Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెహ్వాగ్ ఉచిత సలహా.. ఢిల్లీకి బాగానే కలిసొచ్చిందిగా!!

IPL 2020: Virender Sehwag says Delhi Capitals taking my free advice, promote Marcus Stoinis as opener

దుబాయ్: ఐపీఎల్ 2020లో సరైన సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ ప్రయోగం చేసి సక్సెస్ అయింది. అంతేకాదు ఏకంగా ఫైనల్ బెర్త్ ఒడిసిపట్టింది. గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. మార్కస్ స్టోయినిస్‌ని ఓపెనర్‌గా పంపింది ఢిల్లీ. స్టోయినిస్ తన భారీ హిట్టింగ్‌తో ఆరంభంలోనే ఢిల్లీని తిరుగులేని స్థితిలో నిలిపాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బాదుడు మొదలెట్టిన స్టాయినిస్.. 27 బంతుల్లో38 రన్స్ చేశాడు. తొలి వికెట్‌కి శిఖర్ ధావన్‌తో కలిసి 8.2 ఓవర్లలోనే 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసి హైదరాబాద్‌ను ఒత్తిడిలోకి నెట్టింది.

ఢిల్లీ ఓపెనింగ్ జోడీలో ఈ మార్పునకి కారణం టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన ఉచిత సలహానేనట. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఓ వీడియోలో వెల్లడించాడు. 'క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మార్కస్ స్టోయినిన్ ఓపెనర్‌గా రావడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అతడిని ఓపెనర్‌గా ఆడించమని ఢిల్లీకి గతంలోనే చెప్పా. మొత్తానికి నా ఉచిత సలహా ఢిల్లీ తీసుకుంది. అంతేకాదు బాగానే కలిసొచ్చింది కూడా' అని సెహ్వాగ్ తెలిపాడు.

స్టోయినిస్‌ ఆరంభంలోనే ఇచ్చిన క్యాచ్‌ను జాసన్ హోల్డర్‌ వదిలేయడంతో ఒక గొప్ప చాన్స్‌ను కోల్పోయిందని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఆ సమయంలో స్టోయినిస్‌ మూడు పరుగులే చేశాడని ,అప్పుడు అతని క్యాచ్‌ తీసుకుని ఉంటే ఢిల్లీపై ఒత్తిడి వచ్చేదన్నాడు. క్యాచ్ వదిలేయడంతో స్టోయినిస్‌ విలువైన పరుగుల్ని సాధించాడన్నాడు. ఢిల్లీ మొదట ఉన్న స్పీడ్‌నే తుది వరకూ కొనసాగించిందన్నాడు. చివరి రషీద్‌ ఖాన్‌ తన రెండో ఓవర్‌లో స్టోయినిస్‌ను బౌల్డ్‌ చేసినా అప్పటికే నష్టం జరిగిపోయిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక తన ఢిల్లీ జట్టుకు విషెష్ కూడా చెప్పాడు వీరూ.

టోర్నీ ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అతిపెద్ద బలహీనత ఓపెనింగ్ జోడి. శిఖర్ ధావన్‌కి జోడీగా తొలుత యువ ఆటగాడు పృథ్వీ షాని ఆడించింది. ఒకటి రెండు ఇన్నింగ్స్ తప్ప పృథ్వీ ప్రతి మ్యాచులో విఫలమయ్యాడు. దీంతో ఢిల్లీ ఆరంభంలోనే వికెట్ కోల్పోవాల్సి వచ్చేది. మధ్యలో అజింక్య రహానెతోనూ ప్రయోగాలు చేయించింది. కానీ ఆ ప్రయోగం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక కీలక మ్యాచులో మార్కస్ స్టోయినిస్‌ని ఓపెనర్‌గా పంపి పెద్ద సాహసమే చేసింది. అయితే అది ఫలితాన్ని ఇచ్చింది. స్టోయినిస్‌కు బిగ్ బాష్ టోర్నీలో ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉంది. గత రెండు సీజన్లలో అతడు ఓపెనర్‌గానే ఆడుతున్నాడు. ఈ అర్జు జరిగే ఫైనల్లోనూ స్టోయినిస్ ఓపెనర్‌గా రానున్నాడు.

Story first published: Tuesday, November 10, 2020, 14:19 [IST]
Other articles published on Nov 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+