చెన్నై, పంజాబ్‌ జట్లపై సీబీఐ విచారణ చేయించాలి: సెహ్వాగ్‌

ఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ రిటైర్మెంట్ అనంతరం సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో శనివారం జరిగిన టీ20 మ్యాచ్‌లతో పాటు ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లపై తన విశ్లేషణ పంచుకున్నాడు. ఈసారి న్యూస్ రీడర్‌ అవతారమెత్తిన వీరూ అభిమానులకు సరదా వార్తలు అందించాడు. ముఖ్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను టార్గెట్ చేశాడు. రెండు జట్లు, ఆగాళ్లపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు.

KXIP vs KKR: కోల్‌కతా సక్సెస్ సీక్రెట్ చెప్పిన దినేష్ కార్తీక్.. తెర వెనక ఉన్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా!

సీబీఐ విచారణ చేయించాలి:

సీబీఐ విచారణ చేయించాలి:

'వీకేబీ (వీరూ కి బైటక్‌) న్యూస్‌కు స్వాగతం. వార్తలు చదవుతున్నది మీ వీరేంద్ర సెహ్వాగ్‌. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు‌ చేజేతులా ప్రత్యర్థులకు మ్యాచ్‌లు ఎలా అప్పగిస్తున్నాయో తెలుసుకోవాలని దేశం మొత్తం కోరుకుంటోంది. దీనిపై సీబీఐ (క్లెవర్‌ బ్రేవ్‌ ఇన్విస్టిగేషన్‌) విచారణ కూడా చేయించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇక మరిన్ని వివరాలను మీ వీరూ అందిస్తారు. ఓవర్‌ టు యూ వీరూ' అని న్యూస్ రీడర్‌ అవతారమెత్తిన వీరూ వార్తలు చెప్పాడు.

రాహుల్‌ ఔటయ్యాడు.. మ్యాచ్‌ పోయింది:

రాహుల్‌ ఔటయ్యాడు.. మ్యాచ్‌ పోయింది:

'శనివారం జరిగిన కోల్‌కతా, పంజాబ్‌ మ్యాచ్‌ను గమనిస్తే టాస్‌తోనే సగం మ్యాచ్‌ గెలిచినట్లు దినేశ్‌ కార్తిక్‌ భావించినట్లున్నాడు. కానీ, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పంజాబ్‌ బౌలర్లు ప్రతి మ్యాచ్‌లో అందించే ఫ్రీ బఫెట్‌ పథకానికి షమీ, అర్ష్‌దీప్‌ లాక్‌డౌన్‌ విధించారు. శుభ్‌మన్‌ తన చెవిలో నుంచి ఇయర్ ‌ఫోన్స్‌ను తీసి మ్యాచ్‌కు రావాల్సింది. పాపం అవతల ఎండ్‌లో ఉన్న రాణాకు ఆ విషయం తెలియక రనౌట్‌ అయ్యాడు. కోల్‌కతా కెప్టెన్‌కు టైం వచ్చినట్లు కనిపిస్తోంది. అతని మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 164 పరుగులు చేసింది. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌లో రాహుల్, అగర్వాల్‌ అద్భుతంగా ఆడారు. అయితే కార్తీక్‌ మరోసారి మాయాజాలం ప్రదర్శించాడు. నరైన్‌, ప్రసిద్‌కృష్ణను చివరి ఓవర్లలో బౌలింగ్‌కు దించాడు. రాహుల్‌ ఔటయ్యాడు. మ్యాచ్‌ కూడా పోయింది' అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

చెన్నై టికెట్‌ బుక్‌ చేసుకుంది:

చెన్నై టికెట్‌ బుక్‌ చేసుకుంది:

'చెన్నై, బెంగళూరు మ్యాచ్లో టాస్‌ గెలిచిన కోహ్లీసేన బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ను దీపక్‌ చహర్‌ బయపెట్టి మరీ ఔట్‌ చేశాడు. కానీ చీకూ (విరాట్ కోహ్లీ) కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడాడు. బెంగళూరు 169 పరుగులు చేసింది. డుప్లెసిస్‌, వాట్సన్‌పైనే చెన్నై ఆధారపడినట్లు ఉంది. సుందర్‌ బంతితో డుప్లెసిస్‌ను ఆ తర్వాత వాట్సన్‌ను ఔట్ చేశాడు. ఆపై టెస్ట్‌ మ్యాచ్‌ మళ్లీ మొదలైంది. బెంగళూరు బౌలర్లు సైనీ, మోరిస్‌, సుందర్‌ ముందు చెన్నై బ్యాట్స్‌మెన్‌ బోల్తాపడ్డారు. లాంకీ బాడీగార్డ్ ‌(చహల్‌) ధోనీని పెవిలియన్‌కు పంపించాడు. బెంగళూరు టాప్‌4కి వెళ్లింది. మరోవైపు పంజాబ్‌ క్లబ్‌లో చేరేందుకు చెన్నై టికెట్‌ బుక్‌ చేసుకుంది. ఈసారి నిందలు మోయడానికి జాదవ్‌ జట్టులో లేడు' అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.

శాంసన్‌ గణితం మర్చిపోయినట్లున్నాడు:

శాంసన్‌ గణితం మర్చిపోయినట్లున్నాడు:

'ఈ రోజు దుబాయ్‌లో హైదరాబాద్‌, రాజస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఉంది. ది రాక్ ‌(డేవిడ్‌ వార్నర్‌) కెప్టెన్సీలోని హైదరాబాద్‌ కీలక ఆటగాళ్లు దూరమవుతున్నా ధైర్యంతో ముందుకు సాగుతోంది. పంజాబ్‌ను పడకొట్టిన హైదరాబాద్‌కు వార్నర్‌, బెయిర్‌స్టో, విలియమ్సన్‌ మీదే ఆశలు. బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ను నమ్ముకొని ఉంది. స్మిత్‌సేన గత నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే అసాధ్యాలను సుసాధ్యం చేసే స్టోక్స్‌ క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నాడు. సంజు శాంసన్‌ గణితం మర్చిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. 0-9 మధ్యే ఆగిపోతున్నాడు. అయినా రాజస్థాన్‌దే పైచేయిలా కనిపిస్తోంది' అని వీరూ చెప్పుకొచ్చాడు.

పోటీ పేస్‌ బౌలింగ్‌ మద్యే:

పోటీ పేస్‌ బౌలింగ్‌ మద్యే:

'అబుదాబిలో ముంబై, ఢిల్లీ మధ్య జరిగే మ్యాచ్‌ ఆసక్తిగా మారనుంది. ఈ రెండు జట్లు సమవుజ్జీలు. ఢిల్లీ కెప్టెన్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడుతుంటే.. మరోవైపు ‌రోహిత్‌ సైతం తన జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. రెండు జట్లుకు ఒకదానిపై ఇంకోదానికి స్పష్టమైన అవగాహన ఉంది. అయితే ఇక్కడ అసలైన పోటీ పేస్‌ బౌలింగ్‌ మద్యే. ముంబైకి బుమ్రా, బోల్ట్‌, ప్యాటిన్సన్‌ ఉంటే.. ఢిల్లీకి రబాడ, నోర్జె ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుస్తుంది' అని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, October 11, 2020, 19:05 [IST]
Other articles published on Oct 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X