SRH vs RR: సన్‌రైజర్స్ పేసర్ ఖలీల్ అహ్మద్‌కు తెవాటియా వార్నింగ్.. వేలుపెట్టి చూపించి మరీ!!

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 5 వికెట్లు కోల్పోయి మరో బంతి ఉండగానే ఛేదించింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో రాహుల్ తెవాటియా (45; 28 బంతుల్లో 4x4, 2x6), రియాన్ పరాగ్ (42; 26 బంతుల్లో 2x4, 2x6)లు ఒత్తిడిని జయించి రాజస్థాన్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. సన్‌రైజర్స్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కు వెళుతూ:
ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి ఓవర్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఖలీల్ అహ్మద్, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ రాహుల్ తెవాటియా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ విజయానికి 20వ ఓవర్లో 8 పరుగులు అవసరం అయ్యాయి. చివరి ఓవర్‌ను ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేశాడు. రియాన్ పరాగ్ మొదటి బంతికి రెండు పరుగులు, రెండో బంతికి ఒక పరుగు చేశాడు. మూడో బంతికి తెవాటియా రెండు పరుగులు చేశాడు. ఇక నాలుగో బంతికి సింగిల్ తీసిన తెవాటియా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కు వెళ్లాడు.

అహ్మద్‌తో గొడవ:
నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కు వెళుతూ రాహుల్ తెవాటియా.. పేసర్ ఖలీల్ అహ్మద్‌తో గొడవ పడ్డాడు. ఖలీల్ ఏదో అభ్యంతర వ్యాఖ్య చేయడంతో అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ అతడితో మాట్లాడి శాంతింపజేశారు. వార్నర్ మాట్లాడుతుండగా.. ఖలీల్ ఏదో అన్నాడని వేలు పెట్టి చూపించాడు తెవాటియా. ఆ సమయంలో అతడు తీవ్ర ఆవేశంలో ఉన్నాడు. వార్నర్, అంపైర్లు సర్దిచెప్పడంతో తెవాటియా శాంతించాడు. ఆపై అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి డగౌట్ చేరుకున్నాడు.
గొడవ పెద్దదేం కాదు:
ప్రస్తుతం ఖలీల్ అహ్మద్, రాహుల్ తెవాటియా గొడవకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఖలీల్ తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మ్యాచ్ అనంతరం ఈ గోడపై తెవాటియా స్పందించాడు. 'ఖలీల్ అహ్మద్‌తో జరిగిన గొడవ పెద్దదేం కాదు. ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది. ఆటలో ఇవన్నీ సహజమే' అని అన్నాడు. 'నాకు ఇచ్చిన పాత్రను సమర్ధవంతంగా పోషించినందుకు సంతోషంగా ఉంది. ప్రాక్టీస్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆడే షాట్లనే ఆడాను. వికెట్లు కోల్పోయాం కాబట్టి చివరి వరకు క్రీజులో ఉండాలనుకున్నాం. వికెట్ నెమ్మదిగా ఉందని రియాన్‌తో చెప్పా. వికెట్లు కాపాడుకుంటే చివరి 4 ఓవర్లలో 50 పరుగులు చేయొచ్చనుకున్నాం. చెత్త బంతులని బౌండరీలకు పంపి.. సింగిల్స్ తీశాం' అని తెవాటియా చెప్పాడు.

రియాన్ డాన్స్:
ఇదే మ్యాచులో మరో ఆసక్తికర సంఘటన కూడా చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ గెలుపు సంబరాలు చేసుకున్నాడు. చివరి బంతికి సిక్స్ బాదిన అనంతరం పరాగ్ డాన్స్ చేసి వినూత్నంగా సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. నడుము, చెవులపై చేతులు పెట్టి డాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇది చూసిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఏంటి ఇది అనేలా చేతి సైగలతో అన్నాడు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది.
SRH vs RR: తెవాటియా, పరాగ్ మెరుపులు.. ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ విజయం!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications