KXIP vs DC trolls: పంత్ కూరగాయలు అమ్ముతున్నావా? ఆ బ్యూటీ కోసమైనా పంజాబ్ గెలవాల్సిందే!

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్రేక్‌లు వేసింది. ఢిల్లీతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో రాహుల్ సేన గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో పంజాబ్ అదరగొట్టగా.. ఢిల్లీ ఈ మూడింటిలో విఫలమై మూల్యం చెల్లించుకుంది. శిఖర్ ధావన్ అజేయ శతకం మినహా.. అంతా విఫలమయ్యారు. ముఖ్యంగా రిషభ్ పంత్ చేసిన ఘోర తప్పిదం ఆ జట్టు ఓటమిని శాసించింది. దాంతో అభిమానులు పంత్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను వికెట్ల వెనుకాల అరిచే అరుపులపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మ్యాచ్‌పై నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.

పంత్.. ధోనీ అనుకున్నావా?

రవిచంద్రన్ అశ్విన్ వేసిన 8వ ఓవర్ ఐదో బంతిని నికోలస్ పూరన్..షార్ట్ కవర్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి నేరుగా శిఖర్ చేతిలో పడటంతో నాన్‌స్ట్రైకర్ మ్యాక్స్‌వెల్ నిరాకరించాడు. దాంతో పూరన్ వెనక్కు తిరగ్గా.. శిఖర్ వేసిన బంతిని అందుకున్న పంత్ రనౌట్ చేయడంలో విఫలమయ్యాడు. సింపుల్‌గా ఔట్ చేసేదాన్ని క్లిష్టంగా కిందపడి కొట్టే ప్రయత్నం చేశాడు. దాంతో రనౌట్ చేజారడంతో పాటు మరో ఎక్స్‌ట్రా రన్ వచ్చింది. అప్పుడు పూరన్ స్కోర్ 10 పరుగులు మాత్రమే. ఈ అవకాశంతో చెలరేగిన అతను 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఢిల్లీకి చేయాల్సిన నష్టం చేశాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పంత్‌పై అభిమానులు మండిపడుతున్నారు. ధోనీ అనుకుంటున్నావా? ఎందుకు ఆ సర్కస్ ఫీట్లు.. సింపుల్‌గా కొట్టవచ్చు కదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీధి వ్యాపారిలా ఆ అరుపులేంటి..

ఇక వికెట్ల వెనుకాల ఉండే పంత్ బ్యాట్స్‌మన్ ఏకగ్రాతను దెబ్బతీయాడానికి ఏదో ఒకటి అరుస్తూ ఉంటాడు. ‘కమాన్ యాష్(అశ్విన్).. బంతి ఇలా వేయ్ ఇతను ఆడలేడు'అంటూ బ్యాట్స్‌మెన్ రెచ్చగొడుతుంటాడు. అతని అరుపులు స్టంప్స్ మైక్‌లో క్లియర్‌గా వినిపిస్తున్నాయి. దీంతో వచ్చిన అవకాశాలను సద్వినయోగం చేసుకోవు కానీ వెనుకాల ఒకటే అరుస్తున్నావ్? అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కూరగాయాల వ్యాపారివా? అంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అతని అరుపులు ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిలానే ఉన్నాయని ఒకరంటే.. పంత్‌కు బేసిక్ స్కిల్స్ లేవని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు.

సొట్ట బుగ్గల సుందరి నవ్వు కోసమైనా..

ఇక పంజాబ్ కో ఓనర్, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింతా ముఖంలో చిరునవ్వు కోసమైనా పంజాబ్ గెలవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సొట్ట బుగ్గల సుందరి నవ్వితే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు. దానికి తమ అభిమాన జట్టు ఓడిపోయినా పర్లేదని కామెంట్ చేస్తున్నారు. ఇక తమ టీమ్‌కు మద్దతు తెలుపుతూ ప్రీతీ జింతా స్టాండ్స్‌లో హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు ఆడిన గత రెండు మ్యాచ్‌లు ఉత్కంఠతను రేకిత్తించడంతో ఈ బ్యూటీ ఉక్కిరి బిక్కిరి అయింది. నిన్నటి మ్యాచ్ సజావుగా గెలవడంతో ఊపిరి పీల్చుకుంది.

శిఖర్ సూపర్ సెంచరీ

ఢిల్లీ ఆటకు పరుగుల బాట చూపించిన శిఖర్‌ ధావన్‌ అజేయ శతకం... సుడి‘గేల్‌', పూరన్‌ మెరుపుల ముందు చిన్నబోయింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' శిఖర్‌ ధావన్‌ (61 బంతుల్లో 106 నాటౌట్‌) ఒక్కడే చెలరేగాడు. వీరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోరుబోర్డును నడిపించాడు. తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. పూరన్‌ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), గేల్‌ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు.

మన గల్లీ బాయ్‌కి గోల్డెన్ చాన్స్.. ఆస్ట్రేలియా టూర్‌కు మహ్మద్ సిరాజ్!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, October 21, 2020, 10:26 [IST]
Other articles published on Oct 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X