స్టీవ్ స్మిత్ సలహాలు: ఐపీఎల్ 2020లో కోహ్లీ సారథ్యంలో, ఎవరీ జోష్ ఫిలిప్!

IPL 2020 : Steve Smith Tips Young RCB Star Josh Philippe For Future Success || Oneindia Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌ 2019-20 సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే ప్లే ఆఫ్స్‌లో సైతం ఆ జట్టు తప్పక చోటు దక్కించుకుంటుంది. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో జోష్ ఫిలిప్ ఒకడు.

ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ తన చక్కని ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా, జోష్ ఫిలిప్ ప్రదర్శనను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కొనియాడాడు. త్వరలోనే అతడు మూడు ఫార్మాటల్లోనూ ఆస్ట్రేలియా ప్రాతినిధ్యం వహిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

సాధారణంగా సీనియర్ క్రికెటర్లు యువ క్రికెటర్లలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి సలహాలు ఇస్తుండటాన్ని చూస్తుంటాం. జోష్ ఫిలిప్‌లో మంచి ప్రతిభ ఉందని గమనించిన స్టీవ్ స్మిత్ అతడికి క్రికెట్‌లో మెళకువలు నేర్పించడంతో పాటు టిప్స్ కూడా ఇస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తన వెబ్‌సైట్‌లో ఓ కథనాన్ని ప్రచురించింది.

థాయ్‌లాండ్ మాస్టర్స్: ఫస్ట్ రౌండ్‌లోనే శ్రీకాంత్, సమీర్, ప్రణయ్ ఔట్

జోష్ ఫిలిప్‌కు స్మిత్ సపోర్ట్

జోష్ ఫిలిప్‌కు స్మిత్ సపోర్ట్

అతడికి మద్దతుగా కూడా నిలుస్తున్నాడంట. బిగ్‌బాష్ లీగ్‌లో జోష్ ఫిలిప్‌ను సిడ్నీ సిక్సర్స్ జట్టు తరుపున ఆడించాలని స్టీవ్ స్మిత్ వ్యక్తిగతంగా కోరాడు. అన్ని రకాల బౌలింగ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న జోష్ ఫిలిప్ గొప్ప బ్యాటింగ్ ప్రతిభను స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు.

గొప్ప బ్యాట్స్‌మన్‌గా

గొప్ప బ్యాట్స్‌మన్‌గా

ముఖ్యంగా బౌలింగ్‌లో కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడం ద్వారా ఫిలిప్‌ను మరింత గొప్ప బ్యాట్స్‌మన్‌గా మారుస్తుందని స్మిత్ తెలిపాడు. ఇందులో భాగంగా సిడ్నీ సిక్సర్స్ తరుపున జోష్ ఫిలిప్‌ను టాపార్డర్‌లో ఆడించాలని... అవసరమైతే ఇన్నింగ్స్ మధ్యలో కూడా బ్యాటింగ్ చేయించాలని సూచించాడు.

స్టీవ్ స్మిత్ ప్రకారం

స్టీవ్ స్మిత్ ప్రకారం

స్టీవ్ స్మిత్ ప్రకారం జోష్ ఫిలిప్ పూర్తి బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు రాబోయే రోజుల్లో మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించగలడు. ఆస్ట్రేలియా ప్రస్తుత వికెట్ కీపర్, టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ త్వరలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. అతడి తర్వాత 28 ఏళ్ల అలెక్స్ కారీ ఆస్ట్రేలియా కొత్త టెస్ట్ కీపర్ అవుతాడు.

ఇప్పటి నుంచే జోష్ ఫిలిప్‌ను

ఇప్పటి నుంచే జోష్ ఫిలిప్‌ను

ఇప్పటి నుంచే జోష్ ఫిలిప్‌ను పూర్తి స్థాయి బ్యాట్స్‌మెన్‌గా తీర్చిదిద్దితే అలెక్స్ కారీ తర్వాత వికెట్ కీపర్‌గా తదుపరి స్థానంలో ఉండాడనేది స్మిత్ నమ్మకం. అందుకే జోష్ ఫిలిప్‌కు మద్దతుగా నిలవడంతో పాటు అతడికి అన్ని విధాలా సాయపడుతున్నాడు. కాగా, ఈ సీజన్‌లో ఫిలిప్ 12 బీబీఎల్ మ్యాచ్‌ల్లో 288 పరుగులు చేశాడు.

బీబీఎల్‌లో అత్యధిక స్కోరు 83

బీబీఎల్‌లో అత్యధిక స్కోరు 83

ఈ సీజన్‌లో అతడికి అత్యధిక స్కోరు 83. బీబీఎల్ తర్వాత జోష్ ఫిలిప్ విరాట్ కోహ్లీ సారథ్యంలో కూడా ఆడనున్నాడు. ఐపీఎల్ 2020లో జోష్ ఫిలిప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. గతే డిసెంబర్‌‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో జోష్ ఫిలిప్‌ను ఆర్సీబీ యాజమాన్యం కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.

జోష్ ఫిలిప్‌తో పాటు

జోష్ ఫిలిప్‌తో పాటు

జోష్ ఫిలిప్‌తో పాటు, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్, ప్రోటీస్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ వంటి వారు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ పూర్తి జట్టిదే:

రాయల్ ఛాలెంజర్స్ పూర్తి జట్టిదే

రాయల్ ఛాలెంజర్స్ పూర్తి జట్టిదే

విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డివిలియర్స్, దేవదత్ పాడికల్, గుర్కీరత్ మన్ సింగ్, మొయిన్ అలీ, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, పార్థివ్ పటేల్, పవన్ నేగి, శివం దుబే, ఉమేష్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, పవన్ దేశ్‌పాండే, డేల్ స్టెయిన్, షాబాజ్ అహమద్, ఇసురు ఉదనా

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, January 22, 2020, 16:44 [IST]
Other articles published on Jan 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X