
ఆర్చర్‌తో మరో ఓవర్ వేయించాల్సింది:
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సారథి స్టీవ్ స్మిత్ చేసిన ఒక్క తప్పిదం ఆ జట్టును ముంచిందనే చెప్పాలి. అదే సమయంలో ఆ తప్పిదమే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసొచ్చింది. అదేంటో ఓసారి చూద్దాం. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు ఆరంభంలోనే మూడో ఓవర్ ఇవ్వకపోవడం స్మిత్ చేసిన తప్పిదం. తొలి ఓవర్లోనే వార్నర్‌ను ఔట్ చేసిన ఆర్చర్.. ఆ తర్వాతి ఓవర్లో బెయిర్‌స్టోను వెనక్కి పంపాడు. ఓపెనర్లు 15 పరుగులకే పెవిలియన్ చేరినప్పటికీ.. శంకర్ అండతో మనీష్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ దశలో ఆర్చర్‌తో మరో ఓవర్ బౌలింగ్ చేయించి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. ఇద్దరిలో ఒక్కరు ఔట్ అయినా సన్‌రైజర్స్ ఒత్తిడిలో పడేది.

ఆచితూచి ఆడారు:
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించింది. రాబిన్ ఉతప్ప త్వరగానే ఔటైనప్పటికీ.. బెన్ స్టోక్స్, సంజూ శాంసన్ రెండో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నిర్మించారు. మరి జాగ్రత్తగా ఆచితూచి ఆడారు. కానీ వికెట్ పడొద్దనే ఉద్దేశంతో నెమ్మదిగా ఆడారు. దీంతో రన్ రేట్ పడిపోయింది. కీలక ఓవర్లలో స్టోక్స్, సంజూ 49 బంతుల్లో 56 రన్స్ మాత్రమే చేశారు. ఇద్దరిలో ఒక్కరు దూకుడుగా ఆడినా.. రాజస్థాన్ మెరుగైన స్కోర్ చేసేది. మరో 20-30 పరుగు చేస్తే సన్‌రైజర్స్‌కు ఛేదన కష్టంగా ఉండేది.

తెవాటితియా ముందుకు వచ్చి ఉంటే:
ఇన్నింగ్స్‌ను స్లోగా ప్రారంభించిన రాజస్థాన్.. చివర్లోనూ దూకుడుగా ఆడలేకపోయింది. జాస్ బట్లర్, రాహుల్ తెవాటియా లాంటి భారీ హిట్టర్లు జట్టులో ఉన్నప్పటికీ.. డెత్ ఓవర్లలో రాజస్థాన్ 49 పరుగులు మాత్రమే చేసింది. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన తెవాటియాను ముందుగా బ్యాటింగ్‌కు దింపితే.. సన్‌రైజర్స్ స్పిన్నర్లపై ఎదురు దాడి చేసే అవకాశం ఉండేది. కానీ తెవాటియా ఏడో స్థానంలో బరిలో దిగాడు. అప్పుడు కూడా బ్యాట్ జులిపించలేదు. 3 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేశాడు. తెవాటితియా ముందుకు వచ్చి ఉంటే భారీ షాట్లు ఆడేవాడు. స్కోర్ వేగం పెరిగేది.

ఆర్చర్ మెరవడంతో:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లను 154 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప(19; 13 బంతుల్లో 2x4, 1x6) ఆదిలోనే ఔటవ్వగా.. బెన్ స్టోక్స్(30; 32 బంతుల్లో 2x4), సంజూ శాంసన్ (36; 26 బంతుల్లో 3x4, 1x6) ఆచితూచి ఆడారు. వీరిద్దరూ వికెట్ కాపాడుకుంటూ 56 పరుగులు జోడించారు. అయితే జట్టు స్కోర్ 86 పరుగుల వద్ద ఇద్దరూ ఔటయ్యారు. ఆ తర్వాత జోస్ బట్లర్(9) నిరాశ పరిచాడు. ఇక స్టీవ్ స్మిత్ (19; 15 బంతుల్లో 2x4), రియాన్ పరాగ్ (20; 12 బంతుల్లో 2x4, 1x6) కూడా రాణించలేకపోయారు. చివర్లో జోఫ్రా ఆర్చర్ (16; 7 బంతుల్లో 1x4, 1x6) మెరవడంతో రాజస్థాన్ 150 మార్క్ దాటింది.


Click it and Unblock the Notifications












