ఐపీఎల్ 2020 జట్లు
క్రికెట్ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి గిరాటేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. ఒక్కటా..! రెండా..? ఎన్నో..! ఎన్నెన్నో..? దాదాపు రెండు నెలలపాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేసింది. ఇప్పటికే సక్సెస్ఫుల్గా 12 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ 13 వ సీజన్, సెప్టెంబర్ 19న ప్రారంభంకానుంది. ఈ డొమెస్టిక్ టీ20 లీగ్ టైటిల్ కోసం మొత్తం 8 జట్లు నువ్వా-నేనా అన్నట్లు పోటీపడనున్నాయి. గతేడాది మాదిరే ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ మెగాటోర్నీలో జట్లన్నీ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించిన ఆయా ఫ్రాంఛైజీలుప్లే ఆఫ్ చేరడానికి తమకున్న ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోకూడదని భావిస్తున్నాయి. ఆ జట్ల వివరాల గురించి తెలుసుకుందాం.!