
దుబాయ్: ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 34 రన్స్‌తో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 రన్స్ చేసింది. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 రన్స్‌కే పరిమితమై ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం వార్నర్ సేనకు కాస్త సమయం దొరికింది. దీంతో మైదానాల్లో చెమటోడ్చిన ఆటగాళ్లు.. ఇప్పుడు బీచ్‌లో ఆటలాడుతూ హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు.
టోర్నీలో ముందుముందు రసవత్తర పోరు ఉండడంతో ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత అవసరమని భావించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం వాళ్లను బీచ్‌కు పంపించింది. దీంతో సన్‌రైజర్స్ ఆటగాళ్లు కెప్టెన్ డేవిడ్ వార్నర్ సారథ్యంలో బీచ్ వాలీబాల్ ఆడుతూ సేద తీరారు. వార్నర్ స్వయంగా కోర్టు గీస్తూ కనిపించగా.. ఆటగాళ్లంతా వాలీబాల్ ఆడుతూ ఉత్సాహంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను యాజమాన్యం తన ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది.
ఈ ఉపశమనం సన్‌రైజర్స్ ఆటగాళ్లను గత వైఫల్యాల జ్ఞాపకాల నుంచి బయటపడేసి.. వాళ్లలో ఉత్తేజం నింపడానికి ఉపయోగపడుతుంది అని డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. సన్‌రైజర్స్ అక్టోబర్ 4న ముంబైతో మ్యాచ్ ఆడింది. తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్ 8న పంజాబ్‌తో తలపడనుంది. మధ్యలో మూడు రోజులు సమయం దొరకరకడంతో ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన వార్నర్‌సేన రెండింట్లో గెలిచి మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
తాజాగా ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలవగానే చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి, సన్‌రైజర్స్ ఆరోస్థానానికి చేరుకున్నాయి. ఈరోజు కోల్‌కతా, చెన్నై జట్ల మధ్య దుబాయ్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మెరుగైన నెట్ రన్ రేట్ సాయంతో బెంగళూరును వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంటుంది. ఈరోజు మ్యాచ్‌లో చెన్నై స్వల్ప తేడాతో గెలుపొంది.. రేపటి మ్యాచ్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం సాధిస్తే.. మెరుగైన నెట్ రన్ రేట్‌తో ఆరెంజ్ ఆర్మీ మూడో స్థానానికి చేరుకుంటుంది. లేదంటే ఏడో స్థానానికి పడిపోతుంది.