సన్‌రైజర్స్ నెత్తిన పిడుగు: సాహా గాయం: తీవ్రం కాదంటూనే: బీసీసీఐ దృష్టికి: నెక్స్ట్ మ్యాచ్‌కు

అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో మరో స్టార్ బ్యాట్స్‌మెన్ గాయాలపాలయ్యాడు. ఇప్పటిదాకా పలువురు ప్లేయర్లు గాయాల బారిన పడగా.. అదే జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా చేరాడు. అతను గ్రోయిన్ (గజ్జల్లో) ఇంజ్యూరీతో బాధపడుతున్నట్లు సన్ రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఆ గాయం తీవ్రమైనది కాదంటూనే. ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. ఏకంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ) మెడికల్ టీమ్‌ను సంప్రదించింది. ఆస్ట్రేలియా పర్యటనకు సాహా ఎంపికైన ప్రస్తుత పరిస్థితుల్లో అతను గాయపడటం పట్ల అటు బోర్డు కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

విరాట్..రెడ్ ఫేస్:స్లెడ్జింగ్‌కు పాల్పడ్డ కోహ్లీ: ముంబై స్టార్ బ్యాట్స్‌మెన్‌పై: దగ్గరికి వెళ్లి మరీ

సన్ రైజర్స్ క్యాంప్‌లో

సన్ రైజర్స్ క్యాంప్‌లో

వృద్ధిమాన్ సాహా గాయపడటం సన్‌ రైజర్స్ హైదరాబాద్ క్యాంప్‌లో ఆందోళనకు దారి తీసింది. వచ్చే మ్యాచ్‌లో అతను ఆడతాడా? లేడా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆస్ట్రేలియా జట్టుకు సాహా ఎంపికైన ప్రస్తుత పరిస్థితుల్లో అతణ్ని ఆడించడం అంత మంచిది కాదని జట్టు మేనేజ్‌మెంట్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. గాయం తీవ్రమైతే.. ఆస్ట్రేలియా పర్యటనకు దూరం అయ్యే అవకాశాలు ఉందని, అందుకే- అది మరింత ముదరకముందే సాహాకు విశ్రాంతి ఇవ్వొచ్చని చెబుతున్నారు.

బీసీసీఐ మెడికల్ టీమ్‌తో

బీసీసీఐ మెడికల్ టీమ్‌తో

వృద్ధిమాన్ సాహా గాయాన్ని సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ తేలిగ్గా తీసుకోవట్లేదు. దీనిపై హైదరాబాద్ జట్టు మేనేజ్‌మెంట్ బీసీసీఐ మెడికల్ టీమ్‌ను సంప్రదించింది. బీసీసీఐ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అతనికి చికిత్స అందించనుంది. ముందుజాగ్రత్త చర్యగా సాహాకు కనీసం మూడురోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలంటూ బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యుడొకరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీని సూచించింది. గజ్జల్లో గాయం తొలిదశలో ఉందని, అది మరింత తీవ్రం కాకముందే జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందంటూ ఫ్రాంఛైజీకి ఇమెయిల్ ద్వారా సందేశాన్ని పంపించినట్లు తెలుస్తోంది.

ఆర్సీబీతో వెయిట్ అండ్ వాచ్

ఆర్సీబీతో వెయిట్ అండ్ వాచ్

ఈ పరిస్థితుల్లో సాహా..సన్ రైజర్స్ ఆడబోయే రెండు మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వార్నర్ సేన శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది. వచ్చేనెల 3వ తేదీన ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు లీగ్ దశ ముగుస్తుంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే.. ఈ రెండూ తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది హైదరాబాద్. ఏ ఒక్క దాంట్లో ఓడిపోయినా స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది. ఇలాంటి కీలక దశలో సాహా జట్టుకు దూరం కావడం ప్రతికూల ప్రభావం చూపొచ్చు.

 ఢిల్లీతో మ్యాచ్‌లో భారీ స్కోర్..

ఢిల్లీతో మ్యాచ్‌లో భారీ స్కోర్..

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాాద్ భారీ స్కోరును సాధించడానికి సాహా ఇన్నింగ్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సాహా.. 45 బంతుల్లో 87 పరుగులు చేశాడు. సాహా విజృంభణతో హైదరాబాద్ జట్టు 219 పరుగులను స్కోర్ బోర్డుపై జమ చేసింది. ఢిల్లీ కేపిటల్స్ ఈ మ్యాచ్‌లో 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా- ప్లేఆఫ్ అవకాశాలను హైదరాబాద్‌కు ధారాదాత్తం చేసినట్టయింది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే.. మెరుగైన నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్ చేరుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో సాహా గాయపడటం ఆ జట్టు నెత్తి మీద పిడుగు పడినట్టయింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, October 29, 2020, 8:29 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X