కోహ్లీ-సురేష్ రైనా-రోహిత్ శర్మ: ట్రయాంగులర్: నెక్స్ట్ డేవిడ్ వార్నర్: మోర్ పవర్ టు యూ

అబుధాబి: ముంబై ఇండియన్స్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ.. మరో అరుదైన రికార్డును సాధించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డును సాధించిన క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా మాత్రమే. తాజాగా రోహిత్ శర్మ కూడా వారి సరసన చేరాడు. అదే- 5000 పరుగుల క్లబ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 5000 పరుగుల క్లబ్‌లో చేరాడు హిట్ మ్యాన్. ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో గురువారం రాత్రి కేఎల్ రాహుల్ సారథ్యంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ ఈ రికార్డును సాధించాడు.

కోహ్లీ, రైనాల తరువాత..
5000 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి రోహిత్ శర్మ కేవలం నాలుగు పరుగుల దూరంలో ఉన్నాడు. కింగ్స్ ఎలెవెన్‌తో మ్యాచ్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న తొలి బంతిని బౌండరీకి తరలించిన రోహిత్.. 5000 పరుగులను అందుకున్నాడు. దీనికోసం రోహిత్ శర్మ మొత్తం 191 మ్యాచ్‌ను ఆడాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ-180, మ్యాచ్‌ల్లో 37.12 సగటుతో 5,430 పరుగులు చేయగా.. రైనా 193 మ్యాచ్‌ల్లో 33.34 సగటుతో 5,368 పరుగులు బాదాడు. 5 వేల పరుగులు పూర్తి చేయడానికి రోహిత్ 191 మ్యాచ్‌లను ఆడాడు.

పంజాబ్‌పై 600 పరుగులకు పైగా..
ఇదే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ మరో ఘనతను సాధించింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుపై 600 పరుగుల రికార్డును నెలకొల్పాడు. రోహిత్ శర్మ దూకుడుకు బలైన అయిదో జట్టు కింగ్స్ ఎలెవెన్. ఐపీఎల్‌లో 600 పరుగులకు పైగా వ్యక్తిగత స్కోరును సాధించాడతను. ఇంతకుముందు నాలుగు ఐపీఎల్ టీమ్‌లపై రోహిత్ శర్మ 600లకు పైగా పరుగులు చేశాడు. గురువారం రాత్రి నాటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ 45 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు ఎనిమిది ఫోర్లు ఉన్నాయి.

అలా అవుట్..
జట్టు స్కోరు 124 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతను అవుట్ అయ్యాడు. రిలే క్యాచ్‌కు పెవిలియన్ దారి పట్టాడు. మహ్మద్ షమీ వేసిన బంతిని లాంగ్ ఆన్ వైపు భారీ షాట్ కొట్టాడు రోహిత్. బౌండరీ లైన్ వద్ద దాన్ని అందుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తనను తాను నిలదొక్కుకోలేకపోయాడు. బౌండరీ లైన్ దాటి వెళ్లాడు. తాను అందుకున్న బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న నీషమ్‌కు వైపు విసిరాడు. ఈ క్యాచ్ నీషమ్ ఖాతాలోకి చేరింది.
రోహిత్ శర్మకు విషెస్ చెప్పిన రైనా..
కోహిత్ శర్మ అయిదు వేల పరుగుల క్లబ్‌లో చేరడం పట్ల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సీనియర్ క్రికెటర్లు అతణ్ని అభినందిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా.. రోహిత్ శర్మకు విషెస్ చెప్పాడు. 5000 పరుగులను అందుకున్నందుకు హృదయపూరక శుభాకాంక్షలు చెబుతున్నానని ట్వీట్ చేశాడు. ప్రౌడ్ ఆఫ్ యు, మోర్ పవర్ టు యూ అంటూ విషెస్ చెప్పాడు.

నెక్స్ట్ బ్యాట్స్‌మెన్ అతనే..
ఇక అయిదు వేల పరుగుల క్లబ్‌లో చేరడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ డేవిడ్ వార్నర్ రెడీగా ఉన్నాడు. ఈ సీజన్ ముగిసే నాటికి వార్నర్.. అయిదు వేల పరుగులను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ ఇప్పటిదాకా ఐపీఎల్‌లో చేసిన పరుగులు 4,793. 129 మ్యాచ్‌లల్లో డేవిడ్ వార్నర్ ఈ పరుగులు చేశాడు. 5000 పరుగుల ల్యాండ్ మార్క్‌ను అందుకోవాలంటే.. డేవిడ్ వార్నర్‌కు 207 పరుగుల అవసరం. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున.. ఈ రికార్డును అందుకునే అవకాశాలు లేకపోలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications