Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: సన్‌రైజర్స్‌ గెలవాలంటే.. ఈ స్టార్లు మెరవాల్సిందే.. లేదంటే అంతేసంగతులు!!

IPL 2020, SRH vs MI: 5 Key players for SunRisers Hyderabad againest Mumbai Indians

షార్జా: యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా ఈ రోజు చివరి లీగ్‌ మ్యాచ్‌ జరగనుంది. షార్జా మైదానంలో ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్న ముంబై ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆ జట్టుకు ఎలాంటి నష్టం జరగదు. అయితే ఫలితం మాత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. మరోవైపు సన్‌రైజర్స్‌ ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్నందున ఈ మ్యాచ్‌ గెలిస్తే.. నేరుగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. దాంతో కోల్‌కతా ఇంటిముఖం పట్టనుంది. ఈ సీజన్‌లో విశేషంగా రాణిస్తున్న ముంబైని ఓడించడం సన్‌రైజర్స్‌కు కాస్త కష్టమే అయినా కొందరు స్టార్లు మెరిస్తే మాత్రం విజయం సులువే అవనుంది.

వార్నర్‌ శుభారంభం ఇవ్వాలి:

వార్నర్‌ శుభారంభం ఇవ్వాలి:

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్‌ భాగస్వాముల్లో డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టోల జోడీ ఒకటి. వీరిద్దరూ తమ బ్యాట్లకు పనిచెబితే పరుగుల వరద పారడం ఖాయం. తన భాగస్వామ్యంతో సన్‌రైజర్స్‌కు ఎన్నో విజయాలు అందించారు. గత సీజన్లో అయితే మిగతా బ్యాట్స్‌మన్‌కు సరిగా ఆడే అవకాశమే ఇవ్వాలేదు. అలాంటిది వీరిద్దరూ ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. వార్నర్‌ 13 మ్యాచ్‌ల్లో 444 పరుగులు చేయగా.. బెయిర్‌స్టో 11 మ్యాచ్‌ల్లో 345 పరుగులు చేశాడు. ఒకవేళ ఈరోజు వీరిద్దరూ ఫామ్ అందుకుంటే మంచి ఆరంభం దక్కనుంది.

 విలియమ్సన్‌, పాండే రాణిస్తే:

విలియమ్సన్‌, పాండే రాణిస్తే:

సన్‌రైజర్స్‌ జట్టుకు మిడిల్‌ఆర్డర్‌ కూడా కీలకం కానుంది. పలు సందర్భాల్లో విశేషంగా రాణించే బ్యాట్స్‌మెన్‌ వీరి సొంతం. ఈ సీజన్‌ మొదట్లో ఆకట్టుకోలేకపోయిన వృద్ధిమాన్ సాహా గత రెండు మ్యాచులుగా బాగా రాణించాడు. కీలక మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. కేన్ విలియమ్సన్‌, మనీష్‌ పాండే సైతం తమ బ్యాటింగ్‌ నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు. ఒకవేళ ఈరోజు వార్నర్‌, బెయిర్‌స్టో బరిలోకి దిగితే.. తర్వాత ఈ ముగ్గురు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది. శుభారంభం దక్కితే దాన్ని కొనసాగించడం.. లేకపోతే బాధ్యతగా ఆడి జట్టును ఆదుకోవడం ఈ ముగ్గురిపైనే ఆధారపడి ఉంది.

హోల్డర్‌, రషీద్‌ కీలకం:

హోల్డర్‌, రషీద్‌ కీలకం:

ఐపీఎల్ 2020లో లేటుగా బరిలోకి దిగిన జేసన్‌ హోల్డర్‌ హైదరాబాద్‌ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. తన అనుభవంతో వికెట్లు తీస్తూనే బ్యాటింగ్‌తోనూ సత్తాచాటుతున్నాడు. గత మ్యాచులో సిక్సులతో మ్యాచును ముగించాడు. మరోసారి అలానే ఆడితే మన జట్టుకు తిరుగుండదు. రషీద్‌ ఖాన్‌ తన స్పిన్‌ బౌలింగ్‌తో మధ్య ఓవర్లలో వికెట్లు తీస్తూ.. పరుగులు నియంత్రిస్తున్నాడు. అతడు ఈరోజు కూడా మాయ చేస్తే ముంబైని ఆపడం పెద్ద కష్టం కాదు. పేసర్ టీ నటరాజన్‌ కూడా డెత్ ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. ఈ రోజు అందరూ సమిష్టిగా రాణిస్తే తెలుగు అభిమానుల జట్టు సునాయాసంగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. మరి ఈ స్టార్లు ఏంచేస్తారో చూడాలి. తుది జట్టులో నలుగురు మాత్రమే ఆడడంతో ఒక విదేశీ ప్లేయర్ ఆడే అవకాశం లేదు.

 ఆల్ ది బెస్ట్ చెపుతున్న ఫాన్స్:

ఆల్ ది బెస్ట్ చెపుతున్న ఫాన్స్:

2016లోనూ ఆఖరి క్షణాల్లో ప్లేఆఫ్స్ చేరి టైటిల్‌ సాధించింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. దీంతో వార్నర్‌ నేతృత్వంలో మరోసారి అలాంటి మాయాజాలమే చేసి విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. సన్‌రైజర్స్‌ కీలక మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెపుతున్నారు. సన్‌రైజర్స్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముద్దుల కూతుళ్లు ఇండి రే, ఇవీ మే.. అతని సతీమణి క్యాండిస్‌ వార్నర్‌ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

SRH vs MI: ఆల్ ది బెస్ట్ డాడీ.. గుడ్ లక్ సన్‌రైజర్స్‌!!

Story first published: Tuesday, November 3, 2020, 17:28 [IST]
Other articles published on Nov 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+