ట్రేడింగ్ ద్వారా బౌల్ట్, కులకర్ణి సొంతం: అసలు నిజం బయటపెట్టిన జహీర్ (వీడియో)

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుంది. దీంతో ఆటగాళ్ల బదిలీలకు సంబంధించి శుక్రవారం తుది గడువు కావడంతో... రాబోయే సీజన్‌కు ముందు తమ జట్లను మరింత బలంగా మార్చుకోవడానికి పలు ఫ్రాంచైజీలు కొంతమంది ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకున్నాయి.
ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు ఇద్దరు పేస్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, ధావల్ కులకర్ణిలను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకుని వార్తల్లో నిలిచింది. 2014లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ట్రెంట్ బౌల్ట్ 2018, 2019 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు ఆడిన ట్రెంట్ బౌల్ట్ 38 వికెట్లు పడగొట్టాడు.
ఇక, ధావల్ కులకర్ణి విషయానికి వస్తే గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ఐపీఎల్ ఆరంభ్ సీజన్ 2008 నుంచి 2013 వరకు ధావల్ కులకర్ణి ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, 2014 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ధావల్ కులకర్ణిని రాజస్థాన్ సొంతం చేసుకుంది.

రాజస్థాన్ తరుపున అద్భుత ప్రదర్శన
ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన కులకర్ణి 55.83 యావరేజితో 6 వికెట్లు పడగొట్టాడు. ఇక, ముంబై ఇండియన్స్ తరుపున 33 మ్యాచ్‌లు ఆడిన ధావల్ కులకర్ణి 36 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ మొత్తంగా చూస్తే 27.95 యావరేజతో 90 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

వచ్చే సీజన్‌లో ముంబైకి ట్రెంట్ బౌల్ట్
ఇప్పుడు వీరిద్దరినీ వచ్చే సీజన్ కోసం ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోవడానికి గల కారణాన్ని ముంబై ఇండియన్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ వెల్లడించాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్‌లో జహీర్ ఖాన్ వీడియోని పోస్టు చేసింది.

గాయాల పరంగా మాకు కొన్ని సవాళ్లు
ఆ వీడియోలో జహీర్ ఖాన్ "గాయాల పరంగా మాకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. హార్దిక్ పాండ్యాకు శస్త్రచికిత్స జరిగింది. వెన్నునొప్పి కారణంగా బుమ్రా గత కొంతకాలంగా యాక్షన్‌కు దూరంగా ఉన్నాడు. జాసన్ బెహ్రెండోర్ఫ్ కూడా వెన్నునొప్పి సర్జరీ జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని రాబోయే సీజన్ కోసం ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం" అని చెప్పాడు.

విడుదల జాబితా ముగిసింది
"దేశీయ ప్రతిభ విషయానికొస్తే, ముంబై ఎల్లప్పుడూ ఒక ధోరణితో ఉంటుంది. మేము దేశీయ ప్రతిభను గుర్తించడం లాంటిది. అయితే, ఇదే చివరి ముగింపు అవుతుంది. విడుదల జాబితా ముగిసింది కాబట్టి ఇతర జట్ల నుండి విడుదలైన ఆటగాళ్ళు మరియు ఎంపికలు ఏమిటి అనే దానిపై నిఘా ఉంచాలి. ఆ ప్రక్రియ చాలా త్వరగానే ప్రారంభమవుతుంది" అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications