Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH: 'బ్రావోను చూసి నవ్వలేదు.. నా నవ్వు వెనుక అసలు కారణం అది కాదు'

IPL 2020: Wasn’t laughing at Dwayne Bravo-Khaleel Ahmed clarifies after being slammed on social media

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేసర్ ఖలీల్‌ అహ్మద్‌, చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో మధ్య చోటుచేసుకున్న సన్నివేశం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్రావోను అహ్మద్‌ డకౌట్‌ చేశాడు. లెగ్‌స్టంప్‌ మీదుగా వెళ్లిన బంతిని బ్రావో అంచనా వేయడంలో పొరబడడంతో నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో బ్రావో పెవిలియన్ చేరాడు.

డ్వేన్ బ్రావో వికెట్ తీసిన అనంతరం ఖలీల్ అహ్మద్‌‌ ఎలాంటి సెలబ్రేషన్స్‌ చేయకుండా సైలంట్‌గానే ఉన్నాడు. కానీ బ్రావోను చూస్తూ ఓ చిన్న వెకిలి నవ్వు నవ్వాడు. అంతే సోషల్ మీడియాలో ఖలీల్‌పై ఫాన్స్ మండిపడుతున్నారు. ఒక సీనియర్‌ అంతర్జాతీయ క్రికెటర్‌ బ్రావోకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విమర్శల వర్షం కురిపించారు. రాహుల్ తెవాటియాతోనూ ఇలానే ప్రవర్తించావ్. ఖలీల్‌కు అసలు క్రీడా స్పూర్తి లేదు అంటూ ఫాన్స్ ఫైర్ అయ్యారు.

ఈ విమర్శలపై ఖలీల్‌ అహ్మద్‌ స్పందించాడు. 'నేను డ్వేన్ బ్రావోను చూసి నవ్వలేదు. నా నవ్వు వెనుక అసలు కారణం అది కాదు. బ్రావో లాంటి ఆటగాడిపై నేను అలా ప్రవర్తిస్తానా. అయినా నేను బ్రావోను అన్నలాగా భావిస్తాను. దయచేసి దీనిని పెద్ద ఇష్యూ చేయకండి. ఆటలో ఇలాంటివి సహజమే' అంటూ ట్విటర్‌లో ఖలీల్‌ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే 20 పరుగులతో విజయం సాధించింది.

ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుతో జరిగిన మ్యాచులో ఖలీల్‌ అహ్మద్, రాహుల్ తెవాటియా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కు వెళుతూ తెవాటియా.. అహ్మద్‌తో గొడవ పడ్డాడు. ఖలీల్ ఏదో అభ్యంతర వ్యాఖ్య చేయడంతో అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న సన్‌రైజర్స్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ అతడితో మాట్లాడి శాంతింపజేశారు. ఈ గోడపై కూడా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Story first published: Thursday, October 15, 2020, 21:14 [IST]
Other articles published on Oct 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+