For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'దానికోసం రోజులు లెక్కేస్తూ గడుపుతున్నా.. వేచి ఉండలేకపోతున్నా'

IPL 2020: Suresh Raina cant wait for IPL, Counting days to get on field

ఘజియాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు యూఏఈలో జరగనుంది. యూఏఈలోని మూడు వేదికల్లో ఐపీఎల్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ఇందుకు భారత కేంద్ర ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపినట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. దీంతో మెగా టోర్నీ నిర్వహణ ఖాయం అయిపొయింది. ఇక ఫ్రాంఛైజీలు దుబాయ్ వెళ్లడమే మిగిలి ఉంది. ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించి వచ్చే 20 తర్వాత ఫ్రాంఛైజీలు దుబాయ్ వెళ్లనున్నాయి.

 రోజులు లెక్కేస్తూ గడుపుతున్నా:

రోజులు లెక్కేస్తూ గడుపుతున్నా:

కరోనా వైరస్‌ కారణంగా దాదాపు ఆరు నెలలు వాయిదా పడ్డ ఐపీఎల్‌ 2020 కోసం యావత్‌ క్రీడాలోకం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. అభిమానులే కాదు ఆటగాళ్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ కోసం రోజులు లెక్కేస్తూ గడుపుతున్నా అని చెన్నై సీనియర్‌ ఆటగాడు, భారత వెటరన్ బ్యాట్స్‌మన్‌ సురేష్ రైనా అన్నాడు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో చెన్నై ఆటగాళ్లతో కలిసున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకొన్నాడు రైనా. 'మైదానంలో బరిలోకి దిగి ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని చూస్తున్నా. అందుకోసం రోజులు లెక్కపెడుతున్నా. లీగ్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండలేము' అని ఎంఎస్ ధోనీ, మురళి విజయ్ పేర్లను ట్యాగ్ చేసాడు.

సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లు:

సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లు:

సురేష్ రైనా ఇప్పటివరకు మొత్తం 193 మ్యాచ్‌లు ఆడి 5,368 పరుగులతో ఐపీఎల్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. ఇన్ని సీజన్‌లలో ఒక్కసారి కూడా రైనా నిరాశపర్చలేదు. 2008 నుంచీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫునే ఆడుతున్న రైనా.. మధ్యలో కొచ్చి టస్కర్స్ తరఫున రెండు సీజన్లు ఆడాడు. రైనా సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లాడి.. అత్య‌ధిక మ్యాచ్‌లాడిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో సీఎస్‌కే మొత్తంగా 165 మ్యాచ్‌లు ఆడగా.. రైనా 164 మ్యాచ్‌లు ఆడాడు. కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్‌ను రైనా ఆడలేదు. అదికూడా 2018లో కాలి పిక్క గాయం కార‌ణంగా బరిలోకి దిగలేదు.

 ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు:

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు:

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు కూడా సురేష్ రైనా పేరిటే ఉంది. రైనా 193 మ్యాచ్‌లు ఆడాడు. 164 మ్యాచ్‌లు సీఎస్‌కే తరఫున ఆడగా.. మిగిలిన మ్యాచ్‌లు కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. సీఎస్‌కే రెండు సంవత్సరాలు నిషేదానికి గురైన సమయంలో ఆ జట్టుకు రైనా సారథ్యం కూడా చేసాడు. సీఎస్‌కే, ఆర్‌ఆర్ స్థానాల్లో కొచ్చి టస్కర్స్, పూణే వారియర్స్ వచ్చాయి. రైనా తర్వాత ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడింది ఎంఎస్ ధోనీ. 190 మ్యాచ్‌ల‌తో ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శ‌ర్మ (188), దినేశ్ కార్తీక్ (182), విరాట్ కోహ్లీ (177) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.

గతేడాది జూలైలో చివరి వన్డే:

భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన సురేశ్ రైనా.. 78 మ్యాచ్‌లాడి 134.79 స్ట్రైక్‌రేట్‌తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్ టోర్నీలలో సత్తాచాటి ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్నాడు.

Story first published: Monday, August 10, 2020, 16:20 [IST]
Other articles published on Aug 10, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+