
అదే తడబాటు..
‘మాక్స్వెల్ మైండ్‌సెట్ ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ప్రతీ ఐపీఎల్ సీజన్లోనూ మాక్స్వెల్ తీరు ఇంతే. భారీ ధరకు అమ్ముడుపోవడం.. దారుణంగా విఫలమవడం అతనికి అలవాటు అయిపోయింది. అయినా ఫ్రాంఛైజీలు అతని కోసం వేలంలో ఎందుకు వెంపర్లాడుతాయో..? నాకు అర్థం కావడం లేదు. నా అంచనా ప్రకారం వచ్చే సీజన్‌కు అతని ధర రూ. 1-2 కోట్లకి పడిపోవచ్చు.

హాఫ్ సెంచరీ చేసి నాలుగేళ్లు..
పంజాబ్ టీమ్ ప్రతి మ్యాచ్‌లోనూ స్వేచ్ఛగా చెలరేగిపోయే వెసులబాటు కల్పిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచ్‌లోనూ 7వ ఓవర్లోనే అతన్ని బ్యాటింగ్‌కి పంపింది. చాలినన్ని ఓవర్లు ఉన్నా.. అతను విఫలమయ్యాడు. 2016 సీజన్లో అతను చివరిసారిగా హాఫ్ సెంచరీ చేశాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతను పూరన్ కంపెనీ ఇస్తూ.. అండగా ఉంటే పంజాబ్ గెలిచేది. పూరన్ ఒంటరిగా ఏం చేయలేకపోయాడు'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లాడిన మాక్స్వెల్ కేవలం 48 పరుగులే చేశాడు. అతని వైఫల్యం పంజాబ్ విజయవకాశాలను దెబ్బతీస్తుంది. తదుపరి మ్యాచ్‌లో అతనికి అవకాశం దక్కకపోవచ్చు.

పూరన్ ఒక్కడే..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' బెయిర్‌స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్ పూరన్ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగియడం పంజాబ్ వైఫల్యాన్ని సూచిస్తోంది.
దారుణం.. ధోనీ బాగా ఆడకపోతే జీవాను రేప్ చేస్తామంటూ బెదిరింపులు!