SRH vs KXIP: ఈ విషయం తెలుసా.. 400+ రన్స్ ఇచ్చినా ఒక్క వికెట్ తీయని పంజాబ్ బౌలర్లు!!

దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ పరుగుల వరద పారించారు. ఐపీఎల్ 2020లో తొలిసారి స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఇద్దరూ అదరగొట్టారు. వార్నర్, బెయిర్‌స్టో నువ్వా నేనా అనే రీతిలో చెలరేగారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బౌలర్లపై విరుచుకుపడిన ఓపెనింగ్ జోడీ జట్టుకు ఊహించని స్కోరు అందించింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ మెరుపు అర్ధ శతకాలు సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కి 160 పరుగులు అందించారు. వీరి ధాటికి పంజాబ్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.

విఫలమయిన పంజాబ్ బౌలర్లు:
గత మూడు మ్యాచులుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లు దారుణంగా విఫలమవుతున్నారు. ఎంతలా అంటే.. 400లకు పైగా పరుగులు ఇచ్చినా ఒక్క వికెట్ తీయలేదు. ఈ మ్యాచులో సన్‌రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ పంజాబ్ బౌలర్లను ఆడుకోగా.. గత మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్ చెడుగురు ఆడారు. బెయిర్‌స్టో, వార్నర్ జంట 160 పరుగులు చేయగా.. వాట్సన్, డుప్లెసిస్ జోడి 181 పరుగులు చేశారు. ఇక ముంబై ఇండియన్స్ మ్యాచులో కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలు రెచ్చిపోయి 67 పరుగులు బాదారు. మొత్తానికి 408 పరుగుల తర్వాత పంజాబ్ ఓ వికెట్ తీసింది.

408 పరుగుల తర్వాత ఓ వికెట్:
ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో 67 పరుగులు.. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులో 181.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులో 160 పరుగులు ఇచ్చారు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లు. చివరకు 408 పరుగుల తర్వాత డేవిడ్ వార్నర్ వికెట్ తీశారు. రవి బిష్ణోయ్.. వార్నర్ వికెట్ పడగొట్టాడు. మొహమ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లాంటి అంతర్జాతీయ బౌలర్లు ఉన్నా కూడా ఒక్క వికెట్ తీయలేకపోయారు. మొత్తానికి పంజాబ్ బౌలర్లు చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నారు.

తొమ్మిదో హాఫ్ సెంచరీ:
ఇక పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం సాధించాడు. ఫలితంగా కింగ్స్ పంజాబ్‌పై వరుసగా తొమ్మిదో హాఫ్ సెంచరీ సాధించినట్లయ్యింది. ఐపీఎల్‌లో ఒక ప్రత్యర్థిపై ఇలా తొమ్మిది హాఫ్ సెంచరీలు వరుసగా సాధించడం వార్నర్‌కు పంజాబ్‌పైనే అత్యధికం కావడం విశేషం.

తొలి వికెట్‌కు 160 పరుగులు:
ఏ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఓవర్ నుంచే బాదుడు షురూ చేసింది. ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్ కలిసి పంజాబ్ బౌలింగ్‌ను ఊచకోత కోశారు. షెల్డన్ కాట్రెల్‌ను మినహాయించి ప్రతి ఒక్కరి ఓవర్లోనూ దంచికొట్టారు. దీంతో దుబాయ్ స్టేడియంలో బంతిని పరుగులు పెట్టించారు. వారిద్దరూ తొలి వికెట్‌కు 160 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారంటేనే విధ్వంసం ఎలా సాగిందో ఊహించొచ్చు. బెయిర్‌స్టో (97; 55 బంతుల్లో 7×4, 6×6), వార్నర్ (52; 40 బంతుల్లో 5×4, 1×6) దంచికొట్టడంతో పంజాబ్‌కు ఏకంగా 202 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications