రీఎంట్రీ ఇవ్వడం కోసమేనా ఈ ఎత్తుగడలు'

మిగతా దేశాల ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లినా.. ఆస్ట్రేలియా ప్లేయర్స్ మాత్రం కొన్నాళ్లు మాల్దీవుల్లో ఉండాల్సి వచ్చింది. భారత్‌ నుంచి నేరుగా ఎవ్వరూ రాకూడదని.. క్రికెటర్లకూ మినహాయింపు ఉండదని ఆసీస్‌ ప్రధాని నిబంధనలు పెట్టడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో పాట్ కమిన్స్‌, డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌, మైఖేల్ స్లేటర్‌ సహా 38 మందితో కూడిన కంగారూల బృందం మాల్దీవుల్లో రెండు వారాలు బస చేసింది. ఆ తర్వాత న్యూసౌథ్‌ వేల్స్ ప్రభుత్వం వీరి క్వారంటైన్‌ వ్యవహారాలను పర్యవేక్షించింది. సోమవారం వీరంతా సిడ్నీకి చేరుకున్నారు.

కరోనా బారిన పడిన ఆసీస్‌ మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్‌ హెడ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ.. ఖతార్‌ మీదుగా సోమవారం సాయంత్రం ఆసీస్‌ చేరుకోనున్నాడు. ఐపీఎల్ 2021లో మొత్తం 60 మ్యాచ్‌లకు గాను.. లీగ్ ఆగిపోయేసమయానికి 29 మ్యాచులే పూర్తయ్యాయి. ఒకవేళ ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులు జరగకపోతే.. బీసీసీఐ 2500 కోట్లు నష్టపోనుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే తెలిపారు. ఈ నేపథ్యంలో సీజన్‌ను తిరిగి నిర్వహించే సమయం, వేదిక గురించి బీసీసీఐ యోచిస్తోంది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌నకు బీసీసీఐ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కావున అంతకంటే ముందే సెప్టెంబర్‌లో మిగిలిన సీజన్‌ను నిర్వహించే వీలుంది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 17, 2021, 16:04 [IST]
Other articles published on May 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X