SRH vs KKR: వార్నర్‌ను ఊరిస్తున్న రెండు అరుదైన రికార్డులు.. మరో 10 రన్స్ చేస్తే!!

అబుదాబి: వరుస పరాజయాలతో డీలాపడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్.. అబుదాబీ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది. బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్ వైఫల్యాల కారణంగా వెనుకబడిపోతున్న వార్నర్ సేన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాలని చూస్తున్నది. సన్‌రైజర్స్ చెలరేగాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. అయితే సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు.

మరో 10 పరుగులు చేస్తే
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ మరో 10 పరుగులు చేస్తే.. ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి విదేశీ క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే 5000 కంటే ఎక్కువ రన్స్ చేశారు. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రైనా 5000 పరుగుల క్లబ్‌లో చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 189 ఇన్నింగ్స్‌ల్లో 5149 రన్స్ చేశాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు రైనా దూరమయిన విషయం తెలిసిందే.

వేగంగా 5 వేల రన్స్
178 ఇన్నింగ్స్‌ల్లో 5759 రన్స్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్లోనే 5 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఐపీఎల్‌లో 191 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 5149 రన్స్ చేశాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 134 ఇన్నింగ్స్‌ల్లో 4990 రన్స్ చేశాడు. మరో పది పరుగులు చేస్తే.. ఐపీఎల్‌లో వేగంగా 5 వేల రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ (157) రికార్డును వార్నర్ తిరగరాస్తాడు.

ధావన్‌కు అవకాశం
ఐపీఎల్ 2020లో 5 వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు మరో ఇద్దరు ఆటగాళ్లకు కూడా అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా త్వరలోనే 5 వేల పరుగుల క్లబ్‌లో చేరనున్నాడు. శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో శతకం బాదిన ధావన్.. 167 ఇన్నింగ్స్‌ల్లో 4938 రన్స్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ (4680) కూడా 5000 రన్స్ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఐపీఎల్ 2020లో 5 వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు ధావన్‌కు ఎక్కువ అవకాశాలు ఉండగా.. ఏబీకి మాత్రం కాస్త కష్టమే.
DC vs CSK: జడేజా భారీ సిక్సర్.. బంతి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని అభిమాని (వీడియో)!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications