న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇయాన్ ఇదేం కెప్టెన్సీ.. నువ్వు ఓవర్‌సీస్ ప్లేయర్ కాకుంటే నీ కెప్టెన్సీనే ఊడేది!

IPL 2021: Aakash Chopra and Gautam Gambhir questions Eoin Morgan’s tactics against RCB

న్యూఢిల్లీ: కోల్‌కతానైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై భారత మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, గౌతం గంభీర్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 38 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అనాలోచిత నిర్ణయాలే కారణమని ఈ భారత మాజీ ఓపెనర్లు అభిప్రాయపడ్డారు.

మైదానంలో మోర్గాన్ అనుసరించాల్సిన వ్యూహాలు ఆర్‌సీబీకి లాభం చేకూర్చాయన్నారు. ఆర్‌సీబీని ఆదిలోనే దెబ్బకొట్టిన వరుణ్ చక్రవర్తిని కొనసాగించకుండా మోర్గాన్ మూల్యం చెల్లించుకున్నాడని విమర్శించారు.

వరుణ్ చక్రవర్తిని కొనసాగించకుండా..

వరుణ్ చక్రవర్తిని కొనసాగించకుండా..

తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆర్‌సీబీ-కేకేఆర్ మ్యాచ్‌ను విశ్లేషించిన ఆకాశ్ చోప్రా.. మోర్గాన్ టాక్టిక్స్‌ను ప్రశ్నించాడు. 'ఆర్‌సీబీని ఆదిలోనే దెబ్బతీసిన వరుణ్ చక్రవర్తితో బౌలింగ్ కొనసాగించకుండా మోర్గాన్ పెద్ద తప్పిదం చేశాడు. అతన్ని ఆ స్పెల్‌లో అలానే కొనసాగించి ఉంటే డేంజరస్ బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఔటయ్యేవాడు.

అలా చేయకుండా షకీబ్ అల్ హసన్‌ను తీసుకొచ్చి మ్యాక్సీ క్రీజులో నిలదొక్కుకునేలా చేశాడు. అంతేకాకుండా 19వ ఓవర్‌లో ఆశ్చర్యకరంగా హర్భజన్ సింగ్‌కు బంతినిచ్చాడు. ఆ ఓవర్‌లో భజ్జీ ధారళంగా పరుగలిచ్చుకున్నాడు. ఏబీ డివిలియర్స్, కైల్ జెమీసన్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అని మోర్గాన్ భజ్జీకి బంతి ఇచ్చి ఉంటాడు. కానీ అతని వ్యూహం బెడిసికొట్టింది. ఆ టైమ్‌లో షకీబ్‌తో బౌలింగ్ చేయించి ఉంటే వేరేలా ఉండేది.

ఓవర్‌సీస్ కెప్టెన్ కాకపోయుంటే..

ఓవర్‌సీస్ కెప్టెన్ కాకపోయుంటే..

భారీ లక్ష్యచేధనకు దిగినప్పుడు ఆండ్రూ రస్సెల్‌ను అప్‌ది ఆర్డర్ పంపించాల్సింది. రస్సెల్ ఓ 40 బంతులు ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేది. 9వ ఓవర్‌లో అతను బ్యాటింగ్‌కు దిగుంటే సులువుగా మ్యాచ్‌ను గెలిపించేవాడు. ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్‌లో మోర్గాన్ కెప్టెన్సీ చాలా ఆర్డినరీగా ఉంది. గంభీర్ చెప్పినట్లు అతను ఓవర్‌సీస్ కెప్టెన్ కాకపోయి ఉంటే భారత మీడియా ఇప్పటికే అతనిపై వేటు వేయాలని డిమాండ్ చేసేది. ఓవర్‌సీస్ కెప్టెన్ కావడంతోనే అతని తప్పిదాలపై ఎవరూ మాట్లాడటం లేదు.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

నా జీవితంలో చూడలేదు.

నా జీవితంలో చూడలేదు.

ఆర్‌సీబీ ఇన్నింగ్స్ అనంతరం మోర్గాన్ కెప్టెన్సీపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నీ కెప్టెన్సీ నువ్వు.. నీలాంటి కెప్టెన్‌ను నా జీవితంలో చూడలేదు. కోహ్లీ, పటిదార్‌లను ఔట్‌ చేసిన వరుణ్‌ చక్రవర్తిని పక్కన పెట్టి షకీబుల్‌ హసన్‌ను ఎందుకు తీసుకొచ్చావ్‌. ఒక ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బౌలర్‌ను కాదని అతని స్పెల్‌నే మార్చేశావ్‌. వరుణ్‌తో రెండో ఓవర్‌ వేయించి, నాల్గో ఓవర్‌ను షకీబుల్‌కు చేత వేయించావు. నీలాంటి కెప్టెన్సీని నేను ఎక్కడా చూడలేదు. నా జీవితంలోనే ఈ తరహా కెప్టెన్సీ ఎరుగను. చాలా విచిత్రమైన కెప్టెన్సీ నీది. వరుణ్‌ చక‍్రవర్తి చేతికి బంతి ఇచ్చి ఉంటే, మ్యాక్స్‌వెల్‌ వికెట్‌ను తీసే అవకాశం ఉండేది. అప్పుడు మ్యాచ్‌ కేకేఆర్‌ వైపు ఉండేది'అని గంభీర్ తీవ్రంగా విమర్శించాడు.

మోర్గాన్ కౌంటర్..

మోర్గాన్ కౌంటర్..

ఈ విమర్శలపై మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ మోర్గాన్ కౌంటరిచ్చే ప్రయత్నం చేశాడు.'మేం వరుణ్‌ చేత పవర్‌ ప్లేలో బౌలింగ్‌ చేయించకపోవడానికి కారణం ఉంది. అప్పుడే మ్యాక్స్‌వెల్‌ వచ్చాడు. మ్యాక్సీ విధ్వంసకర ఆటగాడు కానీ అతనొకడే ఆర్సీబీ జట్టులో స్టార్‌ ప్లేయర్‌ కాదు కదా. ఏబీ డివిలియర్స్‌ ఉన్నాడు. బ్యాటింగ్‌లో ఆర్సీబీ చాలా బలమైనది. వారిని అడ్డుకోవాలనే వ్యూహంలో భాగంగానే వరుణ్ ఓవర్లను ఆపుకోవాల్సి వచ్చింది. ఒక్క ఆటగాడి కోసమే గేమ్‌ ప్లాన్‌ అనేది ఉండదు'అని మోర్గాన్‌ తన వ్యూహాలను సమర్థించుకున్నాడు.

Story first published: Monday, April 19, 2021, 15:13 [IST]
Other articles published on Apr 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X