విరాట్ కోహ్లీ టీమ్ అంటే అందుకే అసహ్యం: హేట్‌ లిస్ట్‌లో టాప్: మాజీ ఆల్‌రౌండర్ హిలేరియస్ రిప్లై

అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్‌లో అదరగొడుతోంది. ఇదివరకటి సీజన్లతో పోల్చుకుంటే.. ఈ సారి మెరుగ్గా ఆడుతోంది కోహ్లీసేన. ఇప్పటిదాకా డజను మ్యాచ్‌లను ఆడిన రాయల్ ఛాలెంజర్స్.. ఏడింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో సెకెండ్ ప్లేస్‌లో నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ప్లేఆప్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే.. ఇంకో మ్యాచ్‌ను గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీ కొట్టబోతోంది.

అంచనాలకు మించిన స్థాయిలో రాణిస్తోన్నప్పటికీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు మైనస్ పాయింట్లు లేకపోలేదు. పలువురు క్రికెట్ ప్రేమికులు ఈ జట్టు పట్ల పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ప్రత్యేకించి నార్త్ ఇండియన్స్. కారణాలు తెలియట్లేదు గానీ.. రాయల్ ఛాలెంజర్స్ జట్టును హేట్ లిస్ట్‌లో ఉంచారు.. అదీ టాప్‌లో. దీనిమీద సోషల్ మీడియాలో ఓ పెద్ద డిస్కషనే నడుస్తోంది. రాధికా చౌధరి అనే ఓ ట్విట్టరెట్టీ దీనిపై ఓ ట్వీట్ చేశారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును హేట్‌లిస్ట్‌లో టాప్‌లో ఎందుకు ఉంచారు? అనే ప్రశ్నను సంధించారు. దీన్ని న్యూజీలాండ్ మాజీ ఆల్‌రౌండర్, ఐపీఎల్ కామెంటేటర్ స్కాట్ స్టైరిస్‌కు ట్యాగ్ చేశారు. విరాట్ కోహ్లీ వల్లే తాను బెంగళూరు టీమ్‌ను హేట్ చేస్తున్నానంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కొందరు ఆర్సీబీని సమర్థిస్తోండగా.. మరికొందరు ఆ జట్టు కంటే మిగిలిన టీమ్స్ బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రశ్నకు స్కాట్ స్టైరిస్ నుంచి కూడా రిప్లై వచ్చింది. దాన్ని తనదైన శైలిలో వివరించుకుంటూ వచ్చాడు స్టైరిస్. నీకు ఆ జట్టు అంటే ఇష్టం లేదు కాబట్టే.. అంటూ సమాధానం ఇచ్చాడు.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో

ముంబై ఇండియన్స్‌తో అబుధాబి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఓటమిపాలైంది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతోన్న సమయంలో టీమ్ కేప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తించిన విధానం పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌పై అతను స్లెడ్జింగ్‌కు పాల్పడటాన్ని నెటిజన్లు, క్రికెట్ అభిమానులు తప్పుపడుతున్నారు. కోహ్లీలో స్పోర్టివ్‌నెస్ ఏ మాత్రం లేదని, ఆ విషయాన్ని అతను మరోసారి తనకు తానుగా నిరూపించుకున్నాడని విమర్శిస్తున్నారు. తోటి క్రికెటర్‌పై స్లెడ్జింగ్‌కు దిగడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని మండిపడుతున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, October 29, 2020, 11:36 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X