Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రి కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్‌!!

IPL 2020: Zaheer Khan and Sagarika Ghatge expecting first child together
After Virat Kohli-Anushka Sharma, Zaheer Khan and Sagarika Ghatge Expecting First Child!!

దుబాయ్: టీమిండియా మాజీ క్రికెటర్‌ జహీర్ ‌ఖాన్‌ అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నాడు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. త్వరలోనే మా ఇంట్లోకి మూడో మనిషి రాబోతున్నాడు అని జహీర్ పేర్కొన్నాడు. జహీర్‌ ఖాన్‌ బాలీవుడ్‌ నటి సాగరిక గాట్గేను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. షారుక్‌ ఖాన్ నటించిన 'చెక్ దే ఇండియా' సినిమాలో సాగరిక కీలక పాత్ర పోషించారు.

జహీర్ ‌ఖాన్, సాగరిక గాట్గే ప్రస్తుతం యూఏఈలో ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లోఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ జరుగుతుండగా.. జహీర్‌ ముంబై ఇండియన్స్‌ జట్టుకు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్ ‌(డీసీఏ)గా పనిచేస్తున్నారు. ముంబై జట్టులో కలిసి ఆయన పనిచేస్తన్నారు. తాజాగా జహీర్ ‌ఖాన్‌ తన పుట్టినరోజు వేడు‍‍కలను కూడా ముంబై ఇండియన్స్‌ జట్టుతో కలసి దుబాయ్‌లోనే జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జహీర్‌ ఖాన్ గురించి వర్ణించాలని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం కోరగా.. జహీర్‌ అందరితో సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించి నిర్ణయాలను తీసుకుంటాడని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపారు. ఇక టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా తాను తండ్రికాబోతున్నట్లు, వచ్చే ఏడాది జనవరిలో వారి ఇంటికి ఒక పండంటి బిడ్డ రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌ 2020లో ఆదివారం రాత్రి డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ సహా ఫీల్డింగ్‌లోనూ అద్భుత విన్యాసాలు చేసిన ముంబై అదరహో అనిపించింది. క్వింటన్‌ డికాక్ ‌(53: 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్ ‌(53: 32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధ శతకాలతో రాణించడంతో 163 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండానే ఛేదించింది. ఇక మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

Story first published: Monday, October 12, 2020, 13:33 [IST]
Other articles published on Oct 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+