For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs KXIP: 'తడి బంతులతో కూడా అతడు యార్కర్లు వేయగలడు.. సన్‌రైజర్స్‌కు ఆ సమస్య తీరినట్టే'

IPL 2020: SRH bowling problem sorted out by T Natarajan says Sanjay Bangar

దుబాయ్‌: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ టీ నటరాజన్.. తడి బంతులతో కూడా‌ యార్కర్లు బాగా వేయగలడని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి బంతులతో నటరాజన్‌ బ్యాట్స్‌మెన్లను బోల్తా కొట్టిస్తున్నాడని ప్రశంసించాడు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న టీ20 లీగ్‌లో పంజాబ్‌, హైదరాబాద్‌ జట్ల మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ సందర్భంగా నటరాజన్‌ గురించి బంగర్‌ మాట్లాడాడు.

తడి బంతులతో కూడా యార్కర్లు వేయగలడు:

తడి బంతులతో కూడా యార్కర్లు వేయగలడు:

స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'లో సంజయ్ బంగర్ మాట్లాడుతూ... 'బంతిపై తడి ఉన్నా నటరాజన్‌ యార్కర్లు బాగా వేయగలడు. క్లిష్ట పరిస్థితుల్లో అంతే క్లిష్టమైన బంతులతో నటరాజన్‌ బ్యాట్స్‌మెన్లను బోల్తా కొట్టిస్తున్నాడు. టీ20 క్రికెట్‌ ఫార్మాట్‌లో యార్కర్‌ బంతులు వేయటం కష్టం. అది కూడా బంతిపై తడి ఉన్న సమయంలో వేయటం అసాధ్యం. కానీ నటరాజన్‌ డెత్‌ ఓవర్లరో బౌలింగ్ చేస్తున్న తీరు అద్భుతం' అని అన్నాడు.

ఆ సమస్య తీరినట్టే:

ఆ సమస్య తీరినట్టే:

టీ20 లీగ్‌లో రషీద్‌ ఖాన్‌తో పాటు టీ నటరాజన్‌ అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో నిలుస్తారని సంజయ్ బంగర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. చీలమండల గాయం కారణంగా హైదరాబాద్‌ జట్టు ప్రధాన బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ లీగ్‌ అంతటికీ దూరమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ జట్టుకు డెత్‌ ఓవర్‌ స్పెషలిస్టు బౌలర్‌ విషయంలో ఆందోళన చెందుతోంది. నటరాజన్‌ రూపంలో హైదరాబాద్‌ జట్టుకు మంచి బౌలర్‌ దొరికాడని బంగర్‌ అభిప్రాయపడ్డారు. డిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్‌‌ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు.

మురళీధరన్‌ అండతో:

మురళీధరన్‌ అండతో:

2016-17 టీఎన్‌పీఎల్‌ సీజన్లో 7 మ్యాచుల్లో 11 వికెట్లు తీసిన నటరాజన్‌పై తమిళనాడు క్రికెట్ ‌సంఘం దృష్టిపెట్టింది. ఆ తర్వాత ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టు అతడిని రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ 6 మ్యాచుల్లో 2 వికెట్లే తీసి 115 పరుగులు ఇవ్వడంతో ఆ తర్వాతి సీజన్‌లో అతడిని వదిలేసింది. టీఎన్‌పీఎల్‌లో అతడి ప్రతిభను గమనించిన శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ 2018 వేలంలో హైదరాబాద్‌ తరఫున కొనుగోలు చేసేలా కృషి చేశాడు.

కీలక బౌలర్‌గా:

కీలక బౌలర్‌గా:

అయితే గత రెండేళ్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే అవకాశం టీ నటరాజన్‌కు రాలేదు. ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో 11 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి అదరగొట్టాడు. తమిళనాడుకు డెత్‌ బౌలర్‌గా ఆవిర్భవించాడు. దీంతో ఈ సీజన్‌లో హైదరాబాద్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పడు కీలక బౌలర్‌గా మారాడు. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ లేని లోటును నట్టూ పూడ్చనున్నాడు.

Story first published: Thursday, October 8, 2020, 20:07 [IST]
Other articles published on Oct 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+