
అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు
292 మంది ప్లేయర్స్ గురువారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే వీళ్ల నుంచి 61 మంది ప్లేయర్స్‌ను మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. రూ.2కోట్ల బేస్‌ప్రైస్ జాబితాలో హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ ఉన్నారు. అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు జట్టులో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వేలం నేపథ్యంలో ఏ టీమ్ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత మంది ప్లేయర్స్ తీసుకునే అవకాశం ఉందో చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్
ఎంత మంది ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు : 6
అందుబాటులో ఉన్న ప్లేయర్స్: 19
ఎంత డబ్బు ఉంది: రూ.19.9 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్
ఎంత మంది ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు : 8
అందుబాటులో ఉన్న ప్లేయర్స్: 17
ఎంత డబ్బు ఉంది: రూ.13.04 కోట్లు

పంజాబ్ కింగ్స్
ఎంత మంది ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు : 9
అందుబాటులో ఉన్న ప్లేయర్స్: 16
ఎంత డబ్బు ఉంది: రూ.53.2 కోట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్
ఎంత మంది ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు : 8
అందుబాటులో ఉన్న ప్లేయర్స్: 17
ఎంత డబ్బు ఉంది: రూ.10.75 కోట్లు

ముంబై ఇండియన్స్
ఎంత మంది ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు : 7
అందుబాటులో ఉన్న ప్లేయర్స్: 18
ఎంత డబ్బు ఉంది: రూ.15.35 కోట్లు

రాజస్థాన్ రాయల్స్
ఎంత మంది ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు : 9
అందుబాటులో ఉన్న ప్లేయర్స్: 16
ఎంత డబ్బు ఉంది: రూ.15.35 కోట్లు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఎంత మంది ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు : 14
అందుబాటులో ఉన్న ప్లేయర్స్: 14
ఎంత డబ్బు ఉంది: రూ.35.4 కోట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్
ఎంత మంది ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు : 3
అందుబాటులో ఉన్న ప్లేయర్స్: 22
ఎంత డబ్బు ఉంది: రూ.10.75 కోట్లు


Click it and Unblock the Notifications












