Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. మళ్లీ వెనక్కి: ఆ టీమ్‌తో కాంట్రాక్ట్: సొంతగూటికి

IPL 2020: Sunrisers Hyderabad spinner Rashid Khan re-signs for Adelaide Strikers

అబుధాబి: సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ స్పిన్నర్ మరో టీమ్‌తో జట్టు కట్టాడు. బిగ్ బాష్ లీగ్‌లో మళ్లీ అతను అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడబోతున్నాడు. అది అతని పాత జట్టే. మధ్యలో కొంతకాలం పాటు ఆ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతణ్ని మళ్లీ వెనక్కి పిలిపించిందా టీమ్ మేనేజ్‌మెంట్. కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేసుకుంది. వచ్చే బిగ్ బాష్ లీగ్ మ్యాచుల్లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడటానికి సన్నాహాలు చేస్తున్నాడు. కాంట్రాక్ట్‌పై సంతకం చేశాడు. ఈ విషయాన్ని అడిలైడ్ స్ట్రైకర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.

బిగ్ బాష్ లీగ్‌లో చెక్కుచెదరని రికార్డు రషీద్ ఖాన్ పేరు మీద ఉంది. ఇప్పటిదాకా అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున 40 మ్యాచ్‌లను ఆడాడు. 56 వికెట్లను పడగొట్టాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా రికార్డును నెలకొల్పాడు. 10 ఇన్నింగుల్లో అతని బౌలింగ్ యావరేజ్ 6.36 శాతమే. మంచి ట్రాక్ రికార్డు ఉండటం, బౌలింగ్ విభాగంలో బలహీనంగా ఉండటంతో అడిలైడ్ స్ట్రైకర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ రషీద్‌ ఖాన్‌తో మళ్లీ కాంట్రాక్టును కుదుర్చుకుంది.

బిగ్‌బాష్ లీగ్ ఆడబోతుండటం, అది కూడా అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున కావడం తనకు ఆనందాన్ని ఇస్తోందని రషీద్ ఖాన్ చెప్పాడు. అడిలైడ్ స్ట్రైకర్స్‌ను తన సొంతజట్టుగా భావిస్తుంటానని అన్నాడు. అలాంటి జట్టులో మళ్లీ చేరడం సొంత ఇంటికి వెళ్లినట్టు ఉందని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం రషీద్ ఖాన్ ఐపీఎల్-2020 సీజన్‌లో సన్ రైజర్స్‌ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నాడు. జట్టుతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్నాడు.

రషీద్ ఖాన్‌తో కాంట్రాక్టును కుదుర్చుకోవడం పట్ల అడిలైడ్ స్ట్రైకర్స్ హెడ్ కోచ్ జాసన్ గిలెస్పీ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అతని రాకతో బౌలింగ్ విభాగం మరింత బలోపేతమౌతుందని చెప్పాడు. రషీద్ వంటి నాణ్యమైన క్రికెటర్‌ను పొందడం ఏ జట్టుకైనా ఆనందాన్ని ఇస్తుందని, బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని అన్నాడు. అతని కోసం టీమ్ మేనేజ్‌మెంట్, సపోర్టింగ్ స్టాఫ్.. తోటి ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారని కామెంట్స్ చేశాడు. బిగ్ బాష్ లీగ్-2020 సీజన్ 10వ ఎపిసోడ్ డిసెంబర్ రెండోవారంలో ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Thursday, October 22, 2020, 12:48 [IST]
Other articles published on Oct 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+