For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ అంపైర్ మనోడే: అచ్చమైన తెలంగాణ యాసలో: దినేష్ కార్తీక్‌కు ఏం చెప్పాడంటే?

IPL 2020: Umpire Shamshuddin speaks in telugu with Dinesh Karthik, goes viral on social media

దుబాయ్: ఐపీఎల్-2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్.. కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య గురువారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ తెలుగులో మాట్లాడారు. అచ్చమైన తెలంగాణ యాసలో ఆయన కొద్దిసేపు సంభాషించాడు. ఆయన మాటలు వికెట్లకు అమర్చిన మైక్రో ఫోన్ల ద్వారా రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 వైడ్ బాల్ కోసం..

వైడ్ బాల్ కోసం..

కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ సామ్ కుర్రమ్ ఇన్నింగ్ 19వ ఓవర్‌ను వేశాడు. ఆ సమయంలో ఫీల్డ్ అంపైర్ ఛెట్టితూడి షంషుద్దీన్ నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు నిల్చున్నారు. ఆ ఓవర్ నాలుగో బంతిని దినేష్ కార్తీక్ ఎదుర్కొన్నాడు. అతనికి బాల్ అందకుండా వికెట్లకు కాస్త దూరంగా బంతిని సంధించాడు సామ్. దాన్ని షాట్ కొట్టడానికి దినేష్ కార్తీక్ ప్రయత్నించినప్పటికీ.. అది అతనికి అందకుండా వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ వైపు దూసుకెళ్లింది.

వైడ్ కాదంటూ..

తనకు అందకుండా బంతి దూసుకెళ్లడంతో దాన్ని వైడ్‌గా భావించాడు దినేష్ కార్తీక్. ఇదే విషయాన్ని తెలుగులోనే అంపైర్ షంషుద్దీన్‌ను అడిగాడు. `అంపైర్.. ఇది వైడా?` అని ప్రశ్నించాడు. దీనికి తెలుగులోనే షంషుద్దీన్ సమాధానం ఇచ్చాడు. `లోపల..చానా లోపల. కొంచెం గూడ కాదు..అంటూ చిరునవ్వుతో బదులిచ్చాడు. అది వైడ్ బంతి కాదని చెప్పారు. వైడ్ లైన్ కంటే చాలా లోపలే అది పిచ్ అయిందనే సందేశాన్ని ఆయన తెలుగులో ఇచ్చారు.

హైదరాబాదీయుడే..

హైదరాబాదీయుడే..

ఫీల్డ్ అంపైర్ షంషుద్దీన్ తెలుగువాడే. హైదరాబాదీయుడు. ఆయన జన్మించింది హైదరాబాద్‌లో. 1970 ఆయన జన్మించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా ఆయన కేరీర్ 2012లో ఆరంభమైంది. ఆ ఏడాది జనవరి 7వ తేదీన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కు షంషుద్దీన్ అంపైర్‌గా వ్యవహరించారు. ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. అంపైర్‌గా ఆయనకు ఇది తొలి టీ20 మ్యాచ్. ఇప్పటిదాకా 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు పనిచేశారు.

43 ఓడీఐలకు అంపైర్‌గా

43 ఓడీఐలకు అంపైర్‌గా

ఆ మరుసటి ఏడాది వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అడుగు పెట్టారు. 2013 అక్టోబర్ 19వ తేదీన మొహాలీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆయన అంపైర్‌గా పనిచేశారు. ఇది ఆయన తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఇప్పటిదాకా 43 వన్డే మ్యాచ్‌లకు అంపైర్‌గా ఉన్నారు. ఐసీసీ ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ అంపైర్స్ ప్యానెల్ ఆన్ ఫీల్డ్ కేటగిరీతో షంషుద్దీన్ అసోసియేట్‌ అయ్యారు.

Story first published: Friday, October 30, 2020, 10:03 [IST]
Other articles published on Oct 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+