
చెన్నై: ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి వేళయింది. ఈ ఏడాది 14వ సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో ప్రారంభమైంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. 8 ఫ్రాంచైజీలు మొత్తం కలిపి 61 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. భారత ఆటగాళ్లతో పాటు విదేశీ స్టార్ క్రికెటర్లూ బరిలో నిలవడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు అవకాశం కోసం ఎదురుచూస్తున్న దేశవాళీ కుర్రాళ్లకూ మంచి ధర పలికే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి.
ఐపీఎల్ 2021 వేలంలో ఎక్కువగా ఆకర్షిస్తోంది ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలనే. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్‌వన్ టీ20 ఆటగాడైన మలన్.. ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. గతేడాది ఐపీఎల్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై ఫ్రాంఛైజీలు కన్ను వేశాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని చేజిక్కించుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇరు ఫ్రాంచైజీలు పోటీపడితే మాత్రం అతనిపై కోట్లు కురిసే అవకాశముంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి కూడా వేలంలో చెప్పుకోదగ్గ ధర పలకొచ్చు. మనోడిని కూడా చెన్నై తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వివరాలు:
వేలంలో ఆటగాళ్లు: 292 మంది
భారత్ నుంచి: 164
విదేశీ ప్లేయర్లు: 125
అసోసియేట్ దేశాల నుంచి: 3
జట్లలో మొత్తంగా ఖాళీ స్థానాలు: 61
అందులో విదేశీ ఆటగాళ్లకు: 22
ఐపీఎల్ 2021- ఆటగాళ్ల వేలంపాటకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం:
1. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్) 2. జాసన్ రాయ్ (ఇంగ్లండ్) 3. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) 4. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) 5. హనుమ విహారీ(భారత్) 6. అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా) 7.షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్) 8. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) 9. డారెన్ బ్రావో(వెస్టిండీస్) 10. కోరె అండర్సన్(న్యూజిలాండ్) 11. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) 12. వరుణ్ ఆరోన్ (భారత్) 13. మోహిత్ శర్మ(భారత్) 14. మిచెల్ మెక్లీన్‌గన్ (న్యూజిలాండ్) 15. జాసన్ బెహ్రెన్‌డాఫ్ (ఆస్ట్రేలియా) 16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా)
ముగిసిన తొలి సెషన్ ఆక్షన్
మిచెల్ మెక్లీగన్,మోహిత్ శర్మ,బిల్లీ స్టాన్‌లేక్,జేసన్ బెండ్రాఫ్,నవీన్ ఉల్ హక్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని జట్టు యాజమాన్యాలు
మార్నస్ లబుషేన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని యాజమాన్యాలు
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ హెన్రీక్స్‌ను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ ఆక్షన్ నుంచి తప్పుకున్న మార్క్ వుడ్
కివీస్ పేసర్ కైల్ జేమీసన్‌ను రూ.15 కోట్లతో సొంతం చేసుకున్న బెంగళూరు జట్టు
చటేశ్వర్ పుజారాను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
చివరినిమిషంలో రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటూ ఫ్యాన్స్ ను ట్వీట్ ద్వారా కోరిన ప్రీతి జింటా
Still at it .... how are we doing folks ? Any last minute recommendations ? #PunjabKings #PBKS #Iplauction2021 #Iplauction #Ting 🏏👊 @PunjabKingsIPL pic.twitter.com/la2IbbjVMz
— Preity G Zinta (@realpreityzinta) February 18, 2021
కైల్ జేమీసన్ కోసం ఎదురుచూస్తున్న ప్రీతి జింటా టీమ్
జే సుచిత్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
రూ.20 లక్షలకు రాజస్థాన్ రాయల్స్‌కు అమ్ముడుపోయిన కేసీ కరియప్ప

ఆస్ట్రేలియన్ పేసర్ రిలే మెరిడిత్‌ను రూ.8 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
మొహ్మద్ అజారుద్దీన్‌ను రూ.20లక్షలకు కొనుగోలు చేసిన బెంగళూరు జట్టు
బేస్ ధర రూ.20 లక్షలుగా ఉన్న చేతన్ సకారియాను రూ.1.20 కోట్లతో కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
భారత వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ విష్ణు వినోద్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

