ఆ జట్టును వరల్డ్‌బ్యాంక్ కనికరించాలి.. కనీసం రెండు పాయింట్లను విరాళం ఇవ్వాలి: సెహ్వాగ్‌

ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ రిటైర్మెంట్ అనంతరం సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో స్పందిస్తూ క్రీడాకారులను, జట్లను ఆటపట్టించడం సెహ్వాగ్ ప్రత్యేకత. వీరూ చెప్పేదాంట్లో ఇజాలు చాలానే ఉంటాయనుకోండి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేపథ్యంలో ఛలోక్తులు, సూచనలు, సెటైర్లు బాగా వేస్తున్నాడు వీరూ. ఈ క్రమంలో ఈ రోజు జరగనున్న మ్యాచులపై విశ్లేషణ ఇస్తూ సెటైర్లు వేశాడు. ముఖ్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను టార్గెట్ చేశాడు.

వరల్డ్‌బ్యాంక్ కనికరించాలి:

వరల్డ్‌బ్యాంక్ కనికరించాలి:

'వీరూకి బైటక్‌' 22వ ఎపిసోడ్‌లో భాగంగా ఈ రోజు జరగనున్న పంజాబ్‌, కోల్‌కతా మ్యాచ్‌తో పాటు బెంగళూరు, చెన్నై మ్యాచ్‌నూ వీరేంద్ర సెహ్వాగ్ విశ్లేషించాడు. 'ఐపీఎల్ 2020లో పంజాబ్‌ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్రపంచ బ్యాంకైనా కనికరించి కనీసం రెండు పాయింట్లు పంజాబ్‌కు విరాళం ఇస్తే బాగుండు. మొదట్లో బౌలింగ్‌ ఒక్కటే సమస్య అనిపించింది. తర్వాత నాకు కనువిప్పు కలిగింది. వాళ్ల బ్యాటింగ్‌ చూసిన తర్వాత విషయం అర్థమైంది. అసలు సమస్య అక్కడే ఉంది. బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు అంతా ఒక ఆపిల్‌ బుట్టలో నుంచి వచ్చినవారే' అని వీరూ అన్నాడు.

మాక్స్‌వెల్‌ను తీసేసి:

మాక్స్‌వెల్‌ను తీసేసి:

'కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లోనైనా విండీస్ సీనియర్ ఓపెనర్ క్రిస్ ‌గేల్‌ను ఆడిస్తారని జంబో (పంజాబ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే)పై ఆశలు పెట్టుకున్నాను. ఒకవేళ జంబో కనికరిస్తే.. ఈ మ్యాచ్‌ కనులపండుగ అవుతుంది. గేల్ బాగా ఆడుతాడని నా నమ్మకం. పంజాబ్‌ జట్టులో మరిన్ని రిపేర్లు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. పనికిరాని గ్లెన్ మాక్స్‌వెల్‌ను తీసేసి గేల్‌ను జట్టులోకి తీసుకోవాలి. కోర్టు వీరుడు షెల్డన్ కాట్రెల్‌ స్థానంలో హార్డ్‌ విల్జోయెన్‌ను జట్టులోకి చేర్చుకోవాలి. అతని పేరులోనే కష్టం (హార్డ్‌) ఉంది. మార్పులు జరిగితే జట్టు విజయాల బాట పడుతుంది' అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.

రసెల్‌ మెరుపు బ్యాటింగ్ కావాలి:

రసెల్‌ మెరుపు బ్యాటింగ్ కావాలి:

'చెన్నైని ఓడించిన కోల్‌కతా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆ మ్యాచ్‌లో దినేశ్‌ కార్తీక్‌ బౌలింగ్‌ వ్యూహం పీసీ సొర్కర్ ‌(ప్రముఖ మెజీషియన్‌) ఇంద్రజాలాన్ని తలపించింది. అతని వ్యూహం మనకు అర్థం కాకపోయినా.. దాన్ని అద్భుతమనే అనాలి. కండల వీరుడు రసెల్‌ బౌలింగ్‌ తన వాటా ఇస్తున్నాడు. కానీ మనకు కావాల్సింది అతని మెరుపు బ్యాటింగ్‌. పంజాబ్‌ ప్రత్యర్థిగా ఉండటం రసెల్‌కు ఒక బహుమానమే. నా లెక్క ప్రకారం.. కోల్‌కతా ఈ మ్యాచ్‌ గెలుస్తుంది. అయితే నేను పంజాబ్‌కు ఆడిన విషయం మీరు గుర్తుంచుకొవాలి' అని టీమిండియా మాజీ ఓపెనర్ పేర్కొన్నాడు.

మోరిస్‌ నిజమైన వికెట్‌ టేకర్:

మోరిస్‌ నిజమైన వికెట్‌ టేకర్:

'చీకూ (విరాట్ కోహ్లీ), గబ్బర్‌ (ఎంఎస్ ధోనీ) గురించి మాట్లాడితే.. బెంగళూరు పెట్టిన రూ.10కోట్ల పెట్టుబడి (క్రిస్‌ మోరిస్‌) లాభాలు తెచ్చిపెట్టేందుకు సిద్ధమైంది. ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ మ్యాచ్‌కు రెడీగా ఉన్నాడు. కానీ అతను మ్యాచ్‌ ఆడాలి అంటే మరో ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ లేదా పేసర్‌ ఇసురు ఉదాన సీటు పోవడం ఖాయం. మోరిస్‌ నిజమైన వికెట్‌ టేకర్‌. అయితే బరువులేని డెత్‌ బౌలింగ్‌ బెంగళూరుకు సమస్యగా మారింది. ఈ క్రమంలో లాంకీ బాడీగార్డ్ ‌(యుజ్వేంద్ర చహల్‌)కు పార్ట్‌నర్ కానున్నాడు' అని వీరూ చెప్పుకొచ్చాడు.

బంతులు తిని డైటింగ్‌ చేస్తున్నారు:

బంతులు తిని డైటింగ్‌ చేస్తున్నారు:

'ఆరు మ్యాచుల్లో నాలుగు ఓడిపోయిన చెన్నైకి పంజాబ్‌ క్లబ్‌లో చేరడం ఇష్టం లేకపోతే.. ఈ మ్యాచ్‌ కచ్చితంగా గెలిచి తీరాలి. చివరగా జరిగిన మ్యాచుల్లో శార్దూల్‌ ఠాకూర్‌, డీజే బ్రావోను తీసుకున్నారు. వాళ్లు ఆ జట్టు డెత్‌ బౌలింగ్‌ను మరింత మెరుగుపరిచారు. ఇక బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. టెస్టు మ్యాచ్‌ ప్రయోగాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి చెన్నై ప్రమాదకరమైన జట్టు. అందులోని ఆటగాళ్లు అనుభవజ్ఞులు. కానీ బ్యాట్స్‌మెన్‌ మాత్రం బంతులు తిని డైటింగ్‌ చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవు. షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్‌ బాగా ఆడుతున్నారు. అయితే బెంగళూరుతో జరిగే పోరులో ఎవరు స్మాష్‌ చేస్తారు. ఎవరు క్రాష్‌ అవుతారు అనేది ముఖ్యం. ఈ మ్యాచ్‌లో బెంగళూరే నా ఫేవరెట్‌.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, October 10, 2020, 15:05 [IST]
Other articles published on Oct 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X