
కోహ్లీని ఎత్తుకున్న అనుష్క
గతంలో చేసిన ఓ యాడ్ షూట్‌కు సంబందించిన ఘటనను అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. సెట్లో ఉన్న విరాట్ కోహ్లీని.. వెనుక నుంచి కౌగిలించుకున్నారు అనుష్క. ఆ తర్వాత తన భర్తను ఈజీగా రెండు చేతులతో పైకి లేపారు. అనుష్క లిఫ్టింగ్ స్టంట్స్ చూసిన కోహ్లీ.. ఓ తేరీ అంటూ షాక్ అయ్యాడు. మరోసారి పైకి లేపాలంటూ అనుష్కను కోరాడు. ఎటువంటి హెల్ప్ తీసుకోకుండానే.. మళ్లీ విరాట్‌ను తన చేతులతో బిగించి అనుష్క సునాయాసంగా ఎత్తుకున్నారు. ఆపై అనుష్క యాహూ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

ఇది నేనే చేశానా
ఆ వీడియోను పోస్టు చేసిన అనుష్క శర్మ.. 'ఇది నేనే చేశానా' అంటూ కామెంట్ పెట్టారు. అనుష్క పెట్టిన కామెంట్‌కు విరాట్ కోహ్లీ కూడా రిప్లై ఇచ్చాడు. ఇక ఆ వీడియోకు అతి తక్కువ సమయంలోనే తెగ లైక్‌లు వచ్చేశాయి. ఈ వీడియోను వీక్షించిన అభిమానులు 'సూపర్ అనుష్క', 'మీ జంట ఎల్లప్పుడూ కలిసి ఉండాలి', 'మీరిద్దరూ మాకు ఇలాగే వినోదం పంచుతూ ఉండాలి' అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2021 కోసం చెన్నైలో ఉన్నాడు. అనుష్క కూడా కోహ్లీతో అక్కడే ఉన్నారు.
షాంఫూ యాడ్ షూటింగ్లో
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్లో తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. అనుష్క డెలివరీ సమయంలో ఆమె చెంత ఉండేందుకు పెటర్నటీ లీవ్‌పై కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేశాడు. గత జనవరి 11న కుమార్తెకు జన్మనిచ్చారు. పాప పుట్టిన 21 రోజుల అనంతరం అనుష్క తన మొదటి ఫొటోను షేర్ చేసి చిన్నారి పేరును వెల్లడించారు.

ముంబైతో బెంగళూరు ఢీ
ప్రస్తుతం ఐపీఎల్ 2021 టోర్నీతో విరాట్ కోహ్లీ బిజీగా ఉన్నాడు. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ప్లేఆప్స్ చేర్చిన కోహ్లీ.. ఈసారి టైటిల్ ఏ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభమయి మే 30తో ముగుస్తుంది. ఏప్రిల్ 9వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కానుంది. ఈసారి ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ జట్టుతో కలవడంతో బెంగళూరు బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం అయింది.
IPL 2021: ఇది పక్కా.. రోహిత్ శర్మ ఆరోసారీ ఐపీఎల్ టైటిల్ గెలుస్తాడు: చహర్