Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్: సునీల్ నరైన్..ఐపీఎల్‌ నుంచి అవుట్: ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?

IPL 2020: Sunil Narine Working hard With Carl Crowe Suspect bowling Action

దుబాయ్: అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 మ్యాచ్‌లకు దూరమైన కోల్‌కత నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఏం చేస్తున్నాడు?, ఎక్కడున్నాడు? బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడా? కొంతకాలంగా క్రికెట్ ప్రేమికులను వేధిస్తోన్న ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్‌తో జట్టుకు దూరమైన వెస్టిండీస్ ఏస్ స్పిన్నర్.. తన బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకోవడానికి కొంతకాలంగా కఠోరంగా శ్రమిస్తున్నాడు. బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకుంటే గానీ జట్టులో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోవడంతో.. దానిపై దృష్టి పెట్టాడు.

సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై..

సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలో షేక్ జయేద్ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై జరిగిన మ్యాచ్‌ సందర్భంగా సునీల్ నరైన బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఉల్లాస్ గాంధీ, క్రిస్ గెఫెనీ.. అతని బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనలకు విరుద్ధంగా అతని బౌలింగ్ యాక్షన్ ఉంటోందని పేర్కొన్నారు. దాన్ని సరిచేసుకోవాల్సి ఉంటుందనీ అన్నారు. దీనితో సునీల్ నరైన్‌కు తన బౌలింగ్ యాక్షన్‌ను సల్పంగా మార్చుకోవాల్సి వచ్చింది. బంతిని సంధించే విధానాన్ని సవరించుకోవాల్సి వచ్చింది.

ఇంగ్లాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వద్ద

ఇంగ్లాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వద్ద

ప్రస్తుతం సునీల్ నరైన్ ఇంగ్లాండ్‌కు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కార్ల్ డేనియల్ క్రోవ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. కార్ల్ క్రోవ్.. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. బయోమెకానిజం ఎక్స్‌పర్ట్ కూడా. ప్రస్తుతం అతని పర్యవేక్షణలో బౌలింగ్ యాక్షన్‌ను ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా మార్చుకుంటున్నాడు. నిరంతరాయంగా శ్రమిస్తున్నాడు. ఇదివరకు కార్ల్ క్రోవ్..పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ హఫీజ్ బౌలింగ్ శైలిని మెరుగుపర్చడానికి శిక్షణ ఇచ్చాడు. ఈ శిక్షణ తరువాత హఫీజ్ రాణిస్తున్నాడు.

చెన్నైలో ట్రైనింగ్..

చెన్నైలో ట్రైనింగ్..

సునీల్ నరైన్.. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు గుర్తింపు పొందిన శ్రీ రామచంద్ర ఆర్థోస్కోపీ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ సెంటర్ (SRASSC)లో శిక్షణలో ఉన్నాడు. శిక్షణ ముగించుకున్న తరువాత కూడా సునీల్ నరైన్ మళ్లీ క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్-2020 సీజన్ మొత్తానికీ అందుబాటులో ఉండకపోవచ్చని చెబుతున్నారు. శిక్షణ, క్వారంటైన్ పీరియడ్ ముగిసే సరికి ఐపీఎల్ టోర్నమెంట్ కూడా పూర్తయే అవకాశాలు ఉన్నాయి.

గతంలోనూ..

గతంలోనూ..

సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం కావడం కొత్తేమీ కాదు. ఇదివరకు 2015 నవంబర్‌లో వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటన సందర్భంగా అతని బౌలింగ్‌పై తొలిసారిగా అనుమానాలు మొదలయ్యాయి. పల్లెకెలెలో జరిగిన వన్డేలో సందేహాస్పదంగా అతను బంతులను సంధించినట్లు ఫిర్యాదులొచ్చాయి. అంతకుముందు-2014లో టీ20 ఛాంపియన్స్ లీగ్‌లోనూ అతను ఇవే ఆరోపణలను ఎదుర్కొన్నాడు. సస్పెన్షన్‌కు కూడా గురయ్యాడు. ఆ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. ఇప్పుడు మరోసారి అవే అనుమానాలు అతణ్ని చుట్టుముట్టాయి.

వార్నింగ్ లిస్ట్‌లో..

వార్నింగ్ లిస్ట్‌లో..

ఫీల్డ్ అంపైర్లు ఇచ్చిన ఫిర్యాదుతో సునీల్ నరైన్ పేరును వార్నింగ్ లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. మరోసారి అదే పరిస్థితి ఏర్పడటమంటూ జరిగితే.. సస్పెన్షన్ వేటును ఎదుర్కొనడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధింవచ్చనీ చెబుతున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఆడటానికి సునీల్ నరైన్‌ను అనుమతి ఇచ్చారు. కోల్‌కత నైట్ రైడర్స్ ఆడే మ్యాచుల్లో తుది జట్టులో అతణ్ని తీసుకోవడానికి ఐపీఎల్ మేనేజ్‌మెంట్ అనుమతి ఇచ్చింది. ఇదే అతనికి చివరి వార్నింగ్. ఇకముందు సందేహాస్పదంగా బంతులను సంధించితే మాత్రం వేటు తప్పదని హెచ్చరించింది.

Story first published: Thursday, October 15, 2020, 16:18 [IST]
Other articles published on Oct 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+