సతీమణికి ప్రేమతో.. టాటూలు వేయించుకున్న రైనా!!

ఘజియాబాద్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షార్జా, అబుదాబి మరియు దుబాయ్ వేదికల్లో అన్ని మ్యాచులు జరగనున్నాయి. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నుంచి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు తాజాగా క్లియరెన్స్ కూడా అందడంతో టీమ్స్ కూడా త్వరలోనే యూఏఈకి దారి పట్టనున్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆగస్ట్ 21న యూఏఈకి పయనం కానుంది.

 ప్రేమతో పచ్చబొట్లు:

ప్రేమతో పచ్చబొట్లు:

యూఏఈలో ఐపీఎల్‌ ఆడేందుకు కుటుంబానికి చాలా రోజులు దూరంగా వెళ్లనుండడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా.. తన కుటుంబంపై ఉన్న ప్రేమను మరోసారి వినూత్న రీతిలో చాటుకున్నాడు. 2016లో కూతురు గ్రేసియా పేరును ఎడమ చేతి మీద టాటూ వేయించుకున్న రైనా.. తాజాగా తన సతీమణి ప్రియాంక, ఇటీవలే జన్మించిన కుమారుడు రియో పేర్లను కూడా టాటూలుగా వేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రైనా మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

నేను జీవించడానికి కారణం వాళ్లే:

నేను జీవించడానికి కారణం వాళ్లే:

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా టాటూలు వేయించుకునేటప్పుడు తీసిన ఓ వీడియోను కూడా వెటరన్ బ్యాట్స్‌మన్‌ సురేష్ రైనా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా రైనా ఓ పోస్ట్ పెడుతూ.. 'నేను జీవించడానికి కారణం వాళ్లే' అని పేర్కొన్నాడు. రైనా చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయింది. 'సతీమణికి ప్రేమతో రైనా' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'కుటుంబంపై ఉండే ప్రేమ ఇదే' అని మరో అభిమాని పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌ వేళ పూర్తిగా ఇంటికే పరిమిత రైనా.. కూతురు, కుమారుడితో సరదా సమయం గడిపాడు.

సాధన షురూ:

సాధన షురూ:

ఇటీవలే సురేష్ రైనా ఇప్పుడు తిరిగి సాధన మొదలుపెట్టాడు. కొద్దిరోజులుగా తన ఇంటి పక్కనే ఉన్న ఓ మైదానంలో తీవ్రంగా కష్టపడుతున్నాడు. దాదాపు నాలుగు నెలలు విశ్రాంతి దొరకడంతో శరీరం ఫిట్‌నెస్‌ కోల్పోయిందని భావించి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. రైనా తన ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఇన్‌స్టాలో పంచుకుంటున్న విషయం తెలిసిందే. కాగా మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన ముందస్తు శిక్షణా శిబిరంలో కూడా రైనా పాల్గొన్నాడు. భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు.

 సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లు:

సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లు:

సురేష్ రైనా ఇప్పటివరకు మొత్తం 193 మ్యాచ్‌లు ఆడి 5,368 పరుగులతో ఐపీఎల్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. ఇన్ని సీజన్‌లలో ఒక్కసారి కూడా రైనా నిరాశపర్చలేదు. 2008 నుంచీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫునే ఆడుతున్న రైనా.. మధ్యలో కొచ్చి టస్కర్స్ తరఫున రెండు సీజన్లు ఆడాడు. రైనా సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లాడి.. అత్య‌ధిక మ్యాచ్‌లాడిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో సీఎస్‌కే మొత్తంగా 165 మ్యాచ్‌లు ఆడగా.. రైనా 164 మ్యాచ్‌లు ఆడాడు. కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్‌ను రైనా ఆడలేదు. అదికూడా 2018లో కాలి పిక్క గాయం కార‌ణంగా బరిలోకి దిగలేదు.

5 సార్లు ఫైన‌ల్‌కు చేరినా కప్ గెలవలేదు.. గ‌యానా జ‌ట్టును వెంటాడుతున్న దుర‌దృష్టం!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 12, 2020, 13:03 [IST]
Other articles published on Aug 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X