Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. రోహిత్ ఈజ్ బ్యాక్!!

IPL 2020, SRH vs MI: Sunrisers Hyderabad have won the toss and have opted to field, Rohit Sharma Back

షార్జా: షార్జా: ఐపీఎల్‌ 2020‌లో లీగ్‌ దశలో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వార్నర్ తుది జట్టులో ఒక మార్పు చేశాడు. అభిషేక్ శర్మ స్థానంలో ప్రియమ్ గార్గ్ టీమ్‌లోకి వచ్చాడు. మరోవైపు ముంబై మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. తొడకండరాల గాయంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ముంబై కెప్టెన్‌ రోహిత్ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టాడు. పేసర్లు బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌కు విశ్రాంతినిచ్చినట్లు రోహిత్‌ తెలిపాడు. జేమ్స్ ప్యాటిన్సన్, ధావల్ కులకర్ణి ఆడుతున్నారు.

ఈ మ్యాచ్‌ గెలిస్తేనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ చేరుతుంది. ముంబైపై సన్‌రైజర్స్‌ గెలిస్తే.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టోర్నీ నుంచి నిష్రమిస్తుంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు గెలిచి మంచి నెట్‌ రన్‌రేట్‌తో ఉన్న సన్‌రైజర్స్‌.. ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన ముంబైను ఓడిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే కోల్‌కతాకు మార్గం సుగమమవుతుంది. హైదరాబాద్ టైటిల్ గెలిచిన 2016 పరిస్థితులే ఈ సీజన్‌లో ఎదురవ్వడంతో.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశగా ఉన్నారు. మరీ వారి ఆశలను వార్నర్ సేన నిలబెడుతుందో లేదో చూడాలి.

ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీకి మెరుగైన రన్‌‌రేట్‌‌తో 12 పాయింట్లున్నాయి. కాబట్టి ముంబైపై గెలిస్తే వార్నర్‌‌సేన మూడో ప్లేస్‌‌కు ఎగబాకి ప్లే ఆఫ్స్‌‌కు అర్హత సాధిస్తుంది. గత రెండు మ్యాచ్‌‌ల్లో ఢిల్లీ, బెంగళూరును ఓడించి కాన్ఫిడెన్స్‌‌ పెంచుకున్న వార్నర్‌‌సేన అదే జోష్‌‌తో ముంబై పని పట్టాలని చూస్తోంది. అయితే ఇరు జట్ల మధ్య ఈ సీజన్ ఫస్టాఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 34 పరుగులతో ఓటమి పాలైంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.

జట్లు:
హైదరాబాద్‌: వార్నర్‌ (కెప్టెన్‌), సాహా, మనీష్‌ పాండే, విలియమ్సన్‌, గార్గ్‌, హోల్డర్‌, అబ్దుల్ సమద్‌, రషీద్ ఖాన్, షాబాజ్‌ నదీమ్‌, సందీప్ శర్మ, నటరాజన్‌.

ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్‌, సూర్యకుమార్‌, సౌరభ్ తివారి, ఇషాన్‌ కిషన్‌. పొలార్డ్‌, కృనాల్ పాండ్యా, కౌల్డర్‌నైల్‌, రాహుల్ చహర్‌, కులకర్ణి, ప్యాటిన్సన్‌.

Story first published: Tuesday, November 3, 2020, 19:21 [IST]
Other articles published on Nov 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+