MI vs KKR: ప్లేయర్ ఎలెవెన్స్‌ను పిక్ చేసిన ఆకాష్ చోప్రా: ప్రిడిక్షన్స్ ఇవే..

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో మరో హైఓల్టేజ్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను పలకరించబోతోంది. కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఢీ కొనబోతోన్నాయి. అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం దీనికి వేదికగా మారింది. సెకెండ్ హాఫ్‌లో ఈ రెండు జట్లకూ ఇది రెండో మ్యాచ్. సెకెండ్ హాఫ్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. కోల్‌కత నైట్ రైడర్స్ విజయాన్ని అందుకుంది. తన పాయింట్ల సంఖ్యను పెంచుకోగలిగింది. రెండు జట్లకూ ఇది కీలకమే.

రోహిత్ సేన బోణీ కొడుతుందా?

రోహిత్ సేన బోణీ కొడుతుందా?

టైటిల్ హాట్ ఫేవరెట్‌గా గుర్తింపు తెచ్చుకుంది ముంబై ఇండియన్స్. ఆ స్థాయిలో ఆడట్లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనే గత ఏడాది ముగిసిన ఐపీఎల్ 2020లో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది రోహిత్ టీమ్. గత ఏడాది టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఇప్పుడు కూడా అలాంటి అంచనాలతోనే ఈ సీజన్‌ను ఆరంభించినప్పటికీ- పరాజయాలను చవి చూస్తూ వస్తోంది. ఇప్పటిదాకా ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన ముంబై.. నాలుగింట్లో గెలిచింది. మొత్తం ఎనిమిది పాయింట్లతో టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ ఓడితే తన స్థానాన్ని మరింత దిగజార్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

కోల్‌కత బెటర్‌గా

కోల్‌కత బెటర్‌గా

ఇవాన్ మోర్గాన్ కేప్టెన్సీలోని కోల్‌కత నైట్ రైడర్స్ ఎమిరేట్స్ గడ్డపై సెకెండ్ హాఫ్‌ను విజయంతో మొదలు పెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై తిరుగులేని గెలుపును అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి పించ్ హిట్టర్లు ఉన్న జట్టును వంద పరుగుల్లోపే కట్టడి చేసింది. అనంతరం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి.. విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో తన పాయింట్లను మెరుగుపర్చుకోగలిగింది. ఇంకొక్క విజయం సాధించితే.. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకడం ఖాయం.

ఈ మ్యాచ్‌లో ఎవరెవరు..

ఈ మ్యాచ్‌లో ఎవరెవరు..

రెండు జట్లకూ కీలకంగా మారిన ఈ మ్యాచ్‌ కోసం రెండు జట్ల తరఫున ఆడే ప్లేయర్ ఎలెవెన్స్‌ను పిక్ చేశాడు ఆకాష్ చోప్రా. రాయల్ ఛాలెంజర్స్ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తాడని అతను అంచనా వేశాడు. శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్ సత్తా చాటుతారని అభిప్రాయపడ్డాడు. ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ కూడా కీలకంగా వ్యవహరిస్తాడని, అతను క్రీజ్‌లో కుదురుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

 ఆకాష్ చోప్రా ప్రిడిక్షన్స్ ఇవే..

ఆకాష్ చోప్రా ప్రిడిక్షన్స్ ఇవే..

ఆకాష్ చోప్రా ప్రిడిక్షన్స్ ప్రకారం.. కోల్‌కత నైట్ రైడర్స్ జట్టులో శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇవాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తిక్, సునీల్ నరైన్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ తుదిజట్టులో ఉంటారు. ముంబై ఇండియన్స్‌ తుదిజట్టులో క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కీరన్ పొల్లార్డ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఆడమ్ మిల్నె, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఉంటారని పేర్కొన్నాడు.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 22 - October 28 2021, 07:30 PM
ఆస్ట్రేలియా
శ్రీలంక
Predict Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, September 23, 2021, 14:06 [IST]
Other articles published on Sep 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X