Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021 Auction: మొయిన్‌ అలీకి జాక్‌పాట్‌.. గంభీర్ చెప్పినట్టే జరిగింది!!

IPL 2021 Auction: Moeen Ali sold to Chennai Super Kings for 7 Crore

చెన్నై: ఐపీఎల్ 2021 వేలంలో ఇంగ్లండ్ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ మొయిన్‌ అలీ‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. అలీని దక్కించుకొనేందుకు పంజాబ్‌ కింగ్స్‌ పోటీ పడింది. చెన్నైతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోరాడింది. ప్రతిసారి రూ 25లక్షల వంతున పెంచుకుంటూ పోయింది. అయితే చివరికి చెన్నై అతడిని భారీ ధరకు దక్కించుకుంది. ఇక మరో ఇంగ్లండ్ ఆటగాడు, టీ20 ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ను రూ.1.5 కోట్లకే పంజాబ్‌ కింగ్స్‌ సునాయాసంగా దక్కించుకుంది.

వేలానికి రెండు రోజుల ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌.. ఎంఎస్ ధోనీకి ఓ సూచన చేశారు. సీనియర్ హర్భజన్ ‌సింగ్‌ను చెన్నై వేలంలోకి విడుదల చేయడంతో ఈసారి ఒక ఆఫ్‌ స్పిన్నర్‌ను తీసుకోవచ్చని, అది కూడా మొయిన్‌ అలీని తీసుకోవాలని సూచించారు. మరి గౌతీ మాటలను చెన్నై సీరియస్‌గా తీసుకుందో ఏమో తెలియదు కానీ.. మొత్తానికి అతడికి భారీ ధరకు కొనుగోలుచేసింది.

'సీనియర్ హర్భజన్ ‌సింగ్‌ను చెన్నై వేలంలోకి విడుదల చేయడంతో ఈసారి ఒక ఆఫ్‌ స్పిన్నర్‌ను తీసుకోవచ్చు. ఈ స్థానం కోసం ఒక ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కర్న్ శర్మ, ఇమ్రాన్ తాహిర్‌ రూపంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు.. రవీంద్ర జడేజా, సాయి కిషోర్, మిచెల్ సాంట్నర్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్లు జట్టులో ఉన్నారు. భజ్జి స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీని తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అలీ రెండు విధాలుగా పనికొస్తాడు. తొలి ఓవర్ (కొత్త బంతితో) బౌలింగ్ చేయగలడు.. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలడు. అలీ గొప్ప టీ20 ఆటగాడు' అని గౌతీ అన్నారు.

ఇక దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ వేలంలో సంచ‌ల‌నం సృష్టించాడు. అత‌డు ఏకంగా రూ.16.25కోట్ల‌కు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ అత‌న్ని ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో గ‌తంలో ఎప్పుడూ ఏ ప్లేయ‌ర్ ఈ ధ‌ర ప‌ల‌క‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ యువ‌రాజ్ రూ.16 కోట్ల‌తో తొలి స్థానంలో ఉండగా.. ఇప్పుడా రికార్డు కూడా మ‌రుగున ప‌డిపోయింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఓ విదేశీ ప్లేయ‌ర్‌కు గ‌తంలో రూ.15.5 కోట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఆస్ట్రేలియా బౌల‌ర్ క‌మిన్స్‌ను ఈ భారీ మొత్తానికి కోల్‌క‌తా కొనుగోలు చేసింది. మోరిస్ ఆ రికార్డును కూడా తిర‌గ‌రాశాడు.

Story first published: Thursday, February 18, 2021, 16:41 [IST]
Other articles published on Feb 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+