ధోనీ-సురేష్ రైనా మధ్య విభేదాలు? ఐపీఎల్‌కు దూరం కావడానికి అదే కారణమా? రిలేషన్ ఎలా ఉంది?

IPL 2020 : Suresh Raina Drops A Hint About The Relationship With MS Dhoni

చెన్నై: రాజకీయాల్లో శాశ్వత శతృవులు ఉండరని అంటుంటారు. ఎంత తిట్టుకున్నా.. ఎప్పుడో ఒకసారి కలవాల్సి వస్తుంది. ఉమ్మడి శతృవును దెబ్బకొట్టడానికి చేతులు కలపాల్సీ ఉంటుంది. రాజకీయాల్లో ఇలాంటి సందర్భాలు చాలా చోటు చేసుకున్నాయి. అందుకు తగ్గ ఉదాహరణలూ చాలానే ఉన్నాయి. తాజాగా- క్రికెట్‌లోనూ ఇదే పరిస్థితి ఏర్పడినట్టు కనిపిస్తోంది. శాశ్వత శతృవులు గానీ, శాశ్వత మిత్రులు గానీ ఉండరనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇంట్రడక్షన్ ఎందుకంటే.. జార్ఖండ్ డైనమేట్ మహేంద్రసింగ్ ధోనీ, ఐపీఎల్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్.

హాట్ టాపిక్‌గా సురేష్ రైనా..

హాట్ టాపిక్‌గా సురేష్ రైనా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన ప్లేయర్ సురేష్ రైనా. ఈ సీజన్‌లో అతను ఆడట్లేదు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మెంబర్ అయిన సురేష్ రైనా- జట్టుతో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దాకా వెళ్లి మరీ రిటర్న్ అయ్యాడు. స్వదేశానికి తిరిగి వచ్చాడు. టోర్నమెంట్ ప్రారంభానికి చాలారోజుల ముందే వెనక్కి వచ్చేశాడు. అలా అర్ధాంతరంగా వెనక్కి మళ్లడానికి వ్యక్తిగత కారణాలేనని చెబుతున్నారు. అప్పటి నుంచీ.. ఐపీఎల్ డిస్కషన్స్ మొత్తం అతని చుట్టే తిరుగుతున్నాయి. అతను హాట్ టాపిక్‌గా మారిపోయాడు.

అసంతృప్తి టీమ్ మేనేజ్‌మెంట్‌పైనే..

అసంతృప్తి టీమ్ మేనేజ్‌మెంట్‌పైనే..

చెన్నై సూపర్ కింగ్స్ మీద ఉన్న అసహనం, అసంతృప్తితోనే సురేష్ రైనా ఈ టోర్నమెంట్‌కు దూరం అయ్యాడనే టాక్ వినిపిస్తోంది.. ఆఫ్ ది రికార్డ్‌గా. తనకు కేటాయించిన రూమ్ విషయంలో సురేష్ రైనా అసంతృప్తి వ్యక్తం చేశాడని, దాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ పెద్దగా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ టోర్నమెంట్‌కు దూరం అయ్యాడనే వార్తలు స్పోర్ట్స్ వరల్డ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అది వేరే విషయం. చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్‌పైనే ఉన్న తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సమయంలో స్నేహితుడు, టీమ్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం పట్టించుకోలేదని, అందు వల్లే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనీ చెబుతున్నారు నెటిజన్లు.

వాస్తవం ఏంటీ? నిజంగానే అభిప్రాయ భేదాలు ఉన్నాయా

వాస్తవం ఏంటీ? నిజంగానే అభిప్రాయ భేదాలు ఉన్నాయా

మహేంద్రసింగ్ ధోనీ-సురేష్ రైనా మధ్య నిజంగానే అభిప్రాయ భేదాలు ఉన్నాయా? లేక అవన్నీ సోషల్ మీడియా సృష్టించినవేనా? వారిద్దరి మధ్య రిలేషన్ ఇప్పుడు ఎలా ఉంది? చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దూరమైనప్పటికీ కేప్టెన్ ఎంఎస్ ధోనీతో సురేష్ రైనా డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నాడా? అనే ప్రశ్నలు అభిమానులను తొలచి వేస్తున్నాయి. దానికీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం మీదే సరైన సమాధానం లభించింది.

ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతోందనే సంకేతాలు ఎలా పంపించాడంటే?

ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతోందనే సంకేతాలు ఎలా పంపించాడంటే?

మహేంద్రసింగ్ ధోనీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తమ ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతోందనే సంకేతాలను పంపించాడు సురేష్ రైనా. ఆ సంకేతాలను పంపించిన విధానం కూడా ముచ్చటేస్తుంది. `ధోనీ రైనా టీమ్..` అనే ట్విటర్ అకౌంట్ ఒకటుంది. ప్రత్యేకించి- ఈ ఇద్దరు క్రికెటర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా, వార్తలనైనా, స్కోరింగ్ షాట్లనైనా ఇందులో పోస్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్.. తాజాగా సురేష్ రైనా ఇందులో ధోనీతో కలిసి ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. దానికి లైక్ కొట్టాడు. దీన్ని బట్టి వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోందని భావిస్తున్నారు అభిమానులు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, October 1, 2020, 13:28 [IST]
Other articles published on Oct 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X