For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs KXIP: బెయిర్‌స్టో బాదుడు.. వార్నర్ 52.. ఫాన్స్ ఖుషి.. పంజాబ్‌ ముందు భారీ లక్ష్యం!!

IPL 2020, SRH vs KXIP: Jonny Bairstow 97, David Warner 52 give SRH 201 for 6
IPL 2020: Jonny Bairstow, David Warner Rocks.. Sets 202 Target for KXIP | SRH vs KXIP:

దుబాయ్: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (97: 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులు) శతకానికి చేరువలో ఔటవ్వగా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)‌ హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్లు పరుగుల వరద పారించడంతో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసి పంజాబ్‌ ముందు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇన్నింగ్స్ ఆరంభంలో పూర్తిగా తేలిపోయిన పంజాబ్ బౌలర్లు.. చివరలో మాత్రం కాస్త పుంజుకున్నారు. పంజాబ్ యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

టాస్‌ గెలిచి సన్‌రైజర్స్‌ ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ను వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లను ఆడేసుకుంటూ విరుచుకుపడ్డారు. దీంతో హైదరాబాద్‌కు మెరుపు ఆరంభం లభించింది. షెల్డన్ కాట్రెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే వార్నర్‌ వరుసగా రెండు ఫోర్లు బాదగా.. 5 ఎక్స్‌ట్రా రన్స్‌ రావడంతో 13 పరుగులు వచ్చాయి. అనూహ్యంగా రెండో ఓవర్‌లోనే పంజాబ్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌.. స్పిన్నర్‌ ముజీబ్‌ను రంగంలోకి దించాడు. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ముజీబ్‌ కేవలం 6 పరుగులు ఇచ్చాడు.

కాట్రెల్‌ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్‌స్టో మూడు ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ముజీబ్, మ్యాక్సీ వేసిన 6, 7 ఓవర్లో పరుగులు రావడం కష్టమైంది. అయితే రవి బిష్ణోయ్ వేసిన 8వ ఓవర్లో బెయిర్‌స్టో రెండు సిక్సులు, ఫోర్ బాది 18 పరుగులు పిండుకున్నాడు. ఇక 9వ ఓవర్లో 28 బంతుల్లో బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ చేశాడు. ఆపై బెయిర్‌స్టో మరింత దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో సన్‌రైజర్స్‌ స్కోర్ పరుగులు పెట్టింది.

మరోవైపు డేవిడ్ వార్నర్‌ సైతం చక్కని షాట్లతో అలరించాడు. వీరిద్దరూ 15 ఓవర్లకు 160/0తో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపారు. తొలి వికెట్‌కు 160 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం బెయిర్‌స్టో సెంచరీ ముందు ఔట్ అయ్యాడు. ఆపై వార్నర్‌ను పెవిలియన్‌కు చేర్చి హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడు. బిష్ణోయ్‌ (3/29), అర్షదీప్‌ సింగ్‌ (2/33) మ్యాచ్‌ను మలుపు తిప్పారు. మనీశ్‌ పాండే (1)ని అర్షదీప్‌ ఔట్‌ చేశాడు. అబ్దుల్‌ సమద్‌ (8), ప్రియమ్‌ గార్గ్‌ (0) సైతంను సైతం వారు ఎక్కువసేపు నిలవనీయలేదు. అయితే చివర్లో అభిషేక్‌ శర్మ (12; 6 బంతుల్లో 1×4, 1×6), కేన్‌ విలియమ్సన్‌ (20*; 10 బంతుల్లో 1×4, 1×6) బౌండరీలు బాదడంతో హైదరాబాద్‌ 201/6తో నిలిచింది.

Story first published: Thursday, October 8, 2020, 21:51 [IST]
Other articles published on Oct 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+