For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రేయాస్ అయ్యర్ గాయం తీవ్రమైనదే?: నెక్స్ట్ మ్యాచ్‌కు అవుట్..కీలక మ్యాచ్‌లకు డౌట్?: ధావనే ఇక

IPL 2020: Shreyas Iyer to miss Delhi Capitals next game with Chennai Super Kings?

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో చెలరేగిపోతోన్న ఢిల్లీ కేపిటల్స్‌పై జోరుకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లేఆఫ్ దిశగా దూసుకెళ్తోన్న ఆ జట్టు ఒక్కసారిగా గాయాల బారిన పడింది. వరుస గాయాలు ఢిల్లీ కేపిటల్స్ విజయావకాశాలపై ప్రభావం చూపొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే ముగ్గురు క్రికెటర్లు గాయాల పాలయ్యారు. అందులో ఇద్దరు మొత్తం టోర్నమెంట్‌కే దూరం అయ్యారు. మరొకరు ఎప్పుడు క్రీజ్‌లో దిగుతారో తెలియదు. ఇంతలోనే.. ఢిల్లీ కేపిటల్స్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా గాయాలబారిన పడటం కలకలం రేపుతోంది.

భుజం గాయంతో..

భుజం గాయంతో..

ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న టాప్-3 బ్యాట్స్‌మెన్లలో ఒకడు.. శ్రేయాస్ అయ్యర్. తన జట్టుకు విజయాలను అందించడమనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆడుతున్నాడు. అనూహ్య ఫలితాలను రాబట్టుకుంటున్నాడు. కేప్టెన్సీ ఒత్తిడి ఉన్నప్పటికీ.. దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాడు. బ్యాట్‌తో తానేమిటో రుజువు చేసుకుంటున్నాడు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో ఆరితేరాడు. ఓడిపోయే మ్యాచ్‌లను కూడా గెలిపిస్తున్నాడు. బుధవారం రాత్రి దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ దీనికి నిదర్శనంగా తీసుకోవచ్చు. అదే మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడటం.. అర్ధాంతరంగా ఫీల్డ్ నుంచి వెళ్లిపోవడం ఆందోళనకు దారి తీసింది.

ఎడమ భుజానికి..

ఎడమ భుజానికి..

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో బంతిని ఆపే ప్రయత్నంలో కిందపడ్డాడు. అతని ఎడమ భుజానికి గాయమైంది. ఫిజియో సూచనల మేరకు గ్రౌండ్ నుంచి బయటికెళ్లాడు. అతను అర్ధాంతరంగా డ్రెస్సింగ్ రూమ్‌కు చేరిన తరువాత శిఖర్ ధావన్ కేప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం తీవ్రతపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని శిఖర్ ధావన్ వెల్లడించినప్పటికీ.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.

చెన్నైతో మ్యాచ్‌కు అవుట్?

చెన్నైతో మ్యాచ్‌కు అవుట్?

ఈ పరిస్థితుల్లో ఢిల్లీ కేపిటల్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ కేపిటల్స్.. తన తదుపరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొనబోతోంది. శనివారం సాయంత్రం ఈ మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్‌కు శ్రేయాస్.. దూరం కావడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే వ్యవధి ఉండటం వల్ల గాయం నుంచి కోలుకోలేకపోవచ్చని అంటున్నారు. నొప్పి తగ్గినప్పటికీ.. అతనికి విశ్రాంతి ఇవ్వొచ్చని చెబుతున్నారు. మున్ముందు మరిన్ని కఠిన మ్యాచ్‌లను ఎదుర్కొనాల్సి ఉన్నందున.. ముందుజాగ్రత్తగా శ్రేయాస్‌కు రెస్ట్ కల్పిస్తారని తెలుస్తోంది.

ఇషాంత్.. అమిత్ మిశ్రా.. రిషభ్ పంత్..

ఇషాంత్.. అమిత్ మిశ్రా.. రిషభ్ పంత్..

ఢిల్లీ కేపిటల్స్.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నప్పటికీ.. గాయలు వీడట్లేదు. ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా ఆ జట్టు మీదికి దాడి చేస్తున్నాయి. ఇప్పటికే అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ గాయాలతోనే టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఇషాంత్ శర్మ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే తిరుగుముఖం పట్టాడు. సీజన్ ప్రారంభంలో గాయపడ్డ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. కొన్ని మ్యాచ్‌లకు డగౌట్‌కే పరిమితం అయ్యాడు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌దీ అదే పరిస్థితి. గాయం కారణంగా రిషభ్ పంత్ ఆడట్లేదు. కనీసం రెండు మ్యాచ్‌లు అతను ఆడలేెపోవచ్చని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో జట్టు కేప్టెన్సీ భారాన్ని శిఖర్ ధావన్ మోయాల్సి ఉంది.

Story first published: Thursday, October 15, 2020, 12:18 [IST]
Other articles published on Oct 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+