కె.గౌతమ్‌ను రూ.9.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్

బేస్ ధర రూ.20 లక్షలుగా ఉన్న షారుఖ్‌ఖాన్‌ను రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ జట్టు
సచిన్ బేబిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన బెంగళూరు జట్టు
హర్భజన్ సింగ్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని యాజమాన్యాలు
ధోనీ నాయకత్వంలో ఆడటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను: మోయిన్ అలీ
Moeen Ali Words On Joining @ChennaiIPL 🤩
— DHONI GIFS™ (@DhoniGifs) February 18, 2021
Welcome To SuperKings Family 🦁💛..#WhistlePodu #MSDhoni pic.twitter.com/QFPapXPYX1
డేవిడ్ మలన్, జాయ్ రిచర్డ్‌సన్‌లను కొనుగోలు చేసిన ఆనందంలో పంజాబ్ జట్టు యజమానురాలు ప్రీతి జింతా ఇంట్రెస్టింగ్ ట్వీట్
Lights , Camera .... Auction ! It’s all so nerve wrecking .... Stay tuned for some more action... oops Auction 👊 #PunjabKings #PBKS #Iplauction2021 #Iplauction #Ting 🏏❤️ pic.twitter.com/jwREXmWOtP
— Preity G Zinta (@realpreityzinta) February 18, 2021

జాయ్ రిచర్డ్‌సన్‌ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ జట్టు
జాయ్ రిచర్డ్‌సన్ కోసం పోటీ పడుతున్న బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ జట్లు
ఆడం మిల్నేను రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
రాజస్థాన్ రాయల్స్‌కు రూ.1. కోటికి అమ్ముడుపోయిన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఆలెక్స్ కేరీ, శాం బిల్లింగ్స్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని బిడ్డర్లు
1.5 కోట్లతో డేవిడ్ మలన్‌ను దక్కించుకున్న పంజాబ్ జట్టు
రూ.16.25 కోట్లకు క్రిస్ మారిస్‌ను దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
రూ.16.25 కోట్లకు క్రిస్ మారిస్‌ను దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
రూ.15 కోట్లు క్రిస్ మారిస్ పై వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాదు

మ్యాక్స్‌వెల్ బెంగళూరు జట్టు కొనుగోలు చేయడంతో సంబరాలు చేసుకుంటున్న ఆర్‌సీబీ ఫ్యాన్స్
క్రిస్ మారిస్ కోసం పోటీ పడుతోన్న ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రూ.4.4 కోట్లకు శివం దూబేను దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్

రూ.7 కోట్లకు మోయిన్ అలీని దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్

రూ.3.2 కోట్లతో షకీబుల్ హసన్‌ను దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
వేలంపాటలో అమ్ముడుపోని భారత ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్

గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ.14.25 కోట్లకు దక్కించుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు
గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం పోటీపడుతోన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు
ఆసీస్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ కోసం ఆర్‌సీబీ, చెన్నై సూపర్‌కింగ్స్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. అతడి ధర రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్లకు చేరుకుంది. పోటీ ఇంకా కొనసాగుతోంది.
రూ.2.20 కోట్లకు స్టీవ్ స్మిత్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను ఎవరు కొనుగోలు చేయలేదు. హనుమ విహారికి కూడా చేదు అనుభవం
ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను ఎవరు కొనుగోలు చేయలేదు. హనుమ విహారికి కూడా చేదు అనుభవం
ఆక్షన్‌కు ఆకర్షణీయమైన దుస్తులు ధరించి హాజరైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
స్టీవ్ స్మిత్ కోసం పోటీ పడుతోన్న ఆర్‌సీబీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 20221 వేలం ప్రారంభం అయింది. మొదటగా కరుణ్ నాయర్ వేలంలోకి వచ్చాడు. అతడితో పాటు అలెక్స్ హేల్స్ అమ్ముడుపోలేదు.
తమిళనాడు పేసర్ తంగరసు నటరాజన్‌పై ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రశంసల వర్షం కురిపించారు. నటరాజన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడని, ఆస్ట్రేలియాకు నెట్ బౌలర్‌గా వెళ్లి టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడని కొనియాడాడు.
ఐపీఎల్ 2021 ఎడిషన్‌కు 'వివో' స్పాన్సర్‌గా ఉంటుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు.
ఐపీఎల్ వేలానికి ఒక రోజు ముందు ఇంగ్లండ్ క్రికెటర్ మార్క్ వుడ్ తప్పుకున్నాడు. వేలంలో రూ.2 కోట్ల ఆటగాళ్ల జాబితాలో ఉన్న వుడ్.. కుటుంబంతో తగిన సమయం కేటాయించేందుకే ఈ ఏడాది లీగుకు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని నిర్వహకులు ఫ్రాంచైజీలకు తెలియజేశారు.
టీమిండియా ప్లేయర్ హనుమ విహారితో సహా 14 మంది యువ ఆటగాళ్లు రేసులో ఉన్నారు. గత సీజన్‌లో ఎవ్వరూ తీసుకోని విహారి ఒకటిన్నర కోట్ల బేస్‌ప్రైజ్‌తో పోటీలో నిలిచాడు. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లోనూ ఆడని ఆల్‌రౌండర్ బావనక సందీప్‌తో పాటు హైదరాబాద్ నుంచి మిలింద్, యుధ్‌వీర్, అజయ్ దేవ్‌గౌడ్, టి, రవితేజ, తనయ్, తిలక్, భగత్ వర్మ రూ.20 లక్షల బేస్‌ప్రైజ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరంతా ఆల్‌రౌండర్లే. ఇదే బేస్‌ప్రైజ్‌తో ఆంధ్ర నుంచి కీపర్ కేఎస్ భరత్, పేసర్లు సీహెచ్ స్టీఫెన్, పృథ్వీరాజ్, హరిశంకర్ రెడ్డి, ఆల్‌రౌండర్ షోయబ్ కూడా తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు.
ప్రస్తుతం రాజస్థాన్ రూ.37.85 కోట్ల నగదుతో ఉండగా, పంజాబ్ లీగ్‌లోనే అందరికన్నా ఎక్కువ మొత్తం రూ.53.2 కోట్ల నగదుతో వేలంలో పాల్గొనబోతోంది.
హగ్ ఎడ్‌మీడ్స్ ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తి. ఆయన చాలా కాలం నుంచి ఫ్రీలాన్సర్ ఆక్షనీర్‌గా పనిచేస్తున్నారు. 1984లో ఆయన తొలిసారిగా వేలం పాడే వ్యక్తిగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి నుంచి ఇప్పటివరకు దాదాపు 2,300 పైగా ఆక్షన్‌లను ఆయన నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వయసు 62 సంవత్సరాలు.
ఐపీఎల్ 2021 వేలాన్ని హగ్ ఎడ్‌మీడ్స్ అనే వ్యక్తి నిర్వహించబోతున్నాడు. అయితే ఇతడికి క్రికెట్‌తో ఎలాంటి సంబంధం లేదు. కానీ బీసీసీఐ ఎంతో ఘనంగా నిర్వహించబోయే ఈ వేలానికి మాత్రం ఇతడినే ఆక్షనీర్ (వేలం వేసే వ్యక్తి)గా నియమించారు.
ఈ రోజు ఆటగాళ్ల వేలం పాటను లీడ్ చేయనున్న అంతర్జాతీయ ఆక్షనీర్ హ్యూజ్ ఎడ్మీడ్స్
చెన్నై వేదికగా జరగనున్న ఐపీఎల్ మినీ వేలం
అందరి కళ్లు మ్యాక్స్‌వెల్ పైనే,మ్యాక్స్‌వెల్‌ను రిలీజ్ చేసిన పంజాబ్ జట్టు
మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఐపీఎల్ మినీ వేలం