Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: డేవిడ్ వార్నర్ అవుట్: స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా: ఇంటికి ప్రయాణం

 IPL 2021: Australian cricketers including David Warner, Steve Smith could fly back home

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్.. క్రమంగా కళ తప్పుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులు పలువురు క్రికెటర్లకు భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి- విదేశీ ఆటగాళ్లు. కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక్కరొక్కరుగా జట్లను వీడుతున్నారు. స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఇదివరకు ఆండ్రూ టై, ఆ తరువాత స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్ధాంతరంగా ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నారు. ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్‌దీ అదే పరిస్థితి.

తాజాగా- ఆస్ట్రేలియాకే చెందిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా స్వదేశానికి తిరుగుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. స్టీవ్ స్మిత్ ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉంటున్నాడు. ఈ ముగ్గురు కూడా ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకోనే అవకాశాలు ఉన్నాయి. రోజూ లక్షల సంఖ్యలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం.. భారత్‌ నుంచి వచ్చే వారిపై నిషేధిం విధించే అవకాశాలు ఉన్నాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశానికి చెందిన క్రికెటర్లందరూ స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు- రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియన్ అండ్రూ టై అర్ధాంతరంగా ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. తన స్వదేశానికి వెళ్లిపోయాడు. అదే జట్టుకు చెందిన మరో క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్ సైతం తన స్వదేశం ఇంగ్లాండ్‌కు తిరుగుముఖం పట్టాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బయో బబుల్ సెక్యూర్ వ్యవస్థలో మార్పులు చేసిన కారణంగా అతను స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. బ్రిటన్ ప్రభుత్వం భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో చేర్చడం వల్లే లివింగ్‌స్టోన్ స్వదేశానికి వెళ్లాడని సమాచారం.

వేర్వేరు జట్ల తరఫున ఆడుతోన్న మరో ఇద్దరు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ కూడా స్వదేశానికి వెళ్లిపోయారు.ఆదివారం ఉదయమే వారు తమ టీమ్ మేనేజ్‌మెంట్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనుమతి లభించిన వెంటనే తమ లగేజీని సర్దేశారు. రవాణాపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండటంతో ఆ ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా వైదొలగారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను కఠినతరం చేసినందు వల్ల వారు వెనుదిరగాలని నిర్ణయించారు. తాజాగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ సహా గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరికొందరు ఆసీస్ క్రికెటర్లు ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Tuesday, April 27, 2021, 9:17 [IST]
Other articles published on Apr 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+