For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs KKR Preview: కోల్‌కతాతో సన్‌రైజర్స్ ఢీ.. ప్లేఆఫ్స్‌ లక్ష్యంగా బరిలోకి.. తుది జట్లు ఇవే!!

IPL 2020, SRH vs KKR Preview: Match Prediction, Playing XI, Pitch Report and Weather Forecast

హైదరాబాద్: వరుస పరాజయాలతో డీలాపడ్డ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్.. నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది. గత మ్యాచుల్లో ఓటమి చవిచూసిన రెండు జట్లు ప్లేఆఫ్స్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్‌ వైఫల్యాల కారణంగా వెనుకబడిపోతున్న వార్నర్‌ సేన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాలని చూస్తున్నది. మరోవైపు కెప్టెన్‌ మారినా రాత మారని కోల్‌కతా కీలక విజయంతో పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లాలని భావిస్తున్నది. అబుదాబీ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓసారి చూద్దాం.

విధ్వంసం పునరావృతం చేయాలి

విధ్వంసం పునరావృతం చేయాలి

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో గతంలోలా విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌ ఆడడం లేదు. ఒకరు మెరిస్తే.. మరొకరు త్వరగా ఔట్ అవుతున్నారు. ప్లేఆఫ్స్ దగ్గరపడుతున్నాయి. వార్నర్‌సేన ముందుకు వెళ్లాలంటే ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి. అందుకే ఈ ఓపెనింగ్‌ జోడీ తమ విధ్వంసం పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. మిడిల్‌ ఆర్డర్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కరు కూడా చెయ్యట్లేదు. మనీశ్‌ పాండే, కేన్ విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్‌, విజయ్‌ శంకర్‌.. ఇలా చెప్పుకోవడానికి బ్యాటింగ్‌ బలం బాగానే ఉన్నా వీరంతా సమిష్టిగా రాణించకపోవడమే హైదరాబాద్‌కు పెద్ద ఇబ్బందిగా మారింది. ప్రియం గార్గ్‌ ఒక్క మ్యాచ్‌లో తప్పితే మరోసారి తన ప్రతిభ చూపించలేకపోయాడు. దీంతో అతని స్థానంలో అభిషేక్‌ శర్మ లేదా విరాట్ ‌సింగ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు.

భువనేశ్వర్‌ లేకున్నా

భువనేశ్వర్‌ లేకున్నా

ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గాయం కారణంగా అందుబాటులో లేకున్నా.. మిగిలినవాళ్లు ఆ లోటు కాస్త కనబడనివ్వడం లేదు. మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, టీ నటరాజన్‌, షాబాజ్‌ నదీమ్‌ ప్రత్యర్థిని కట్టిపడేస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తే.. కోల్‌కతాకు కళ్లెం వేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఆడిన ఎనిమిదింట్లో మూడు విజయాలు, ఐదు ఓటములతో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.

మోర్గాన్‌ మ్యాజిక్ చేస్తాడా?

మోర్గాన్‌ మ్యాజిక్ చేస్తాడా?

కెప్టెన్‌ను మార్చినా కోల్‌కతా తీరు మారలేదు. జట్టు నిండా ప్రతిభావంతులైన క్రికెట్లున్నప్పటికీ ఆ జట్టు విజయాల బాట మాత్రం పట్టడం లేదు. దినేశ్‌ కార్తిక్‌ నుంచి సారథ్య బాధ్యతలను అందుకున్న ఇయాన్‌ మోర్గాన్‌ తొలి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కొత్త కెప్టెన్ ఈ మ్యాచ్‌లో ఏం మ్యాజిక్ చేస్తాడోనని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోల్‌కతా ఓపెనర్లలో గిల్ నిలకడగా రాణిస్తుండగా.. మరో ఓపెనర్‌‌తో సమస్య ఎదురవుతోంది. బ్యాటింగ్‌లో దినేశ్‌ కార్తిక్‌, నితీశ్‌ రాణా తిరిగి ఫామ్‌ అందుకోవాల్సిన అవసరం ఉంది. మోర్గాన్, త్రిపాఠి రాణిస్తున్నారు. రస్సెల్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. కోల్‌కతాలో ప్రధాన లోపం బౌలింగ్‌. ఎన్నో అంచనాలతో తీసుకున్న ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కమిన్స్‌ తన స్థాయి ప్రదర్శన చేయడం లేదు. మరో పేసర్‌ ఫెర్గుసన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

IPL 2020 : David Warner To Break Virat Kohli Record | SRH Vs KKR | Oneindia Telugu
పిచ్‌ ఎప్పుడెలా ఉంటుందో

పిచ్‌ ఎప్పుడెలా ఉంటుందో

రెండు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచుల్లో తలపడ్డాయి. వాటిలో 11 విజయాలతో కోల్‌కతా పైచేయి సాధించింది. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా విజయం సాధించింది. ఈ రోజు మ్యాచ్‌ జరుగనున్న అబుదాబి మైదానంలో హైదరాబాద్‌ గతంలో మూడు మ్యాచులాడి ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. రెండింట్లో ఓటమిపాలైంది. మరోవైపు కోల్‌కతా ఈ వేదికపై ఎనిమిది మ్యాచ్‌లాడింది. అందులో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు నమోదు చేసింది. అబుదాబి మైదానంలో సీజన్‌ ప్రారంభంలో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువ ఉండేవి. తర్వాత పరిస్థితి తారుమారైంది. ఛేదన జట్లు గెలవడం ప్రారంభించాయి. పిచ్‌ పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదు. దీంతో టాస్ కానుంది.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌శర్మ/విరాట్‌ సింగ్‌, రషీద్‌ ఖాన్‌, షాబాజ్‌ నదీమ్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ, టీ నటరాజన్‌.

కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తిక్, ఆండ్రీ రసెల్, క్రిస్‌ గ్రీన్‌/లుకీ ఫెర్గుసన్‌, ప్యాట్ కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ.

ధోనీతో అక్షర్‌ని పోల్చడమేంటి.. మరీ ఎక్కువ అనిపించట్లేదా?!! సెహ్వాగ్‌కు పంచ్ ఇచ్చిన మహీ ఫ్యాన్!!

Story first published: Sunday, October 18, 2020, 12:47 [IST]
Other articles published on Oct 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+