Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020:ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్:బెన్‌స్టోక్స్ వచ్చేస్తున్నాడా..?ఆసక్తి రేకెత్తిస్తోన్న షేన్‌వార్న్

IPL 2020: Shane warne hints about Ben Stokes entry to Rajasthan Royals

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న ఐపీఎల్‌ మెగాటోర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. బంతి పడితే బౌండరీలోనే కనిపించాలన్న కసితో బ్యాట్స్‌మెన్ రగిలిపోతుండగా... ఎలాగైనా సరే వికెట్‌ గాల్లోకి ఎగరాలనే ప్రయత్నం బౌలర్లు చేస్తున్నారు. దీంతో క్లీన్ బౌల్డ్, అద్భుతమైన క్యాచ్‌లు, మెరుపులాంటి సిక్సర్లు ఇలా అన్నీ ఈ ధనాధన్ టోర్నీలో కనిపిస్తున్నాయి. ఇక ఈ టోర్నీలో ఒక జట్టు గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. అదే రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఈ జట్టుకు ప్రధాన ఆయువుగా ఉన్న ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ బెన్‌ స్టోక్స్ దూరం కావడం ఒక్కింత ఆందోళనకరమైన విషయమైనప్పటికీ... ఆ జట్టు మాత్రం అద్భుతంగా రాణిస్తోంది. అయితే బెన్‌స్టోక్స్ తిరిగి జట్టులోకి వస్తాడా రాడా అనేదానిపై షేన్‌వార్న్ ఒక చిన్న హింట్ ఇచ్చాడు.

 బెన్‌ స్టోక్స్ వచ్చేస్తున్నాడా..?

బెన్‌ స్టోక్స్ వచ్చేస్తున్నాడా..?

బెన్ స్టోక్స్... ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బంతి బౌండరీ దాటిందా లేదా అన్న టైపులో బాల్‌ను బలంగా బాదగలిగే సత్తా ఉన్న ఆల్‌రౌండర్. ఇటు బంతితోను మ్యాజిక్స్ క్రియేట్ చేయగల సత్తా ఉన్న ఆటగాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరపున ఎంపికైనా బెన్‌ స్టోక్స్ ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే బెన్‌స్టోక్స్ తిరిగి జట్టులో చేరుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2020లో భాగంగా రెండు మ్యాచుల్లో గెలుపొందిన తర్వాత బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓటమి చవిచూసింది. దీంతో మళ్లీ బెన్ స్టోక్స్ పేరు వినిపించింది. బెన్ స్టోక్స్ ఉండి ఉంటే ఆట మరోలా ఉండేదనే భావన జట్టు యాజమాన్యంలో కనిపించింది.

 ప్రస్తుతం న్యూజిలాండ్‌లో బెన్‌స్టోక్స్

ప్రస్తుతం న్యూజిలాండ్‌లో బెన్‌స్టోక్స్

ఇక బౌలింగ్ విభాగంలో కూడా బెన్‌ స్టోక్స్ ప్రధాన వనరుగా ఉన్నాడు. స్టోక్స్ ఉంటే బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కూడా బలోపేతం అవుతుంది. ప్రస్తుతం బెన్‌స్టోక్స్ జట్టులో చేరడంపై కాస్త క్లారిటీ వచ్చింది. తన తండ్రికి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతుండటంతో ఈ వరల్డ్ కప్ స్టార్ స్టోక్స్ న్యూజిలాండ్‌లో తన కుటుంబంతో పాటు ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు జట్టు ఫ్రాంచైజీ కూడా బెన్‌ స్టోక్స్ పై ఎలాంటి అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తున్న షేన్‌వార్న్ మాత్రం ఒక అప్‌డేట్ ఇచ్చాడు. ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్ టోర్నీ మొత్తానికి అందుబాటులో లేకుండా ఉండడని ఏదో ఒక సమయంలో జట్టులో చేరతాడనే హింట్ ఇచ్చాడు ఈ మాజీ స్పిన్ మాంత్రికుడు. ఐపీఎల్ 2020లో బెన్ ఆడుతాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు లెజండరీ స్పిన్నర్ షేన్ వార్న్.

 షేన్‌వార్న్ చెబుతున్నదేంటి..?

షేన్‌వార్న్ చెబుతున్నదేంటి..?

జట్టులో ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ప్రస్తుతం జట్టు ప్రదర్శన అదిరిపోయేలా ఉందన్నాడు షేన్ వార్న్. ఇక బెన్‌స్టోక్స్ కూడా జట్టులో చేరితే జట్టు దుర్భేద్యంగా మారుతుందని జోస్యం చెప్పాడు షేన్ వార్న్. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ఆడిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ఆడి ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అని చెప్పాడు షేన్‌వార్న్. ఇక బెన్‌స్టోక్స్ త్వరలో రాజస్థాన్ రాయల్స్‌ జట్టులో చేరతాడనే వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి.అది కూడా అక్టోబర్ తొలివారంలోనే జాయిన్ అవుతాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ వార్తలకు బలం చేకూరుస్తూ న్యూజిలాండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను సైతం బెన్‌ స్టోక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. మొత్తానికి బెన్‌స్టోక్స్ తిరిగి జట్టులో చేరితే ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Story first published: Thursday, October 1, 2020, 11:32 [IST]
Other articles published on Oct 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+