ఫస్ట్ మ్యాచ్..మస్త్: ఆర్సీబీ గెలవడానికి కారణాలివే: ట్రెడీషన్ కంటిన్యూస్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ తొలి మ్యాచ్.. క్రికెట్ ప్రేమికుల అంచనాలకు అనుగుణంగా సాగింది. వారిని ఏ మాత్రం నిరాశ పర్చలేదు. ఫైనల్ బాల్ విక్టరీ.. ఈ లో-స్కోర్ మ్యాచ్‌లో హైలైట్. క్రికెట్ ఆరాధకులకు కావాల్సింది కూడా అదే. తక్కువ స్కోర్ నమోదైనప్పటికీ.. మ్యాచ్ చిట్టచివరి బంతి వరకూ సాగడం తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్టలోనూ బౌలర్లదే ఆధిపత్యం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టల్లో బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాట్స్‌మెన్లు పరుగులు తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.

ఏబీ రూపంలో
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. తన సంప్రదాయాన్ని కొనసాగించింది. మరోసారి ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. 159 పరుగుల లోస్కోర్ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. బౌలర్లు రాణించినప్పటికీ.. ప్రత్యర్థి జట్టు ఆర్సీబీలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు వెంటవెంటనే వికెట్లను కోల్పోతూ మ్యాచ్‌ను ఉత్కంఠతగా మార్చివేసినప్పటికీ.. ఏబీ డివిలియర్స్ కుదురుకున్నాడు. చివరి ఓవర్‌లో రనౌట్ అయ్యాడు. ఫలితంగా మ్యాచ్ చివరిబంతి వరకూ సాగింది. ఆర్సీబీ విజయం సాధించడానికి డివిలియర్స్ క్రీజ్‌లో పాతుకుని పోవడం ఓ ప్రధాన కారణం.

అయిదు వికెట్ల హర్షల్ పటేల్
సాధారణంగా ప్రతి ఐపీఎల్ సీజన్‌లోనూ కొత్త స్టార్లు పుట్టుకొస్తుంటారు. ఈ సారి హర్షల్ పటేల్ రూపంలో మరో స్టార్ బౌలర్ ఆవిర్భవించాడు. ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే అయిదు వికెట్లను పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో అయిదు ఓవర్లో 27 పరుగులు ఇఛ్చాడు. అయిదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ డెబ్యూ బౌలర్.. అయిదు వికెట్లను పడగొట్టడం ఇది మూడోసారి. ఇదివరకు అనిల్ కుంబ్లే, జయదేవ్ ఉనద్కత్ ఈ ఫీట్‌ను సాధించారు. ఆ క్లబ్‌లో హర్షల్ పటేల్ చేరాడు. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి అతను సంధించిన బంతులను ముంబై ఇండియన్స్‌లో ఒకరిద్దరు తప్ప మరెవరు ధాటిగా ఆడలేకపోయారు. ఆర్సీబీ విజయం సాధించడంలో హర్షల్ పటేల్ రెండో రీజన్.

మ్యాచ్‌ను గెలిపించింది బౌలర్లే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ముగ్గురు బ్యాట్స్‌మెన్లే రాణించినప్పటికీ.. బౌలర్లు విజృంభించడం ఆ జట్టు విజయానికి బాటలు వేసింది. కేప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ మాత్రమే ఈ మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ స్కోర్‌ను సాధించారు. మిడిలార్డర్‌లో ఏబీ లేకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఏబీ క్రీజ్‌లో పాతుకుని పోవడం.. తనదైన శైలిలో దూకుడుగా ఆడటం ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో- బౌలర్లు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశారు. ఫలితంగా ఆ జట్టు భారీ స్కోర్‌ను సాధించలేకపోయింది. మహ్మద్ సిరాజ్, కైలే జెమిసన్, హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగారు. డేనియల్ క్రిస్టియన్, యజువేంద్ర చాహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. ఈ ముగ్గురి బంతులను ముంబై బ్యాట్స్‌మెన్లు ఎదుర్కొనలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications