
ఆదిలోనే షాక్
పంజాబ్ లక్ష్య ఛేదనను పేలవంగా ఆరంభించింది. రెండో ఓవర్లో అనవసర పరుగుకు ప్రయత్నించి మయాంక్ అగర్వాల్ (9) రనౌట్ అయ్యాడు. 4.2వ బంతికి సిమ్రన్ సింగ్ (11) క్యాచ్‌ను ప్రియమ్ గార్గ్ అద్భుతంగా పట్టాడు. మరికాసేపటికే కేఎల్ రాహుల్ (11; 16 బంతుల్లో) ఔట్ అయ్యాడు. యువ స్పిన్నర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌లో రాహుల్ భారీ సిక్సర్‌కు ప్రయత్నించి ఔటవడంతో పంజాబ్‌పై ఒత్తిడి పెరిగింది. 58/3తో కష్టాల్లో ఉన్న జట్టును నికోలస్ పూరన్ ఆదుకున్నాడు.

పూరన్ జోష్
అప్పటిదాకా మెరుపులు లేని పంజాబ్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్ జోష్ తెచ్చాడు. యువ స్పిన్నర్ అబ్దుల్ సమద్ వేసిన తొమ్మిదో ఓవర్లో వరుసగా 6, 4, 6, 6, 6 బాది 22 రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలోనే 17 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి హాఫ్‌సెంచరీ సాధించాడు. నటరాజన్ వేసిన 11వ ఓవర్లో ప్రియమ్ గార్గ్ వేసిన డైరెక్ట్ త్రోకు గ్లెన్ మాక్స్‌వెల్ (7) రనౌటయ్యాడు. మన్‌దీప్ సింగ్ (6), ముజీబుర్ రెహ్మాన్ (1)ను ఔట్ అయ్యారు. పూరన్ క్రీజులో ఉండటంతో అద్భుతం చేస్తాడా అనుకున్నా.. 14.5వ బంతికి రషీద్ అతడిని బోల్తా కొట్టించాడు. దాంతో పంజాబ్ 16.5 ఓవర్లకు 132కే కుప్పకూలింది. పంజాబ్ ఆఖరి ఏడుగురు చేసిన మొత్తం 20 పరుగులే కావడం గమనార్హం.

బాదిన బెయిర్‌స్టో
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలిసారి అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. దుబాయ్ స్టేడియంలో పరుగుల వరద పారించింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (97; 55 బంతుల్లో 7×4, 6×6), డేవిడ్ వార్నర్ (52; 40 బంతుల్లో 5×4, 1×6) తొలి ఓవర్ నుంచే బాదుడు ఆరంభించారు. షెల్డన్ కాట్రెల్‌ను మినహాయించి ప్రతి ఒక్కరి ఓవర్లోనూ దంచికొట్టారు. వారిద్దరూ తొలి వికెట్‌కు 160 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్‌ప్లే ముగిసేసరికే 58గా ఉన్న స్కోరును 10 ఓవర్లకు 100గా మలిచారు.15 ఓవర్లకు 160/0తో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపారు.

ఒకే ఓవర్లో వార్నర్, బెయిర్‌స్టో ఔట్
అయితే పంజాబ్ యువ బౌలర్లు రవి బిష్ణోయ్ (3/29), అర్షదీప్ సింగ్ (2/33) మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 16వ ఓవర్లో వార్నర్, బెయిర్‌స్టోను రవి బిష్ణోయ్ పెవిలియన్‌కు చేర్చి దెబ్బకొట్టాడు. అప్పుడు జట్టు స్కోరు 160. తర్వాతి ఓవర్లోనే మనీశ్ పాండే (1)ని అర్షదీప్ ఔట్ చేశాడు. అబ్దుల్ సమద్ (8), ప్రియమ్ గార్గ్ (0) సైతం వా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. చివర్లో అభిషేక్ శర్మ (12; 6 బంతుల్లో 1×4, 1×6), కేన్ విలియమ్సన్ (20; 10 బంతుల్లో 1×4, 1×6) బౌండరీలు బాదడంతో హైదరాబాద్ 201/6తో నిలిచింది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు సాధించగా, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీకి వికెట్ లభించింది.


Click it and Unblock the Notifications












