Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్స్‌ చేరిన సన్‌రైజర్స్‌.. కోల్‌కతాకు షాక్!!

IPL 2020, SRH vs MI: Sunrisers Hydearabad beat Mumbai Indians to seal IPL 2020 playoffs berth

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఘనంగా ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఘన విజయాన్ని అందుకుంది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మరో 17 బంతులు ఉండగానే ఛేదిందించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (85; 58 బంతుల్లో 10×4, 1×6) , వృద్ధిమాన్ సాహా (58; 45 బంతుల్లో, 7×4, 1×6)లు అజేయ అర్ధ శతకాలతో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. సన్‌రైజర్స్‌ విజయం సాధించడంతో.. ప్లేఆఫ్స్ ఆశలు పెట్టుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు షాక్ తగిలింది.

వార్నర్‌, సాహా అర్ధ శతకాలు:

వార్నర్‌, సాహా అర్ధ శతకాలు:

స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ జట్టు ముంబైకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ముంబై కెప్టెన్ రోహిత్‌ శర్మ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా.. ఫలితం లేకుండా పోయింది. ఆరంభంలో వార్నర్‌ సమయోచితంగా ఆడగా.. సాహా చెలరేగిపోయాడు. సాహా ఎడాపెడా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో 56 పరుగులు వచ్చాయి. తర్వాత వార్నర్‌ కూడా గేర్‌ మార్చడంలో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో వార్నర్‌ 35 బంతుల్లో, సాహా 34 బంతుల్లో అర్ధ శతకాలు సాధించారు.

ఆరోసారి 500లకు పైగా పరుగులు:

ఆరోసారి 500లకు పైగా పరుగులు:

హాఫ్ సెంచరీ అనంతరం అనంతరం డేవిడ్ వార్నర్‌ మరింత చెలరేగిపోయాడు. చూడముచ్చటైన షాట్లతో బౌండరీలు బాదాడు. మరోవైపు సాహా ఆచితూచి ఆడుతూ మంచి సహకారం అందించాడు. ఇద్దరూ అజేయంగా నిలిచి సన్‌రైజర్స్‌ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. లీగ్‌ చరిత్రలో పది వికెట్ల తేడాతో ముంబై ఓటమిపాలవ్వడం ఇది రెండోసారి. సన్‌రైజర్స్‌ వరుసగా మూడు టాప్ జట్లను (ఢిల్లీ, బెంగళూరు, ముంబై) ఓడించి ప్లేఆఫ్‌కు చేరింది. ఇక వార్నర్ ఐపీఎల్ టోర్నీలో 500 ఫోర్లు బాదాడు. అంతేకాదు వరుసగా ఆరోసారి 500లకు పైగా పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన మొదటి ప్లేయర్ వార్నర్ మాత్రమే.

పొలార్డ్‌ మెరుపులు:

పొలార్డ్‌ మెరుపులు:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన రోహిత్‌ శర్మ (4), డికాక్‌ (25; 13 బంతుల్లో, 2×4, 2×6)ను సందీప్ శర్మ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ (36; 29 బంతుల్లో, 5×4)తో కలిసి ఇషాన్ కిషన్ (33; 30 బంతుల్లో, 1×4, 2×6) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే షాబాజ్‌ నదీమ్, రషీద్ ధాటికి ఏడు బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 11వ ఓవర్‌లో సూర్యకుమార్, కృనాల్ (0)ను షాబాజ్‌ ఔట్‌ చేయగా,.. తివారి (1)ని రషీద్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఇన్నింగ్స్ చివర్లో పొలార్డ్‌ మెరుపులు మెరిపించడంతో ముంబై 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ మూడు వికెట్లు తీయగా.. నదీమ్‌,హోల్డర్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరుతో ఢీ:

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరుతో ఢీ:

ఈ విజయంతో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం తలపడనుంది. 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమి తేల్చుకోనుంది. ఇకసన్‌రైజర్స్‌ ఓడితే ప్లే ఆఫ్‌కు చేరుకోవాలనుకున్న కోల్‌కతాకు నిరాశే మిగిలింది. హైదరాబాద్‌ (+0.68), బెంగళూరు (-0.172) కంటే కోల్‌కతా (-0.214)కు తక్కువ నెట్‌రన్‌రేటు ఉండటంతో అయిదో స్థానంతో సరిపెట్టుకుంది.

ముంబై అంటే ఎలాంటి భయం లేదు.. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాం: అయ్యర్‌

Story first published: Tuesday, November 3, 2020, 23:36 [IST]
Other articles published on Nov 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+