Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లానింగ్ లేదు.. ఎగ్జిక్యూషన్ అంతకంటే లేదు: అన్ బిలీవబుల్: బ్రావో ఎక్కడ?: శ్రీకాంత్

IPL 2020: Srikkanth questioned to CSK to send Kedar Jadhav to bat ahead of Dwayne Bravo
IPL 2020, KKR vs CSK : K.Srikkanth Questioned Dhoni’s Decision To Send Jadhav To Bat Ahead Of Bravo

చెన్నై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఐపీఎల్-2020 చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏ మాత్రం అచ్చిరావట్లేదనేది తేలిపోయింది. ఆడిన ఆరు మ్యాచుల్లో రెండింట్లో మాత్రమే విజయాన్ని రుచి చూసింది ధోనీ సేన. ఫలితంగా- విమర్శల జడివాన కురుస్తోంది. టీమిండియా మాజీలు విమర్శనాస్త్రాలను ఎక్కు పెడుతున్నారు. ధోనీ కేప్టెన్సీపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. బలమైన ప్రత్యర్థిని ఢీ కొనాలంటే.. పక్కా ప్లానింగ్ ఉండాలని, దాన్ని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుందంటూ గీతోపదేశం చేస్తున్నారు. కోల్‌కత నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఈ రెండూ లోపించాయని మండిపడుతున్నారు.

చెన్నై పరాజయాల పరంపరలో మరొకటి..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో బుధవారం రాత్రి కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. దినేష్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కత టీమ్ తమ ముందు ఉంచిన 168 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో అయిదు వికెట్లను కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. 10 రన్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్ షేన్ వాట్సన్, చివరిలో రవీంద్ర జడేజా తప్ప బ్యాటింగ్‌లో ఎవరూ రాణించలేకపోెయారు. పరాజయాల పరంపరంలో మరొకటి చేరింది.

కేదార్ జాదవ్‌ను ఆడించడంపై

ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో కేదార్ జాదవ్‌ను పంపించడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. కేదార్ జాదవ్.. ఈ సీజన్‌లో ఏ మాత్రం ఫామ్‌లో లేడు. ఆరు మ్యాచ‌లల్లో అతను చేసిన పరుగులు.. 58. అత్యధిక స్కోరు 26 పరుగులు. అతని బ్యాటింగ్ సగటు 19.33. ఈ లెక్కలు చాలు.. అతను ఏ స్థాయిలో ఆడుతున్నాడో అర్థం చేసుకోవడానికి. అలాంటి బ్యాట్స్‌మెన్‌ను ఛేజింగ్ సమయంలో మిడిల్ ఓవర్ల కోసం పంపించడం ఏ మాత్రం మంచి నిర్ణయం కాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఏ ఒక్కరు ధాటిగా ఆడి ఉన్నా లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టతరం అయ్యేది కాదని అంటున్నారు.

 డ్వేన్ బ్రావోను కాదని..

డ్వేన్ బ్రావోను కాదని..

ఆల్‌రౌండర్, పించ్ హిట్టర్‌ డ్వేన్ బ్రావోను కాదని.. కేదార్ జాదవ్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపించడం సరికాదని టీమిండియా మాజీ ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. డ్వేన్ బ్రావో ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. కేదార్‌కు బదులుగా బ్రావోను పంపించి ఉంటే.. ఫలితం మరోలా ఉండేదనడంలో సందేహాలు అక్కర్లేదని చెప్పారు. డ్వేన్ బ్రావో కంటే ముందు కేదార్‌ను పంపించడాన్ని తాను నమ్మలేకపోతున్నానని శ్రీకాంత్ చెప్పారు. ఛేజింగ్ సమయంలో బ్రావో వంటి బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో దింపకపోవడం వ్యూహలోపమేనని అన్నారు. డెత్ ఓవర్లలో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ అద్భుతంగా బౌలింగ్ చేశారని కితాబిచ్చాడు.

Story first published: Thursday, October 8, 2020, 9:47 [IST]
Other articles published on Oct 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+