SRH vs CSK: ఇదేందయ్యో అంపైర్!! ఎంఎస్ ధోనీ కోపాన్ని చూసి.. నిర్ణయాన్ని మార్చుకుంటావా? (వీడియో)!!

దుబాయ్:వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్‌కింగ్స్ సమష్టిగా సత్తాచాటింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. అంబటి రాయుడు (41; 34 బంతుల్లో 3×4, 2×6), షేన్ వాట్సన్ (42; 38 బంతుల్లో 1×4, 3×6), రవీంద్ర జడేజా (25 నాటౌట్; 10 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో మొదట చెన్నై 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ 8 వికెట్లకు 147 పరుగులే చేసి ఓడింది. కేన్ విలియమ్సన్ (57; 39 బంతుల్లో 7×4) పోరాడినా ఫలితం లేపోయింది. చెన్నై బౌలర్లు కర్ణ్ శర్మ (2/37), డ్వేన్ బ్రావో (2/25) తలో రెండు వికెట్లు తీశారు.

వైడ్ లైన్ మీదుగా వెళ్లి:
ఈ మ్యాచ్‌లో మిస్టర్ 'కెప్టెన్ కూల్' ఎంఎస్ ధోనీ.. హాట్ అయ్యాడు. మహీ కోపాన్ని చూసి ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ బయపడిపోయాడు. దాంతో తన నిర్ణయాన్నే మార్చుకున్నాడు రీఫెల్. విషయంలోకి వెళితే... సన్‌రైజర్స్ విజయం సాధించాలంటే చివరి రెండు ఓవర్లలో 27 పరుగులు చేయాలి. 19వ ఓవర్ చేసేందుకు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌కు దిగాడు. మొదటి బంతికి రషీద్ ఖాన్ రెండు పరుగులు చేశాడు. రెండో బంతిని ఠాకూర్ వైడ్ యార్కర్‌గా వేశాడు. ఆ తరువాతి బంతిని కూడా బ్యాట్స్‌మెన్‌కు అందకుండా వేయడానికి ప్రయత్నించాడు ఠాకూర్. అదీ వైడ్ యార్కర్‌గానే వెళ్లింది. రషీద్ ఖాన్ పక్కకు జరిగి షాట్ ఆడినా.. బంతి కనెక్ట్ కాలేదు. వైడ్ లైన్ మీదుగానే బంతి వెళ్లి కీపర్ ఎంఎస్ ధోనీ చేతుల్లో పడింది.
నిర్ణయాన్ని మార్చుకున్న అంపైర్:
ఆ బంతిని ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ వైడ్‌గా ప్రకటించబోయాడు. వైడ్ ఇచ్చే క్రమంలో రెండు చేతులను చాపబోయాడు. అదే సమయంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ గట్టిగా అరిచాడు. వైడ్ కాదంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. వికెట్ల వెనకల నుంచి ధోనీ పిచ్ వద్దకు వచ్చి.. అది వైడ్ కాదని చెప్పాడు. దీనితో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వైడ్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో రెండో బంతి పరుగు రాలేదు. డగౌట్‌లో ఉన్న వార్నర్.. అంపైర్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. నిజం చెప్పాలంటే అది వైడ్ బాల్. రీప్లేలోకూడా ఈ విషయం స్పష్టంగా తెలిసింది.

చెన్నై జట్టుకే ఫెయిర్ ప్లే అవార్డు:
హైదరాబాద్-చెన్నై మ్యాచుకు వ్యాఖ్యానం చేస్తున్న మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కెవిన్ పీటర్సన్ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 'బంతి బ్యాట్‌ను తాకినట్లయితే.. క్యాచ్ అయ్యేది. కానీ నేరుగా ఎంఎస్ ధోనీకి వెళ్లింది' అని గవాస్కర్ అనగా.. 'అంపైర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నా' అని పీటర్సన్ పేర్కొన్నాడు. ఇక సోషల్ మీడియాలో ఎంఎస్ ధోనీపై ఫాన్స్ సెటైర్లు వేస్తున్నారు. 'ఇదేందయ్యో ఇది' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'చెన్నై జట్టుకే ఫెయిర్ ప్లే అవార్డు' ఇవ్వాలి' అని మరోకరు ట్వీట్ చేశారు. ధోనీ అరిస్తే.. కొన్నిసార్లు అంపైర్లు కూడా ఒత్తిడికి లోనవుతారు అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మీమ్‌లు ట్రెండ్ చేస్తున్నారు.

127 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి:
ఏదేమైనా 127 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాల్ రీఫెల్ ఆటగాళ్ల ఒత్తిడితో ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించింది. కనీసం థర్డ్ అంపైర్ సాయం కోరినా.. పారిపోయేది. అలా చేయకుండా మహీ అరవగానే తన నిర్ణయాన్ని మార్చుకుని విమర్శల పాలయ్యాడు. రీఫెల్ ఆసీస్ తరఫున 35 టెస్టులు, 92 వన్డేలు ఆడాడు. 104, 106 వికెట్లు కూడా తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications