న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RCB: మెరిసిన హోల్డర్.. డివిలియర్స్‌ అర్ధసెంచరీ.. సన్‌రైజర్స్‌ లక్ష్యం 132!!

 IPL 2020 SRH vs RCB: Jason Holder shine RCB restrcited to 131 despite AB de Villiers fifty

అబుదాబి: ఐపీఎల్‌ 2020 ఎలిమినేటర్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. సన్‌రైజర్స్‌ బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్‌ లక్ష్యం 132గా ఉంది. మిస్టర్ 360, బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ మాత్రమే ఒంటరి పోరాటం చేస్తూ హాఫ్ సెంచరీ (56; 43 బంతుల్లో, 3×4, 1×6) చేశాడు. ఆరోన్ ఫించ్‌ (32; 30 బంతుల్లో, 3×4, 1×6) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. జాసన్ హోల్డర్, టీ నటరాజన్ నిప్పులు చెరిగే బంతులతో బెంగళూరు బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశారు. హోల్డర్ 3, నటరాజన్ 2 వికెట్లు పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. జేసన్‌ హోల్డర్‌ ధాటికి బెంగళూరు 15 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (6) రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. హోల్డర్‌ తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌(1)ను పెవిలియన్‌ పంపాడు. మూడో ఓవర్‌ వేసిన సందీప్‌ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో పవర్‌ప్లే ఆఖరికి బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 9 పరుగులు చేసింది.

ఈ దశలో ఏబీ డివిలియర్స్, అరోన్‌ ఫించ్‌ క్రీజులో నిలదొక్కుకున్నారు. ఈ జోడి ఆచితూచి ఆడి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే నెమ్మదిగా ఆడడంతో బెంగళూరు స్కోర్ వేగం పూర్తిగా తగ్గిపోయింది. ఈ సమయంలో ఫించ్ కాస్త బ్యాట్ జులిపించే ప్రయత్నం చేశాడు. అయితే షాబాజ్‌ నదీమ్ వేసిన 11వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించిన ఫించ్‌.. అబ్దుల్ సమద్ చేతికి చిక్కాడు. అదే ఓవర్లో షాబాజ్‌ వేసిన ఫ్రీ హిట్ బంతికి మొయిన్‌ అలీ (0) రనౌటయ్యాడు. అనవసర పరుగుకు ప్రయత్నించగా.. రషీద్‌ ఖాన్‌ నేరుగా వికెట్లకు బంతిని విసిరాడు. దీంతో బెంగళూరుపై ఒత్తిడి పెరిగింది.

ఓవైపు వికెట్లు పడుతున్నా డివిలియర్స్‌ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో మరింత చెలరేగాలని భావించిన ఏబీడీని 18వ ఓవర్ ఐదవ బంతికి నటరాజన్‌ పెవిలియన్‌ పంపాడు. ఆ ఓవర్‌ మొదటి బంతికే వాషింగ్టన్‌ సుందర్‌ను ఔట్‌ చేశాడు. డివిలియర్స్‌ ఔటవడంతో మెరుపులు లేకుండానే ఇన్నింగ్స్‌ ముగిసింది. సిరాజ్ (10), సైని (9) అజేయంగా నిలిచారు. దేవదత్‌ పడిక్కల్‌(1), మొయిన్‌ అలీ(0), శివమ్‌ దూబే(8), వాషింగ్టన్‌ సుందర్‌(5) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.

Story first published: Friday, November 6, 2020, 21:27 [IST]
Other articles published on Nov 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X