న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: టిమాన్, పంబా మళ్లీ కలిశాయి.. గేల్‌తో చహల్!!

IPL 2020: Yuzvendra Chahal shares image with Chris Gayle

షార్జా: గురువారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అద్భుత విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వరుస పరాజయాలతో సతమతమయిన పంజాబ్..‌ ఎట్టకేలకు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ ‌(61 నాటౌట్:‌ 49 బంతుల్లో 1 ఫోర్ 5 సిక్సర్లు), యూనివర్సల్ బాస్ క్రిస్ ‌గేల్‌ (53: 45 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లు) మెరుపు అర్ధ శతకాలతో రాణించి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఐపీఎల్ 2020లో బెంగళూరు మ్యాచుకు ముందు క్రిస్ ‌గేల్‌ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. లీగ్ ఆరంభంలో గేల్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత జట్టు‌లోకి తీసుకుందామనుకున్నా.. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత.. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌తోనే ఎంట్రీ ఇచ్చాడు. సగం టోర్నీ పూర్తయిన తర్వాత బ్యాట్ పట్టిన గేల్.. తొలి మ్యాచులోనే అభిమానులను అలరించాడు. 5 సిక్సులు కొట్టి అర్ధ సెంచరీతో సత్తాచాటాడు.

అయితే ఆ మ్యాచ్‌లో క్రిస్ గేల్, యుజ్వేంద్ర చహల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్నగా ఉండే చహల్.. భారీ ఆకారంతో ఉండే గేల్‌తో సన్నిహితంగా కనిపించాడు. గేల్ కూడా సరదాగా చహల్‌ను టీజ్ చేశాడు. చహల్ బాడీని చూపించి.. సిక్స్ ప్యాక్ అంటూ సెటైర్లు వేశాడు. ఆ తర్వాత గేల్‌ను చహల్ కౌగిలించుకొని.. తన స్నేహాన్ని చాటుకున్నాడు. దానికి సంబందించిన ఓ ఫొటోను చహల్ తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'టిమాన్, పంబా మళ్లీ కలిశారు' ఓ కామెంట్ పెట్టాడు. హకునా మటాకా అని హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

క్రిస్ గేల్‌కు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో ప్రత్యేక అనుబంధముంది. యూనివర్సల్ బాస్ కొన్నేళ్ల పాటు ఆ జట్టుకు ఆడాడు. ఐపీఎల్‌లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 కూడా బెంగళూరు జట్టు తరపునే సాధించాడు. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కొహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లతో మంచి స్నేహ బంధం ఉంది. అందుకే ఆప్పుడప్పుడు గేల్, చహల్ సరదాగా సెటైర్లు, కెమెంట్లు వేసుకుంటారు.

RR vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. హైదరాబాద్ పేసర్ సిరాజ్‌పై వేటు!!RR vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. హైదరాబాద్ పేసర్ సిరాజ్‌పై వేటు!!

Story first published: Saturday, October 17, 2020, 16:26 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X