For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 Auction: ఎన్నో అంచనాలు పెట్టుకున్న మలన్‌కు షాకే.. తక్కువ ధరకే సొంతం చేసుకున్న పంజాబ్!!

IPL 2021 Auction: Dawid Malan sold to Punjab Kings for 1.50 Crores
IPL 2021 Auction : England's Dawid Malan Picked By Punjab For Rs 1.5 cr

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021లో ఇంగ్లండ్ టీ20‌ స్పెసలిస్ట్, వరల్డ్ నంబర్‌వన్‌ టీ20 ఆటగాడైన డేవిడ్‌ మలన్‌కు షాక్ తగిలింది. వేలంలో మలన్‌ను రూ.1.5 కోట్లకే పంజాబ్‌ కింగ్స్‌ సునాయాసంగా దక్కించుకుంది. ఎలాంటి పోటీ లేకుండగానే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జట్టు పంజాబ్ కొనుగోలుచేసింది. తక్కువ ధరే పలికినా.. ఈ సీజన్‌తో మలన్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. మలన్‌ను తక్కువ ధరకే కొనుక్కుని పంజాబ్ జాక్‌పాట్‌ కొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

న్యూజిలాండ్‌ పేసర్‌ ఆడమ్‌ మిల్న్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. రూ. 50లక్షల కనీస ధరలో ఉన్న అతడి కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ పోటీ పడింది. ఆఖర్లో హైదరాబాద్‌ రంగంలోకి దిగినా ముంబై అతడిని దక్కించుకుంది. బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.కోటికి దక్కించుకుంది. ఆసీస్‌ పేసర్‌ నేథన్‌ కౌల్టర్‌ నైల్‌ను మరోసారి ముంబై దక్కించుకుంది. రూ.1.5 కోట్ల కనీస ధర నుంచి అతడు రూ. 5 కోట్లు పలకడం గమనార్హం. ఢిల్లీ చివరి వరకు పోటీపడ్డా ముంబైనే అతడిని సొంతం చేసుకుంది. భారత పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను ఢిల్లీ కేవలం రూ.కోటికే సొంతం చేసుకుంది. మరెవ్వరూ అతడి కోసం ఆసక్తి ప్రదర్శించలేదు.

ఆసీస్‌ పేసర్‌ జే రిచర్డ్‌సన్‌ కాసుల పంట పండించాడు. ఐపీఎల్‌ వేలంలో అతడిని పంజాబ్‌ కింగ్స్‌ రూ.14 కోట్లకు దక్కించుకుంది. అతడి కోసం ఢిల్లీ, బెంగళూరు, ముంబై చివరి వరకు పోటీపడ్డాయి. అయితే పంజాబ్‌ చివరకు అతడిని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. పవర్‌ హిట్టర్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబెను రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. హైదరాబాద్‌ ఓపెనింగ్‌ బిడ్‌ వేయగా చివరికి రూ.4.4 కోట్లకు రాయల్స్‌ దక్కించుకుంది.

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ కోసం అన్ని జట్లు విపరీతంగా పోటీపడ్డాయి. రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. చివరి వరకు అతడి కోసం పంజాబ్‌ కింగ్స్‌ పోటీ పడింది. మొదట బెంగళూరు ధర పెంచుతూ పోయింది. రూ.5 కోట్లు దాటగానే ముంబై రంగంలోకి దిగింది. రూ.12 కోట్లు దాటగానే రాజస్థాన్‌ రాయల్స్‌ వచ్చింది. ఈ క్రమంలో పంజాబ్‌, రాయల్స్‌ రూ.16 కోట్ల వరకు పోటీపడ్డాయి. చివరికి పంజాబ్‌ అతడిని రాయల్స్‌కే విడిచిపెట్టక తప్పలేదు.

Story first published: Thursday, February 18, 2021, 17:10 [IST]
Other articles published on Feb 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+